అద్బుతం మూవీ రివ్యూ

Published On: November 19, 2021   |   Posted By:

అద్బుతం మూవీ రివ్యూ

తేజు సజ్జా ‘అద్బుతం’ రివ్యూ

 
  Emotional Engagement Emoji (EEE)  
 
👍

 హీరో హీరోయిన్ పోన్ నెంబర్ ఒకటే అవడం.. ఒకరి కాల్స్ ఒకరికి వెళ్లడం.. అదే వాళ్ల పరిచయానికి కారణం కావడం కొత్త విషయమే. అలాగే హీరో, హీరోయిన్ వేర్వేరు కాలాల్లో ఉండటమూ ఆసక్తి కలిగించేదే.  ‘జాంబిరెడ్డి’, ‘ఇష్క్‌’ సినిమాల తర్వాత హీరో తేజ నుంచి వస్తున్న కొత్త చిత్రమిది.  శివాని రాజశేఖర్‌ పరిచయం అవుతున్న ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్స్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందన్న విషయం అర్ధమయ్యేలా చేసారు. నిజంగానే ఈ సినిమాలో అంత విషయం ఉందా..అసలు సినిమా కథేంటి, ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా సగుడు ప్రేక్షకుడుకి అర్దమవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 
స్టోరీ లైన్

టీవీ ఛానెల్ లో యాంకర్ గా చేస్తున్న సూర్య(తేజ సజ్జ) కు వెన్నెల(శివాని రాజశేఖర్) అనే అమ్మాయినుంచి ఓ రోజు మెసేజ్ వస్తుంది. అయితే ఆమె నెంబర్ ,తన నెంబర్ ఒకటే అవటం ఆశ్చర్యపరుస్తుంది.  ఆ తర్వాత ఆమెతో మాట్లాడాక కొద్ది రోజులుకి మరో విషయం రివీల్ అవుతుంది. అసలు తాము ఒకే టైమ్ లో లేమని అర్దమవుతుంది. తాను 2019లో ఉన్నానని, ఆమె 2014లో ఉందని అర్దమవుతుంది.  వీరిద్దరూ గతంలో ప్రేమలో ఉన్నవారే అని కూడా రివీల్ అవుతుంది. అంతేకాదు సూర్యని కలుద్దామని ఆమె చేసే ప్రయత్నం ఘోరంగా ఫెయిలవుతూంటుంది.  ఇలా తామిద్దరూ వేరేవేరే టైంలో ఉన్నామని ,ఒకరు వర్తమానంలో మరొకరు భూతకాలంలో ఉన్నారు ఎలా తెలుసుకుంటారు. ఇది ఎలా జరిగింది? ఒకవేళ జరిగితే ఎందుకు జరిగింది? దాని పర్పస్ ఏమిటి ఈ ఇద్దరికీ మధ్య ఫోన్ కనెక్షన్ కాక మరి ఏదైనా బంధం ఉందా? ఉంటే దానివెనక ఉన్న మర్మం ఏమిటి? చివరకు వీరి లవ్ స్టోరీ ఏమైంది..ఇద్దరూ కలిసారా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే…సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ …


 
టైం ట్రావెల్. టైం లూప్. క్రాస్ టైం కనెక్షన్ ఇవన్నీ ఇంగ్లీష్ సినిమాలలో రెగ్యలర్ గా వచ్చే కాన్సెప్టులు. ఒక స్పెషల్ సైన్స్ ఫిక్షన్ జానర్ గా వీటిని అక్కడ చెప్తూంటారు. ఇలాంటి సినిమాలకు అక్కడ ప్రత్యకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది.  కానీ మనకే ఇవి అరుదు. ఒకటో ఆరో వచ్చి  ఆదిత్య-369 లా సక్సెస్ అయితేనే గుర్తుండిపోయేలా చరిత్రలో మిగులుతాయి. ఇది కూడా టైం మెషిన్, టైం ట్రావెల్ కి సంబంధించిన కథే.  కాకపోతే క్రాస్ టైం టాక్, అంటే రెండు వేరువేరు టైమ్స్ లో ఉన్నవాళ్లు ఒక ఫోన్ ద్వారా మాట్లాడుకోవడం.తెలుగులో ఈ కాన్సెప్టుతో  సాహసం చేసిన మొదటి సినిమా “ప్లే బ్యాక్”. ప్రపంచ సినిమాలోకూడా చాలా తక్కువ. అనీ హాలీవుడ్,కొరియన్ సినిమాలోలో మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి ఈ కథ కత్తి మీద సాములాంటిది. ఎక్కడ లాజిక్ మిస్ అయినా ఆశ్చర్యంపోవటం ప్రక్కన పెట్టి “అబ్బే బోర్ రా” అనిపించేస్తుంది.

