పచ్చీస్ మూవీ రివ్యూ

Published On: June 13, 2021   |   Posted By:

పచ్చీస్ మూవీ రివ్యూ

 

క్రైమ్ థ్రిల్ల‌ర్‌ : ‘పచ్చీస్’ మూవీ రివ్యూ  

Rating:: 2.5/5

క్రైమ్ డ్రామా, పోలీసు ఇన్వెస్టిగేష‌న్‌, క్లైమాక్స్‌లో ఓ ట్విస్టు ఇవీ ఈ మద్యకాలంలో ఓటీటిలో రిలీజయ్యే సినిమాల తీరు.అవన్ని అదే వరసలో ఉంటాయని  ప్రేక్ష‌కుడు ముందే ఊహించటం మరో ట్విస్ట్. ఆ ట్విస్ట్ లను దాటే కీలక మ‌లుపు ఉంటే ఈ సినిమా హిట్. తాజాగా ఓటీటిలో రిలీజైన పచ్చీస్ కూడా అదే తీరులో జరిగే సినిమా. అయితే ఈ సినిమా కథ మన ఊహలకు అందేలా ఉంటుందా..లేక మన నాలెడ్జ్ ని, ఇంటిలిజెన్స్ ని దాటేస్తుందా,చూడచ్చా, చూడగలమా వంటి విషయాలు తెలియాలు రివ్యూలో చూద్దాం.
 
స్టోరీ లైన్

ఈజీ మనీకు అలవాటుపడ్డ అభిరాం(రామ్స్) గాంబ్లింగ్ లో పాతిక లక్షలు ఆర్కే (ర‌వివ‌ర్మ‌) ద‌గ్గ‌ర బాకీ ప‌డ‌తాడు. ఆర్కే తన అప్పు తీర్చకపోతే చంపేసి వసూలు చేసుకునే రకం. ఈ విషయం తెలిసి భయంతో తిరుగుతూంటాడు. ఈ సమస్య నుంచి బయటపడాలనే ఆలోచనతో ఆధిపత్యం కోసం కొట్టుకుంటున్న ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య దూరుతాడు. బసవరాజు(కొమ్మిడి విశ్వేందర్ రెడ్డి), గంగాధర్(శుభలేఖ సుధాకర్)లతో గేమ్ మొదలుపెడతాడు. గంగాధర్ మ‌నుషుల్లో ఒక‌రు అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్‌. ఆ విష‌యం బ‌స‌వ‌రాజుకి తెలుసు. అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్ అని భావించిన ఓ వ్య‌క్తిని.. గంగాధర్ మ‌నుషులు చంపేస్తారు. కానీ.. అస‌లు పోలీస్ వాడు ఆ గ్యాంగ్ లోనే తిరుగుతూనే ఉంటాడు.

ఈ విషయం గమనించిన అభిరాం..ఆ విషయమై ప్లే మొదలెడతాడు. ఆ అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్ నాకు తెలుసు అంటూ గంగాధర్ మ‌నుషుల‌కు ఫోన్ చేస్తాడు. అంతేకాదు ఆ వ్య‌క్తి పేరు చెప్పాలంటే కోటి రూపాయ‌లు కావాల‌ని డిమాండ్ చేస్తాడు. అక్క‌డి నుంచి రామ్ కోసం. మ‌ల్లికార్జున్ మ‌నుషుల వేట మొద‌ల‌వుతుంది. ఇది ఊహించని మలుపులు ప్రమాదాలకు దారి తీస్తుంది. మరో ప్రక్క సోదరుడి కోసం వెతుకుతున్న అవంతిక(శ్వేతా వర్మ)కథలో ప్రవేశిస్తుంది. అసలు ఆ పచ్చీస్(పాతిక)లక్షల బాకీని తీర్చడానికి అభిరామ్ మొదలుపెట్టిన ఆట ఎక్కడికి వెళ్తుందో సినిమాలో చూడాలి.

