అంతరిక్షం చిత్రం పాత్రికేయుల సమావేశం
తెలుగులో తొలి స్పేస్ థ్రిల్లర్ సినిమా ఇది-క్రిష్
మెగా హీరో వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి , అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అంతరిక్షం 9000 KMPH’.. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకుడు.. దర్శకుడు జాగర్లమూడి క్రిష్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సాయి బాబు జాగర్లమూడి , రాజీవ్ రెడ్డి నిర్మించారు. డిసెంబర్ 21 న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా దూసుకుపోతున్నది.
సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
క్రిష్ మాట్లాడుతూ అంతరిక్షం సినిమాకు మంచి స్పందన లభిస్తున్నది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన తొలి తెలుగు స్పేస్ థ్రిల్లర్ సినిమా ఇది. సంకల్ప్‌రెడ్డి అద్భుతంగా రూపొందించారు. పిల్లలతో పాటు పెద్దలను ఈ సినిమా మెప్పిస్తుంది. సరికొత్త తెలుగు సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తున్నది. దేవాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు చేసే అద్భుతాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. గమ్యం, కంచె తర్వాత మా ఫస్ట్‌ఫ్రేమ్ బ్యానర్లో మరో గొప్ప చిత్రంగా అంతరిక్షం నిలిచిందితెలిపారు.
వరుణ్‌తేజ్ మాట్లాడుతూ వినూత్నమైన ప్రయత్నాన్ని అందరూ ఆదరించడం ఆనందంగా ఉంది. సినిమాపై కొన్ని విమర్శలు వచ్చాయి. వాటిని స్వీకరిస్తున్నాం. భవిష్యత్‌లో వాటిని పునరావృతం కాకుండా చూసుకుంటాం అని తెలిపారు.
దర్శకుడు సంకల్ప్‌రెడ్డి మట్లాడుతూ వైవిధ్యమైన ప్రయోగాలు మరిన్ని చేయడానికి స్ఫూర్తినిచ్చిన విజయమిది. మన బడ్జెట్లో కొత్త ఆలోచనలతో సినిమాలు తీయవచ్చని నిరూపించింది. సినిమాలో కొన్ని లాజిక్లను మిస్సయ్యాయని అన్నారు. లాజిక్ల ప్రకారం తీస్తే డాక్యుమెంటరీ అయ్యుండేది. ఇదే పాజిటివ్ టాక్‌తో సినిమా దూసుకుపోతుందనే నమ్మకం ఉంది అని అన్నారు.
కొత్త ప్రయత్నంలో తాను భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని అదితిరావ్ హైదరీ చెప్పింది.
Attachments area