అం అః చిత్రం పోస్ట‌ర్ విడుద‌ల

Published On: September 1, 2021   |   Posted By:
 
అం అః చిత్రం పోస్ట‌ర్ విడుద‌ల
 
 
డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘అం అః’ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన హీరో శ్రీకాంత్‌
 
సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘అం అః’. ‘ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్’ ట్యాగ్‌లైన్‌. శ్యామ్ మండ‌ల ద‌ర్శ‌కుడు. రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావుఈ చిత్రాన్ని నిర్మించారు.
 
 
ఈ సినిమా పోస్ట‌ర్ హీరో శ్రీకాంత్ మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో శ్రీకాంత్‌తో పాటు నిర్మాత శ్రీనివాస్‌, ద‌ర్శ‌కుడు శ్యామ్ మండ‌ల‌, హీరో సుధాక‌ర్ జంగం, సినిమాటోగ్రాఫ‌ర్ శివారెడ్డి , లైన్ ప్రొడ్యూసర్ పళని స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
ఈ సంద‌ర్భంగా..
 
 
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘‘అం అః’ మూవీ టైటిల్ చాలా బావుంది. ఇది వ‌ర‌కు నేను కూడా అఆఇఈ అనే టైటిల్‌తో సినిమా చేశాను. ఇప్పుడు ‘అం అః’ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్ట‌ర్ శ్యామ్ మండ‌ల‌, నిర్మాత శ్రీనివాస్‌గారు, హీరో సుధాక‌ర్ ఓ టీమ్‌గా ఏర్ప‌డి మంచి కంటెంట్‌తో సినిమా చేయ‌డం హ్యాపీగా ఉంది. ఎంటైర్ టీమ్‌కు కంగ్రాట్స్‌’’ అన్నారు. 
 
 
నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘మా మూవీ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన శ్రీకాంత్‌గారికి థాంక్స్‌. డైరెక్ట‌ర్ శ్యామ్ మండ‌ల‌గారు అనుకున్న ప్లాన్ ప్ర‌కారం సినిమాను చ‌క్క‌గా పూర్తి చేశారు. శివ‌గారు త‌న‌ సినిమాటోగ్ర‌ఫీతో సినిమాను రిచ్‌గా ఎలివేట్ చేశారు. అలాగే సినిమా బాగా రావ‌డానికి స‌పోర్ట్ చేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌’’ అన్నారు. 
 
 
ద‌ర్శ‌కుడు శ్యామ్  మండ‌ల మాట్లాడుతూ ‘‘మా మూవీ ‘అం అః’  పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన శ్రీకాంత్‌గారికి థాంక్స్‌. క‌రోనా ప‌రిస్థితుల్లోనూ నిర్మాత శ్రీనివాస్‌గారు ఇచ్చిన స‌పోర్ట్‌తో ‘అం అః’ సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేశాను. అంతకు ముందు ఆయ‌నిచ్చిన స‌పోర్ట్‌తోనే “ట్రూ” అనే సినిమాను కూడా పూర్తి చేశాను. నాపై న‌మ్మ‌కంతో శ్రీనివాస్‌గారు ‘అం అః’ సినిమాను ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా బెస్ట్ అందించారు. సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌. సినిమాటోగ్రాఫ‌ర్ శివ‌గారి స‌పోర్ట్‌తో మంచి ఔట్‌పుట్‌ను తీసుకొచ్చాను. లైన్ ప్రొడ్యూస‌ర్ ప‌ళ‌నిగారికి థాంక్స్‌. ఆయ‌న ప్రాజెక్ట్‌ను చ‌క్క‌గా ఎగ్జిక్యూట్ చేశారు. హీరో సుధాక‌ర్ కంటెంట్‌ను న‌మ్మి వ‌ర్క్ షాప్ చేసి చ‌క్క‌టి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ టీమ్‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 
 
 
హీరో సుధాక‌ర్ జంగం మాట్లాడుతూ ‘‘మా సినిమాను న‌మ్మి స‌పోర్ట్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చిన శ్రీకాంత్‌గారికి థాంక్స్‌. కొత్త హీరోను ఇంట్ర‌డ్యూస్ చేసిన మా నిర్మాత శ్రీనివాస్‌గారికి, డైరెక్ట‌ర్ శ్యామ్‌గారికి థాంక్స్‌. ఈ సినిమా కోసం వ‌ర్క్ షాప్ కూడా చేశాం. సినిమాటోగ్రాఫ‌ర్ శివ‌న్న‌, లైన్ ప్రొడ్యూస‌ర్ ప‌ళ‌నిగారికి థాంక్స్‌’’ అన్నారు. 
 
 
సినిమాటోగ్రాఫ‌ర్ శివారెడ్డి మాట్లాడుతూ ‘‘ నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత శ్రీనివాస్‌గారికి, డైరెక్ట‌ర్ శ్యామ్ మండ‌ల‌గారికి, లైన్ ప్రొడ్యూస‌ర్ ప‌ళ‌నిగారికి, హీరో సుధాక‌ర్‌గారికి థాంక్స్‌’’ అన్నారు. 
 
 
నటీన‌టులు:
సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య‌, రామరాజు, రవిప్రకాష్, రాజశ్రీ నాయర్, దువ్వాసి మోహన్, శుభోదయం సుబ్బారావు, తాటికొండ మహేంద్ర నాథ్, గని, ఉన్నికృష్ణన్, మునీశ్వరరావు త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం:
 
ద‌ర్శ‌కుడు:  శ్యామ్ మండ‌ల‌
నిర్మాత‌:  జోరిగె శ్రీనివాస్ రావు
బ్యాన‌ర్స్‌: రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ 
కో ప్రొడ్యూస‌ర్‌: అవినాష్ ఎ.జ‌గ్త‌ప్‌
సినిమాటోగ్రాఫ‌ర్‌:  శివా రెడ్డి సావ‌నం
మ్యూజిక్‌:  సందీప్ కుమార్ కంగుల‌
ఎడిటర్:  జె.పి