శమంతకమణి రివ్యూ

Published On: July 14, 2017   |   Posted By:

Samanthakamani Movie Review

శమంతకమణి రివ్యూ

నటీనటులు – రాజేంద్రప్రసాద్, సందీప్ కిషన్, నారా రోహిత్, సుధీర్ బాబు, ఆది సాయికుమార్, చాందినీ చౌదరి, అనన్య సోనీ

దర్శకుడు – శ్రీరామ్ ఆదిత్య

బ్యానర్ – భవ్య క్రియేషన్స్

నిర్మాత –  ఆనంద్ ప్రసాద్

సంగీతం – మణిశర్మ

విడుదల తేదీ – జులై 14

రేటింగ్ – 3/5

 

మొదట టైటిల్ తో ఎట్రాక్ట్ చేశారు. తర్వాత నలుగురు హీరోలు ఎంటర్ అయ్యేసరికి అందరి దృష్టి శమంతకమణిపై పడింది. అలా ప్రొడక్షన్ స్టేజ్ నుంచే అందరి దృష్టిని ఆకర్షించిన శమంతకమణి థియేటర్లలోకొచ్చింది.

 

తన రెండో సినిమాకు కూడా చిత్రంగా కారునే సెంటర్ పాయింట్ గా తీసుకున్నాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. డెబ్యూ మూవీ భలే మంచిరోజులో కూడా ఇలాంటిదే ఓ వెరైటీ కారును సినిమా మొత్తం తిప్పాడు. ఇప్పుడు శమంతకమణిలో టోటల్ కథనే కారుకు అంకితం చేశాడు. అందులో ఏకంగా నలుగురు హీరోల్ని ఇన్వాల్వ్ చేశాడు. కథ రాసుకున్న విధానం, నలుగురు హీరోల్ని అందులో చూపించిన స్టయిల్, ఎక్కడా ఎంటర్ టైన్ మెంట్ డోస్ తగ్గకుండా తీసుకున్న జాగ్రత్తలు.. శ్రీరామ్ ఆదిత్యను మంచి దర్శకుడిగా నిలబెడతాయి.

 

కథ విషయానికొస్తే ఓ పబ్ దగ్గర శమంతకమణి అనే కారు పోతుంది. అదే  టైమ్ లో అక్కడ ఉమా మహేశ్వర రావు (రాజేంద్రప్రసాద్), కృష్ణ (సుధీర్ బాబు), శివ (సందీప్ కిషన్), కార్తీక్ (ఆది సాయికుమార్) ఉంటారు. దీంతో ఇన్ స్పెక్టర్ రంజిత్ (నారా రోహిత్) వాళ్లందర్నీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తాడు. అక్కడ్నుంచి కారు ఎలా మిస్ అయింది.. అసలు వీళ్లంతా అక్కడ ఎందుకున్నారు.. వాళ్ల ఫ్లాష్ బ్యాక్ లు ఏంటి లాంటి త్రెడ్స్ ను ఎంటర్ టైనింగ్ గా చెప్పుకొచ్చాడు దర్శకుడు.

 

మల్టీస్టారర్ సినిమాల్లో ఇగోస్ ఎక్కువ. అందుకే తెలుగులో అలాంటి కథలు రావు. స్క్రీన్ స్పేస్ తగ్గిపోతుందని హీరోల భయం. శమంతకమణిలో ఆ ప్రాబ్లమ్ లేదు. హీరోలందరితో పాటు రాజేంద్రప్రసాద్ కూడా మంచి పాత్రలు దక్కాయి. ఎవరూ తగ్గలేదు. ఎవరి క్యారెక్టర్ వాళ్లది. కథ అలాంటిది మరి. కానీ ఓవరాల్ గా చూస్తే ఆది సాయికుమార్ (ఈ సినిమాతో తన పేరును ఇలా మార్చుకున్నాడు) పాత్ర బాగా క్లిక్ అయింది. నారా రోహిత్ ఎప్పట్లానే చించేశాడు. సుధీర్ బాబు, సందీప్ కిషన్ ఎమోషన్స్ బాగా పండించారు. వీళ్లతోపాటు రఘుబాబు, ఇంద్రజ, తణికెళ్ల భరణి, సత్యం రాజేష్ చక్కగా చేశారు.

 

టెక్నికల్ గా చూస్తే ఎక్కువ మార్కులు మణిశర్మకే ఇవ్వాలి. ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో మణిశర్మ మరోసారి తన మేజిక్ చూపించాడు. ఇక సినిమాటోగ్రాఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ప్లస్ అయ్యాయి.

 

అంతా బాగుంది కానీ అంతా ఆశించిన ఎంటర్ టైన్ మెంట్ మాత్రం మూవీలో కాస్త తగ్గినట్టు అనిపించింది. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ లో కామెడీ పండించాల్సిన చోట కథనే నమ్ముకున్నాడు దర్శకుడు.  మంచి మసాలా పాట పెట్టాల్సిన చోట కూడా గాడి తప్పలేదు. వీటికి తోటు ఫస్టాఫ్ లో పాత్రల పరిచయానికే చాలా టైం పట్టింది. ఇవన్నీ బి, సి సెంటర్ ఆడియన్స్ ను నిరాశపరుస్తాయి.

ఓవరాల్ గా ఓ మోస్తరు కామెడీ కోరుకునే వాళ్లకు, నలుగురు హీరోల్ని ఒకే ఫ్రేములో చూడాలనుకునేవాళ్లకు శమంతకమణి నచ్చుతుంది.