‘అతడే శ్రీమన్నారాయణ’ మూవీ రివ్యూ

Published On: January 1, 2020   |   Posted By:

‘అతడే శ్రీమన్నారాయణ’ మూవీ రివ్యూ

‘స్లో’ మన్నారాయణ (‘అతడే శ్రీమన్నారాయణ’ రివ్యూ)
 
Rating: 2/5

అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ…మోసగాళ్లకు మోసగాడు వంటి కౌబాయ్ సినిమాలు చేసారు. ఆ సినిమాల్లో నిథి వేట ప్రధానాంశంగా సాగుతుంది. ఆ తర్వాత చాలా కాలానికి చిరంజీవి కొదమ సింహం అంటూ కౌబాయ్ తరహా ట్రెజర్ హంట్ సినిమా చేసారు. మళ్లీ మహేష్ బాబు…టక్కరి దొంగ అనే కౌబాయ్ సినిమా చేసారు. కానీ ఆ తర్వాత ఎవరూ ఆ తరహా సినిమా చేయటానికి ధైర్యం చేయలేదు. కానీ కన్నడంలో ఈ ఆలోచన ఓ దర్శకుడుకు వచ్చింది. హీరోని ఒప్పించి…ఈ కాలం హీరోకు, ఆ కాలం కౌబాయ్ సెటప్ కథని కలిపితే ఎలా ఉంటుందనే ధైర్యం చేసారు. కన్నడంలో మూడు రోజుల క్రితం రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. మరి తెలుగులో ఈ సినిమా పరిస్దితి ఏమిటి..ఇక్కడ కూడా వర్కవుట్ అవుతుందా…ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమా పై మంచి ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ చేసింది వాటిని నిలబెట్టుకుంటుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్ ఆఫ్ శ్రీమన్నారాయణ

అప్పుడెప్పుడో అంటే 1980లో అమరావతిలో నాటకాలు వేయటానికి వచ్చిన కొందరు ఓ నిధిని ఎత్తుకుపోతారు. ఈ విషయం తెలిసి అక్కడే ఉన్న అభేరి అనే తెగ నాయకుడు రామ రామ రంగంలోకి దిగుతాడు. వాళ్లను కష్టపడి పట్టుకుని చంపుతాడు. కానీ అదే సమయంలో చిన్న మిస్టేక్ జరుగుతుంది. అదేమిటంటే…ఆ నిథి రహస్యం వాళ్లతో పాటే సమాధి అవుతుంది. దాంతో తన బ్రతికున్నన్నాళ్లు ఆ నిధి కోసం వెతికి అలిసి ఓ రోజు మరణిస్తాడు. ఆ తర్వాత ఆ తెగకు నాయకుడుగా ఆయన కుమారుడు జయరామ సింహాసనం ఎక్కబోతాడు. కానీ అదే సమయంలో తన తండ్రికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి ఆ నిధి దొరికితేనే తాను సింహాసనం ఎక్కుతానని అంటాడు.

అమరావతి అనే ఊళ్ళో నాటకాలు వేసిన ఒక బ్యాచ్ ఒక నిధిని దొంగిలించుకుని పారిపోతుంటుంది. అయితే వాళ్ళను అడ్డుకున్న అభేరి అనే ఒక తెగ నాయకుడు రామ రామ, నిధి కోసం వాళ్ళను చంపుతాడు. అయితే వాళ్ళు చనిపోవడంతో ఆ నిధి ఆచూకీ దొరకదు. అలా పదిహేనేళ్ళు గడిచిపోయాక అభేరి నాయకుడు రామ రామ కూడా చనిపోతాడు. అయితే అతని పెద్ద కొడుకు అయిన జయరామ ఆ రాజ్యానికి నాయకుడు అవుతాడు. కానీ ఆ నిధి ఎక్కడుందో కనిపెట్టే వరకు సింహాసనం ఎక్కను అని ప్రతిజ్ఞ చేస్తాడు. అదే సమయంలో రామ రామ మరోకొడుకు తుకారం సైతం ఈ నిథిని తానే సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు.

ఈ గొడవ ఇలా రసవత్తరంగా జరుగుతున్న టైమ్ లో  శ్రీమన్నారాయణ(రక్షిత్ శెట్టి) అమరావతికి ఎస్.ఐగా వస్తాడు. ఓ టైమ్ లో క్రూరత్వానికే బ్రాండ్ అంబాసిడర్ లాగ ఉన్న జయరామ చేతిలో ఇరుక్కుపోయి,ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ నిధిని కనిపెట్టి ఇస్తానని మాట ఇస్తాడు. అక్కడ నుంచి శ్రీమన్నారాయణ నిథి వేట ప్రారంభమవుతుంది. శ్రీమన్నారాయణ కు ఇది ఓ సవాల్ లాగ, పజిల్ లాగ ఉంటుంది. ఆ ముడి విప్పుతూ ఉంటూంటే కొత్త విషయాలు బయిటకు వస్తాయి.

అదే సమంయలో రామ రామ చేతిలో చనిపోయిన నాటకాల ట్రూప్ వారసులు.. ప్రాణభయంతో సాధారణ జనంలో కలిసిపోయి బ్రతుకుతూంటారు. వారంతా తమను కాపాడటానికి,తమ కష్టాలు తీర్చటానికి శ్రీహరి దిగి వస్తాడని నమ్ముతుంటారు. దాంతో అదే ఊరుకి వచ్చిన శ్రీమన్నారాయణని తాము ఎదురుచూస్తున్న శ్రీహరి అని అనుకుంటారు. అప్పుడు ఏం జరిగింది. శ్రీమన్నారాయణ నిధిని ఎలా పట్టుకున్నాడు. అక్కడ వాళ్లను ఎలా కాపాడాడు. ఇందులో లక్ష్మి (శాన్వి) పాత్రేంటి  అనేది తెరపై చూడాల్సిన మిగతా కథ.  

