`సువ‌ర్ణ సుంద‌రి` మోషన్ పోస్టర్ రివ్యూ

Published On: July 17, 2017   |   Posted By:

`సువ‌ర్ణ సుంద‌రి` మోషన్ పోస్టర్ రివ్యూ

ఇటీవ‌ల‌ హిస్ట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాల వెల్లువ మొద‌లైంది. ప‌్ర‌స్తుతం మ‌న ఫిలింమేక‌ర్స్ చ‌రిత్ర నేప‌థ్యంలో సినిమాలు తీసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. హిస్ట‌రీ బేస్ చేసుకుని ఇటీవ‌ల ఓ రెండు భారీ క్రేజీ చిత్రాలు తెలుగులో రిలీజై చ‌క్క‌ని విజ‌యం సాధించాయి. ఇప్పుడు ఈ కోవ‌లోనే హిస్ట‌రీ బేస్ చేసుకుని మ‌రో ఆస‌క్తిక‌ర చిత్రం టాలీవుడ్‌లో తెర‌కెక్కుతోంది. క‌థ‌, కాన్సెప్ట్ ప్ర‌ధానంగా చ‌రిత్ర‌ను ఆవిష్క‌రిస్తూ తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `సువ‌ర్ణ సుంద‌రి`. `చ‌రిత్ర ఎప్పుడూ భ‌విష్య‌త్‌ని వెంటాడుతుంది` అనేది ట్యాగ్‌లైన్‌. ఎస్‌.టీమ్ పిక్చర్స్ బ్యానర్ పై ఎమ్.ఎల్ లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే లాంచ్ చేసిన ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది.

మోషన్ పోస్టర్ తోనే సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు ఈమధ్య చాలా సినిమాలు ట్రైచేస్తున్నాయి. కొన్ని సినిమాలు అలా సక్సెస్ అయ్యాయి కూడా. తాజాగా సువర్ణ సుందరి సినిమా కూడా మోషన్ పోస్టర్ తో హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో వాడిన హై-ఎండ్ గ్రాఫిక్స్, ఫొటోలు అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

ఇది సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ. 1509 సంవ‌త్స‌రం చ‌రిత్ర‌లో ప్రారంభ‌మై, ఈ ఏడాది (2017) వ‌ర‌కూ.. నాలుగు శ‌తాబ్ధాల్లో జ‌రిగే క‌థ ఇది. కాలాదుల్ని బ‌ట్టి వేర్వేరు లొకేష‌న్ల‌లో చిత్రీక‌ర‌ణ చేశారు. బీద‌ర్‌, కేర‌ళ‌, కాల‌క్క‌ల్‌, అనంత‌పూర్‌, హైద‌రాబాద్, బెంగ‌ళూరు త‌దిత‌ర చోట్ల చిత్రీక‌ర‌ణ జరిపారు.  ట్రోల‌ర్ కాస్ట‌ర్స్ స్క్రీన్‌ప్లేలో క‌థ ఉంటుంది. చ‌రిత్ర ఎప్పుడూ విజ‌యాల‌ గురించి చెబుతుంది. అయితే చ‌రిత్ర‌లో బ‌య‌టికి తెలీని చీక‌టి కోణాలుంటాయి. అలాంటి ఓ చీక‌టి కోణం ఇప్ప‌టివ‌ర‌కూ ర‌క‌ర‌కాల జ‌న‌రేష‌న్ల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపించింది అన్న‌దే ఈ సినిమా స్టోరీ. పూర్ణ‌, సాక్షి చౌద‌రి నటన, గ్రాఫిక్స్.. సినిమాకు మేజర్ హైలెట్ అంటున్నారు.

చుక్కల్ని తాకిన పవన్ కల్యాణ్ కొత్త సినిమా బిజినెస్
మార్కెట్ వాల్యూ మరింత పెంచుకున్న నాని