గౌతమ్ నంద ట్రయిలర్ రివ్యూ

Published On: July 17, 2017   |   Posted By:

గౌతమ్ నంద ట్రయిలర్ రివ్యూ

గౌతమ్ నంద.. గోపీచంద్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో నటిస్తున్న సినిమా. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిచ్ నెస్ తో ఎట్రాక్ట్ చేస్తోంది. మొదట స్టయిలిష్ లుక్ తో గోపీచంద్ ఫొటోలు రిలీజ్ చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత రిచ్ లుక్ లో ఉన్న టీజర్ రిలీజ్ చేశారు. అది కూడా హిట్ అయింది. తాజాగా అంతే రిచ్ నెస్ ఉన్న ట్రయిలర్ లాంచ్ చేశారు. ట్రయిలర్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు రిచ్ నెస్ కొట్టొచ్చినట్టు కనిపించింది.

మంచి కథతో పాటు, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన గౌతమ్ నంద సినిమా.. గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా నిలిచింది. కథపై పూర్తి నమ్మకంతో నిర్మాణ విలువల్లో ఏమాత్రం రాజీ పడకుండా డబ్బు ఖర్చుచేశారు నిర్మాతలు భగవన్. పుల్లారావు. వాళ్లకు ఖర్చుకు తగ్గ అవుట్ పుట్ చూపించాడు దర్శకుడు సంపత్ నంది.

ఓవరాల్  గా గౌతమ్ నంద ట్రయిలర్ రిచ్ విజువల్స్ తో, అదిరిపోయే తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో గ్రాండియర్ గా ఉంది. ముద్దుగుమ్మలు హన్సిక, క్యాథరీన్.. ఆ భారీతనాన్ని మరింత పెంచారు. ఈనెల 28న థియేటర్లలోకి వస్తున్నాడు గౌతమ్ నంద.