అతిథి దేవో భవ మూవీ రివ్యూ

Published On: January 7, 2022   |   Posted By:

అతిథి దేవో భవ మూవీ రివ్యూ

Image

ఆది’లోనే  హంసపాదు ‘అతిథి దేవో భవ’ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

👎

ఈసారి  పెద్ద పండగ సంక్రాంతికి పెద్ద సినిమాలు మొహం చాటేశాయి. ఒకటి తర్వాత ఒకటి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వాయిదా వేసుకోవడంతో చిన్న సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి.  ఆ సినిమాల జాబితాలో ఆది సాయికుమార్ ‘అతిథి దేవోభవ’ కూడా ఉంది.  ఆదికి చాలాకాలంగా సరైన హిట్ లేక కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతున్నాడు. అయితే.. ఆది ప్రస్తుతం నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టాడు. అతిధి దేవోభవ సినిమా కనుక సక్సెస్ అయితే కెరీర్ మళ్ళీ గాడిన పడి రాబోయే సినిమాలకు ప్లస్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఎలా ఉంటుందా అన్నది ఆసక్తిగా మారింది. ఈ రోజు రిలీజైన ఈ సినిమా ఉంది. ఆది హిట్ కొట్టాడా..కథేంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

మోనోఫోబియా అనే మానసిక సమస్యతో బాధపడుతూంటాడు అభ‌య్ (ఆది). ఒంటిరిగా ఉంటే సూసైడ్ టెండెన్సీ పెరిగిపోతుంది. ఆత్మహత్య చేసుకుంటాడనే భయంతో ఎప్పుడూ అతని తల్లి (రోహిణి) కంటికి రెప్పలా కాపలాకాస్తుంది. ప్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ ఇస్తారు. అయితే అదే సమస్యగా మారుతుంది. ఎప్పుడూ ప్రెండ్స్  లేక మరొకరతో ఎంగేజ్ అయ్యి ఉండటంతో ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోతుంది. ఈ లోగా అతని జీవితంలోకి  వైశాలి (నువేక్ష) ప్రవేశిస్తుంది. ఆమెతో అభయ్ ప్రేమలో పడతాడు.  తన ఫోబియా గురించి తెలిస్తే ఆమె తనను అర్థం చేసుకోలేదేమో అనే భయంతో ఆ విషయం ఆమెకు తెలియనివ్వడు. ఓ రోజు అనుకోని విధంగా అజయ్ అనే పోలీస్( ఆదర్శ్ బాలకృష్ణ) వైష్ణవితో అభయ్ ఉండగా వచ్చి అరెస్ట్ చేస్తాడు. అసలు అభయ్ ని ఎందుకు పోలీస్ లు అరెస్ట్ చేసారు. అసలేమైంది. వైష్ణవితో అభయ్ ప్రేమ కథ చివరకు ఏమైంది, చివరకు అభయ్ ఆమెకు అసలు నిజం చెప్పాడా? లేదా? వైశాలితో అతనికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విష్లేషణ

ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే. బ‌లంగా నిలవాలి. ముఖ్యంగా చివ‌రి 45 నిమిషాలూ.. క‌థ‌లో మ‌లుపులు ఆకట్టుకోవాలి. అయితే ఇక్కడ రివర్స్ లో జరిగింది. దర్శకుడు Monophobia disorder ని కొత్తగా ఫీలై, దానికి ప్రేమ కథని కలిపి సైకో థ్రిల్లర్ జానర్ లో  స్క్రిప్టు చేసుకున్నాడు.  అక్కడదాకా బాగానే ఉంది. అయితే ఆ కథని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చెప్పాలనే విషయం ప్రక్కన పెట్టేసాడు. థ్రిల్లర్ సినిమా చేయాలనుకున్నప్పుడు అందులో హై సస్పెన్స్ ,హై స్టేక్స్, హై కాంప్లిక్ట్స్ వాటి నుంచి వచ్చే కానసీక్వెన్స్ లు ఓ రేంజిలో చూసేవారి మైండ్ తో ఆడుకునేలా ఉండాలనే విషయం వదిలేసారు.  ఎక్కడా సినిమాలో సర్పైజింగ్ గా అనిపించే టర్న్ లు, ట్విస్ట్ లు కనిపించవు. షాకింగ్ ఇంటర్వెల్,ప్లీ క్లైమాక్స్ లేదు. ఊహించని క్లైమాక్స్ అయితే అసలు లేనే లేదు. మరి ఏం ఉంది అంటే.. మొదట్లో మానసిక సమస్యను పరిచయం చేసే సీన్స్, కాస్తంత సప్తగిరి ఫన్ బాగానే ఉంటుంది. ఇంటర్వెల్ ఓకే అనిపిస్తుంది. కానీ సెంకండాఫ్ లో కతనం పలచబడిపోతుంది. అంత‌కు ముందు న‌డిచిన‌క‌థ‌ని దృష్టిలో పెట్టుకుని.. కాస్త ఓపిగ్గా భ‌రించాలి అని ఫిక్సైనా ఫలితం కనిపించదు. ఇలాంటి థ్రిల్లర్  కథలకు కావాల్సిన సెటప్ త‌యారు చేయ‌డానికి ద‌ర్శ‌కుడు కాస్త స‌మ‌యం తీసుకునే  మాట వాస్త‌వం. కానీ..ఆ తర్వాత ఏమన్నా జరిగితేనే అందుకు నిండుతనం వస్తుంది.  అయితే అదేమీ లేకుండా సో..సోగానే సాగుతుంది. ప్రెజంటేషన్ లో  ఈ సినిమాకు కావాల్సిన డెప్త్ అందలేదు. అది ఖచ్చితంగా చూసేవారి మూడ్ ని డిస్ట్రబ్ చేసేస్తుంది. ఫస్టాఫ్ లో  కామెడీ థ్రిల్ల‌ర్‌గా క‌థ‌ను చూపిన ద‌ర్శ‌కుడు.సెకండాఫ్  కాసేపు దాన్ని సైకో థ్రిల్ల‌ర్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. ఎటు నుంచి ఎటు వెళ్ళాలనే క్లారిటీ లేదు. దాంతో కథలో వచ్చే ప్ర‌తి ఎత్తుగ‌డ సీన్ సాగ‌తీత వ్య‌వ‌హారంలాగే న‌డిచింది త‌ప్ప‌.. ఎక్క‌డా జోష్ తీసుకురాలేక‌పోయింది.