కథ,కథనం ఎలా ఉన్నాయంటే…

ఈ సినిమా కథ,కథనం చాలా డిఫరెంట్ గా ఉండాలని మూడేళ్లు శ్రమించి ఈ మూడు గంటల పైగా లెంగ్త్ ఉన్న సినిమాని చేసారు. కౌబాయ్ చిత్రాల స్పూర్తిగా, ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్వింటెన్ టొరొంటెనో నేరేషన్ ని స్టైల్ ని అనుసరిస్తూ తీసిన ఈ చిత్రం స్లో గా ఉందనే ఇబ్బంది తప్పిస్తే బాగానే అనిపిస్తుంది. కాస్త ఓపిగ్గా కూర్చోగలిగితే కొత్త ఎక్సపీరియన్స్ ఇస్తుంది. అలాగే హీరో పాత్ర కూడా పైరెట్స్ ఆఫ్ ది కరేబియిన్ సినిమాలోని జాక్ స్పారోని గుర్తు చేస్తూ సాగుతుంది. ఇలాంటి పాత్రే ఆ మధ్యన అమీర్ ఖాన్..ధగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లో చేసాడు. ఆ దొంగ పాత్రని ఇక్కడ పోలీస్ గా మార్చారు. అక్కడిదాకా బాగానే ఉంది కానీ మరీ సినిమా చివరి దాకా అదే దొంగ..కామెడీ చేయటమే మనకు నచ్చదు. సీరియస్ గా చెయ్యాల్సిన చోట కూడా నవ్వించేందుకు ట్రై చేస్తూంటాడు. దానికి తోడు సినిమా లెంగ్త్ ఎక్కువై చాలా ఇబ్బంది పెడుతుంది.  ఓ అరగంట ట్రిమ్ చేస్తే సినిమా బాగుండును అనిపిస్తుంది. అలాగే విలన్ పాత్ర స్ట్రాంగ్ గా లేకపోవటంతో హీరో క్యారక్టరైజేషన్  తేలిపోయింది.  స్క్రీన్ ప్లేని ఓ జిగ్ సా పజిల్ గా చెయ్యాలనే తాపత్రయంలో చాలా కన్ఫూజింగ్ గా మార్చేసారు. కొన్ని లాజిక్స్, లింక్ లు చాలా సేపు ఆలోచిస్తే కానీ తెగవు. అవన్నీ సరిపెట్టుకుందామంటే సినిమా బాగా కన్నడ నేటివిటితో ఉంటుంది. సినిమాకు కీలకంగా నిలచే ట్రెజర్ హంట్ సీన్స్  అంత గొప్పగా అనిపించవు.
 
దర్శకత్వం,మిగతా విభాగాలు..
   
ఈ సినిమాకు హైలెట్ బాగా తెరపై కనపడే ఖర్చు. మ్యూజిక్ యావరేజ్ గా అనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. తెలుగు డబ్బింగ్ చాలా జాగ్రత్తగా రాసి, చెప్పించారు. ప్రొడక్షన్ డిజైన్, సెట్ వర్క్, ఆర్ట్ వర్క్ అదిరిపోయాయి. డైరక్టర్ సచిన్ …రెగ్యులర్ ట్రజర్ హాంట్ కథలా కాకుండా కాస్త కొత్తగా వెళ్లటానికి ట్రై చేసాడు. అయితే మెయిన్ పాయింట్ లోకి వెళ్లటానికి చాలా టైమ్ తీసుకోవటం మాత్రం స్క్రిప్టు సమస్యే. దాంతో డైరక్షన్ ఎంత గొప్పగా ఉన్నా..స్క్రిప్టు బోర్ కొట్టించేలా చేసింది. ఎడిటింగ్ ఓ అరగటం తగ్గిస్తే బాగుండను అనిపిస్తుంది.
 
చూడచ్చా…

స్లో గా సాగినా, లెంగ్త్ ఎక్కువ ఉన్నా ఓ వెరైటీ సినిమా చూడాలనే కోరిక ఉంటే …వెంటనే చూసేయండి

ఎవరెవరు..

సంస్థ‌:  పుష్క‌ర్ ఫిలిమ్స్,
న‌టీన‌టులు: ర‌క్షిత్ శెట్టి, శాన్వి శ్రీవాస్త‌వ‌, అచ్యుత్‌కుమార్‌, బాలాజీ మ‌నోహ‌ర్‌, ప్ర‌మోద్ శెట్టి, రిష‌బ్ శెట్టి, యోగ్‌రాజ్‌, మ‌ధుసూధ‌న్‌రావు త‌దిత‌రులు.
క‌థ‌: ర‌క్షిత్ శెట్టి
సినిమాటోగ్రఫీ: క‌ర్మ్ చావ్లా
సంగీతం: చ‌ర‌ణ్‌రాజ్‌, అజ‌నీష్ లోక్‌నాథ్‌
నిర్మాణం:  హెచ్‌.కె.ప్ర‌కాష్‌, పుష్క‌ర మ‌ల్లికార్జున‌య్య‌, దిల్‌రాజు
ఎడిటింగ్, ద‌ర్శ‌క‌త్వం: స‌చిన్ ర‌వి
విడుద‌ల‌ తేదీ: 01-01-2020