కానీ ఇలాంటి  సినిమాలలో స్క్రీన్ ప్లే పగడ్బందీగా రాసుకుంటూ.. ఒక్కొక్క విషయం రివీల్ అవుతుంటే  ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. “ఏం తీసాడ్రా డైరక్టర్” అనిపిస్తుంది.  అయితే ఈ సినిమా థ్రిల్స్ విషయంలో అంత సీన్ లేదు. వాటి జోలికి కూడా పోలేదు. కేవలం లవ్ స్టోరీతో లాగేసాడు. అయితే కన్ఫూజ్ అవకుండా,మనని కన్ఫూజ్ చేయకుండా కథ చెప్పాడు. కాబట్టి క్రెడిట్ మొత్తం రచయిత ప్రశాంత్ వర్మ కు చెందుతుంది. స్క్రీన్-ప్లేలో బిగి. ఎక్కడా వృధాకాని సీన్లు రాసుకుంటే ఇంకా మంచి ఫలితం వచ్చేది. కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి అంత సీన్ లేదనిపిస్తుంది.  ఓ ఆదిత్య 369 లాంటి సైన్స్‌, ఫిక్ష‌న్ మిళిత‌మైన సినిమా చూసిన ఫీలింగ్ క‌లుగించాల్సిన సినిమా మూమాలు సినిమాగా మార్చేసారు. ఐదేళ్ల క్రితం విడిపోయిన ఓ ప్రేమ జంటను కలపటానికి క్రాస్ టైమ్ కనెక్షన్ ని తీసుకున్నారు. అంతకు మించి ఈ ఎలిమెంట్ ని పెద్దగా ఉపయోగించుకోలేదు. దాంతో ఈ ఎలిమెంట్ లేకపోయినా కథ నడిచేది అనిపిస్తుంది. అలాగే ప్లే బ్యాక్ రాకముందు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉండే షాకింగ్ వాల్యూ ఉండేదేమో కానీ ఇప్పుడు అదీ లేదు.  అయితే ప్లే బ్యాక్ రావటంతో క్రాస్ టైమ్ కనెక్షన్ గురించి ఎక్కువ వివరించి చెప్పాల్సిన అవసరం లేకుండా కలిసొచ్చింది.


టెక్నికల్ ,నటీనటుల ఫెరఫార్మెన్స్

ఇక దర్శకుడు విషయానికి వస్తే…పాత్రలకి తగ్గ నటనరాబట్టడం. ఉన్న వనరుల్ని మ్యాగ్జిమం వాడుతూ సినిమాని ముందుకు తీసుకెళ్లటం సమర్దవంతంగానే చేసారు. ఒక ప్రామిసింగ్ డైరెక్టర్ అనిపించారు. లవ్ స్టోరీ చెప్తున్నాం అని ఫిక్సైనప్పుడు లీడ్ పెయిర్ లవ్ సీన్స్ లో డెప్త్ చూపించి ఉంటే అతని ప్రతిభ పుష్కలంగా కనపడేది. ఓ కొత్త ర‌క‌మైన అనుభ‌వాన్ని మిగిలిచ్చిన సినిమా అయ్యేది.  ఎత్తుకోవ‌డ‌మే మంచి పాయింట్ ఎత్తుకున్నా ట్రీట్మెంట్ లో  దాన్ని తీర్చిదిద్దిన విధానం దారి తప్పించారు. అప్పటికీ  డైలాగులు బాగుండటం కలిసొచ్చింది.

ఇలాంటి కాన్సెప్టు సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ గా ఉండాలి. ఆ విషయంలో ఓకే అనిపించుకున్నారు. లవ్ స్టోరీకు తగ్గ పాటలు అయితే లేవు. సినిమాటోగ్రఫీ సినిమాకు నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. ఎడిటింగ్ సోసో.  స్క్రీన్ ప్లే మ‌రింత బాగుండాల్సింది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే ఇలాంటి క‌థ‌ల్ని డీల్ చేయ‌డం చాలా క‌ష్టం. ప్రత్యేక లాజిక్కులు లేనిచోట మ్యాజిక్ చేయగలగాలి. ద‌ర్శ‌కుడు అది చేయలేకపోయాడు.
 
నటీనటుల్లో  శివాని రాజశేఖర్,  తేజ్ సజ్జు, పాత్రోచితంగా నటించారు. శివానీ రాజశేఖర్ ప్రతిభకు ఇది గీటురాయని చెప్పలేం కానీ, ఎమోషన్స్ పండించటం మినహా బాగా చేసింది.స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. అలాగే శివాజీ రాజా, కమిడియన్ సత్య,దేవిప్రసాద్, తులసి సినిమాకు వాల్యూ యాడ్ చేశారు.  
 
* ప్ల‌స్ పాయింట్స్

క‌థా నేప‌థ్యం

 * మైన‌స్ పాయింట్స్

ట్విస్టులూ, ట‌ర్న్‌లూ
 స్లో నేరేషన్
బిగిలేని  స్క్రీన్ ప్లే  

చూడచ్చా
కొత్త త‌ర‌హా సినిమాలు చూడాల‌నుకున్న వాళ్ల‌కు ఈ సినిమా న‌చ్చుతుంది.

 
ఎవరవెరు…

నిర్మాణ సంస్థ: మహాతేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్ బ్యానర్
ప్రధాన తారాగణం: తేజ సజ్జ, శివాని రాజశేఖర్, సత్య, శివాజీ రాజా తదితరులు
సంగీతం: రథన్
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకత్వం: మల్లిక్ రామ్
 సినిమాటోగ్రఫర్:  విద్యాసాగర్ చింతా
స్క్రీన్ ప్లే ,మాటలు:  లక్ష్మీ భూపాల
 రన్‌టైం: 2 గంటల 21 నిమిషాలు
విడుదల 19-11-2021
ఓటిటి: డిస్నీ ప్లస్ హాట్ స్టార్