Reading Time: < 1 min

అక్టోబర్ మొదటి వారంలో జె.డి. చక్రవర్తి హు మూవీ

జెడి చక్రవర్తి, శుభ రక్ష, నిత్య హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కిన చిత్రం హూ. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. తాజాగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న హు విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రెడ్డమ్మ కె. బాలాజీ మాట్లాడుతూ జెడి చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకున్న ఎమోషనల్‌ థ్రిల్లర్‌ మూవీ హూ. ఇందులో యాక్షన్‌ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచే రీతిలో చిత్రీకరించాం. అలాగే అనేక థ్రిల్లింగ్‌ అంశాలు కూడా ఉన్నాయి. క్లాస్‌, మాస్‌ ప్రేక్షకులను అందరినీ అలరించేలా కంటెంట్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. ఇటీవలే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. అక్టోబర్‌ తొలి వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

నటీనటులు :

జెడి చక్రవర్తి, శుభ, నిత్య, వినయ్‌ ప్రసాద్‌, విజయ్‌ చందర్‌, సునీల్‌ పూర్ణిక్‌, రమేష్‌ పండిట్‌, హర్షిత, ఉగ్రం రవి, శరణ్య, సనత్‌, నాగేంద్ర

సాంకేతికవర్గం :

సంగీతం: ఈశ్వర్‌ చంద్‌
ఎడిటింగ్‌: జెడి చక్రవర్తి
కెమెరా: ఎం.బి. అల్లికట్టి
ప్రొడ్యూసర్‌: రెడ్డమ్మ కే బాలాజీ
దర్శకత్వం: జేడీ చక్రవర్తి