ఎనాలసిస్ …

మొదటి సీన్ నుంచే.. కథలోకి వెళ్లిపోవటం, కథ నుంచి ప్రక్కకు వెళ్లటం వంటివి చేయకుండా లోపలకి వెళ్లిపోయారు.  అలాగే సైడ్ ట్రాకుల్లాంటి సబ్ ప్లాట్ లు, రొమాంటిక్ సీన్లు లేనే లేవు. బొర్ కొట్టే పాట‌ల్లేవు. కేవ‌లం క‌థని మాత్రమే నమ్మి చేసారు. అయితే కొన్ని విషయాల్లో క్లారిటీ సరిగ్గా ఇవ్వలేదు. డైరక్టర్ రియ‌లిస్టిక్  కథని నడిపాడు. మెలో డ్రామా వైపు టర్న్ తీసుకోలేదు. హీరో క్యారక్టరైజేషన్ చాలా సెల్ఫిష్ గా నడించారు. అది కథకు బాగా ప్లస్ అయ్యింది.  అలాగే  అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్ అనుకుని… ఓ వ్య‌క్తిని హ‌త్య చేయ‌డం, హ‌త్య గావింప‌బ‌డిన వ్య‌క్తి గురించి, ఓ అమ్మాయి అన్వేష‌ణ మొద‌లెట్ట‌డం బాగున్నాయి. కథలో పాయింట్ కొత్తదే అయినా…లెంగ్త్ కు సరిపడ కథ మాత్రం లేదు. దాంతో కొంత సాగిన ఫీలింగ్ వచ్చింది. ట్రీట్మెంట్ ఇంకాస్త జాగ్రత్తపడి, సినిమాటెక్ అంశాలు కూడా కలిపి ఉంటే సినీ ఎక్సపీరియన్స్ వచ్చేది. అలా లేకపోవటంతో ఏదో పెద్ద షార్ట్ ఫిల్మ్ చూసినట్లు అనిపించింది.  ఈ సినిమాకి క్లైమాక్స్ ట్విస్ట్ కీల‌కం. అదే సినిమాను నిలబెట్టింది. టైట్  స్క్రీన్ ప్లే ఈ కథకు కలిసొస్తే ..ఇంకా బాగుండేది.

దర్శకత్వం,మిగతా విభాగాలు

టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో సినిమా ఉంది. కెమెరా వ‌ర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి మార్కులు ప‌డ‌తాయి. ఆర్ట్ డిపార్టమెంట్ కూడా చ‌క్క‌గా ప‌నిచేసింది. డైలాగులు నాచురల్ గా ఉన్నాయి.  డైరక్టర్ కు తొలి చిత్రమైనా బాగా డీల్ చేసాడు.

నటీనటుల్లో నాగార్జున, విజయ్‌ దేవరకొండ, రామ్, రానా, అడివి శేషు ఇలా చాలా మందికి ఫ్యాషన్‌ డిజైనరైన  రామ్స్‌ కి న‌టుడిగా ఇదే తొలి సినిమా. అభిరామ్ గా… ఆ పాత్ర‌లో ఒదిగిపోయాడు. ఆర్కేగా కొత్త గా కనిపించాడు ర‌వి వ‌ర్మ‌.  
 
చూడచ్చా
 
రియ‌లిస్టిక్ చిత్రాలు, థ్రిల్ల‌ర్స్ ఇష్ట‌ప‌డేవాళ్ల‌కు ప‌చ్చీస్ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది.

నటీనటులు : రామ్స్, శ్వేతా వర్మ, రవి వర్మ, జై చంద్ర తదితరులు
దర్శకత్వం : శ్రీ కృష్ణ, రామ సాయి
నిర్మాత‌లు : కౌశిక్ కుమార్, రామ సాయి
సంగీతం : స్మరన్ సాయి
సినిమాటోగ్రఫర్ : కార్తీక్ పార్మర్
ఎడిటర్ :  రానా ప్రతాప్
రన్ టైమ్: 2 గంటల 7 నిముషాలు
ఓటీటీ: అమెజాన్‌
విడుదల తేదీ: 12, జూన్ 2021