రారండోయ్ వేడుక చూద్దాం ఓవరాల్ కలెక్షన్లు

Published On: July 17, 2017   |   Posted By:

రారండోయ్ వేడుక చూద్దాం ఓవరాల్ కలెక్షన్లు

ఈ సమ్మర్ లో క్లీన్ హిట్ అనిపించుకుంది రారండోయ్ వేడుక చూద్దాం సినిమా. అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది రారండోయ్ వేడుక చూద్దాం సినిమా. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాతగా తెరకెక్కిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. ఈ రోజుతో (జులై 14) 50 రోజుల రన్ కంప్లీట్ చేసుకుంది.

రారండోయ్ వేడుక చూద్దాం వసూళ్లను మేకర్స్ అఫీషియల్ గా విడుదల చేయలేదు. కానీ ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం.. ఈ సినిమాకు ఇప్పటివరకు 52 కోట్ల రూపాయలపైనే గ్రాస్  వచ్చినట్టు తెలుస్తోంది. ఇక షేర్ వివరాలు చూస్తే.. అటు ఇటుగా 32 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ సినిమా అన్నపూర్ణ స్టుడియోస్ కు సేఫ్ వెంచర్ కాగా.. నాగచైతన్య కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు కింగ్ నాగార్జున.