టెక్నికల్ ఫెరఫార్మన్స్..

బలహీనమైన పాత్రలు, సీన్స్ రాసుకోవటంతో . స్క్రీన్ ప్లే మ‌రీ వీక్ గా తయారైంది. చాలా బోరింగ్ సీన్లు క‌నిపిస్తాయి. ఈ అతిథి రాకుండా ఉంటే బాగుండును రాఅన్నట్లుగా  సినిమా సాగింది. కొత్త దర్శకుడు తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోయారు. నేప‌థ్య సంగీతం మాత్ర ప‌ర్ఫెక్ట్ గా కుదిరింది. పాటలు కూడా బాగున్నాయి. కెమెరా వర్క్ సాధ్యమైనంత సహజత్వం తీసుకురావటానికి ప్రయత్నంచేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ సోసో,చుట్టేసినట్లు అనిపించింది. ఎడిటింగ్ అయితే దారుణం.

నటీనటుల విషయానికి వస్తే..ఆది పినిశెట్టి అల‌వాటు ప్ర‌కార‌మే బాగా చేశాడు. ఆ పాత్ర‌ని అర్థం చేసుకుని, దానికి త‌గ్గ‌ట్టుగా నటిస్తూ వెళ్లిపోయాడు. త‌ను అన్ని ర‌కాల ఎమోష‌న్ల‌నీ బాగా పండించ‌గ‌ల‌డు. అదే ఈ సినిమాతోనూ రుజువైంది. కానీ అతనికి కలిసొచ్చే సినిమా కాదు. హీరోయిన్ సువేక్ష‌ ఎంతబాగాచేసినా పట్టించుకునేవారు ఏరి. రోహిణి నటన,  స‌ప్త‌గిరి కామెడీతో అలా నడిచిపోయింది.ఇమ్మాన్యుయేల్, అదుర్స్ రఘు ఉన్నా లేకపోయినా ఒకటే.

బాగున్నవి

లీడ్ పెయిర్ మధ్య కెమెస్ట్రీ
కొత్తపాయింట్
ఆర్ట్ వర్క్

బాగోలేనివి
బోరు కొట్టించే స్క్రీన్ ప్లే
సరైన డిటేలింగ్ లేని దర్శకత్వం

చూడచ్చా

దూరం పెట్టడమే ఉత్తమం

తెర వెనక…ముందు

న‌టీన‌టులు: ఆది సాయికుమార్‌, నువేక్ష‌, రోహిణి, స‌ప్త‌గిరి, ఆదర్శ్‌ బాల‌కృష్ణ త‌దిత‌రులు;
సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌;
కూర్పు: కార్తిక్ శ్రీనివాస్;
ఛాయాగ్ర‌హ‌ణం:  అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి;
ద‌ర్శ‌క‌త్వం:  పొలిమేర నాగేశ్వ‌ర్‌;
నిర్మాతలు: రాజాబాబు మిర్యాల‌, అశోక్ రెడ్డి మిర్యాల‌;
రన్ టైమ్: 2 hr 13 Mins
విడుద‌ల తేదీ: 07-01-2022