IPC 376 చిత్రం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్

Published On: July 27, 2020   |   Posted By:

IPC 376 చిత్రం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్

నందిత శ్వేత  “IPC 376” ట్రైలర్ కు మంచి రెస్పాన్స్, బిజినెస్ సర్కిల్స్
లో మంచి ఆఫర్లు

పవర్ కింగ్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ప్రభాకర్ సమర్పణలో హీరోయిన్ నందిత
శ్వేతా ప్రధాన పాత్రలో వస్తోన్న  IPC 376. రాజ్ కుమార్ సుబ్రమన్
దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు,తమిళం లో తెరకెక్కింది.ఈ మూవీ ట్రైలర్
రీసెంట్ గా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.హారర్ర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్
తో ఆద్యాంతం ఆకట్టుకునేలా ఉందీ ట్రైలర్..అంతే కాదు ట్రైలర్ రిలీజయిన
వెంటనే అటు తెలుగు,తమిళ ఇండస్ట్రీ నుండి మూవీ ఆఫీస్ కు బిజినెస్ కోసం
ఆఫర్లు వస్తున్నాయి. సాటిలైట్,డిజిటల్ రైట్స్ కోసం కాల్స్ వస్తుండటం
సంతోషంగా ఉందంటున్నారు మేకర్స్. త్వరలోనే ఒక మంచి డీల్ ఫిక్స్ చేసి
బిజినెస్ క్లోజ్ చేస్తామంటున్నారు నిర్మాత ప్రభాకర్.

ఒక బంగ్లాలో జరిగే అనూహ్య ఘటనలు పోలీసులకు ఎలాంటి సవాళ్లు విసిరాయి? అనే
కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నందిత
శ్వేత నటించింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకంటున్న ఈ మూవీ
థియేటర్లు ఓపెన్ అవ్వగానే సినిమా రిలీజ్ కానుంది.