F2 ని మించిన కామెడీ మా ” క్రేజీ కేజీ ఫీలింగ్” లో ఉంటుంది – దర్శకుడు సంజయ్

Published On: March 1, 2019   |   Posted By:

F2 ని మించిన కామెడీ మా ” క్రేజీ కేజీ ఫీలింగ్” లో ఉంటుంది – దర్శకుడు సంజయ్

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం  ” క్రేజీ క్రేజీ ఫీలింగ్ “. సంజయ్ కార్తీక్ దర్శకుడు.  విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటించారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం మార్చ్ 1 న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అవుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్ ద్వారా బాపిరాజు గారు విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ లో ప్రెస్ మీట్ జరిగింది.


దర్శకుడు సంజయ్ కార్తీక్ మాట్లాడుతూ… కుటుంబంతో కలిసి చూసే వినోదాత్మక చిత్రమిది. చక్కటి ఫ్యామిలీ సినిమా. ఇటీవలే ఎఫ్ 2 సినిమా కామెడీ తో అలరించింది. అంతకుమించిన కామెడీ మా సినిమాలో ఉందని ధీమాగా చెప్పగలను.

మా హీరో విశ్వంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్ చాలా బాగా చేసింది. టీం అందరూ బాగా సహకరించారు. ఈ సినిమాకు కారణమైన నిర్మాత నూతలపాటి మధు గారికి స్పెషల్ థాంక్స్ చెప్పాలి. నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. బాపిరాజు గారు గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. భీమ్స్ బ్యాక్ బోన్ గా నిలిచారు. అని అన్నారు. 
హీరో విశ్వాంత్ మాట్లాడుతూ… ఈ సినిమా ఇంత బాగా జరగడానికి కారణం డైరెక్టర్ సంజయ్ కార్తీక్. నేను ఫస్ట్ డే కథ విన్నప్పటి నుంచి మిస్ కమ్యూనికేషన్ లేకుండా చేశాడు. థాంక్స్ టూ సంజయ్. ఈయనకు పెద్ద బ్రేక్ రావాలి. నేను నటించిన సినిమా వన్ ఇయర్ తర్వాత రిలీజ్ అవుతోంది. పెద్ద రిలీజ్ అవ్వాలనుకున్నాను.. గతంలో నేను చేసిన కేరింత, మనమంతా మంచి సినిమాలు ఎక్కువ డ్రామాతో కూడుకున్నవి.  కామెడీ నేను గతంలో చేయలేదు. సినిమాలో కామెడీ చేయడం చాలా కష్టం. అది నాకు ఈజీ అయ్యిందంటే కారణం మా డైరెక్టర్. మా డైరెక్టర్ క్రేజీ మ్యాన్. సెట్లో మంచి ఎనర్జీ ఉండేది. టీం అందరికీ థాంక్స్ చెబుతున్నాను. మ్యూజిక్ భీమ్స్ అందించారు. చాలా థాంక్స్. మా కోడైరెక్టర్ శ్రీనివాస్ గారు. సాయి కి స్పెషల్ థాంక్స్. చాలా కష్టపడ్డారు. పాలక్ మంచి యాక్ట్రెస్. తనకు బిగ్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. మార్చి 1 న మా సినిమా విడుదల అవుతోంది. చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా.  అని అన్నారు. 


మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ… మా డైరెక్టర్ సంజయ్ చాలా కష్టపడ్డాడు. హిట్ కొడతాడు. అందరికి మంచి పేరు తెచ్చే సినిమా. మా హీరో హీరోయిన్ చాలా బాగా చేశారు. మ్యూజికల్ గా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది అని అన్నారు. 


హీరోయిన్ పాలక్ మాట్లాడుతూ… సంజయ్ గారికి చాలా థాంక్స్ మంచి పాత్ర ఇచ్చారు. హీరోయిన్ గా నాకు మంచి సినిమా. మా హీరో విశ్వంత్ తో కలిసి చేయడం చాలా హ్యాపీ. సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నా. అని అన్నారు. 


నటీనటులు : విష్వoత్ , పల్లక్ లల్వాని ,వెన్నెల కిశోర్ , ఫిదా ఫేమ్ శరణ్య , సుమన్ , పోసాని తదితరులు


సాంకేతిక వర్గంబ్యానర్ – విజ్ఞత ఫిలిమ్స్ పతాకంసంగీతం – భీమ్స్ సిసిరోలియో, సాహిత్యం – సురేష్ ఉపాధ్యాయ , కాసర్ల శ్యామ్ , కెమెరా – సుభాష్ దొంతి , ఆర్ట్ – నాగు , కొరియోగ్రఫీ – రాజకిరణ్ , చార్లీపిఆర్వో – ఏలూరు శ్రీనునిర్మాత – నూతలపాటి మధుకథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – సంజయ్ కార్తీక్