Reading Time: < 1 min

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ షూటింగ్ పూర్తి

ర‌వితేజ‌, ఇలియానా జంట‌గా న‌టిస్తున్న అమ‌ర్ అక్బర్ ఆంటోనీ షూటింగ్ పూర్తైపోయింది. అన్న‌పూర్ణ స్టూడియోస్ లో హీరో హీరోయిన్ల‌పై చివరి పాట చిత్రీక‌ర‌ణ పూర్తి చేసారు. శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈయ‌న పుట్టిన రోజు కానుక‌గా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ పాత్రల‌ను ప‌రిచ‌యం చేసారు. ఇది చాలా కొత్త‌గా.. సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచేలా ఉంది.
ర‌వితేజ మూడు గెట‌ప్స్ ట్రెండింగ్ లో ఉంటూ.. ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. అందులో మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించారు ర‌వితేజ‌. ఈ చిత్రం పూర్తిగా స‌రికొత్త క‌థ‌.. భిన్న‌మైన‌ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది.
ఈ సినిమాలో ల‌య‌, సునీల్,వెన్నెల కిషోర్,ర‌ఘు బాబు,త‌రుణ్ అరోరా,అభిమ‌న్యు సింగ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. యుఎస్ లోని అంద‌మైన లొకేష‌న్స్ లో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

న‌టీన‌టులు:
ర‌వితేజ‌, ఇలియానా డీ క్రూజ్, సునీల్, ల‌య‌, వెన్నెల కిషోర్, ర‌విప్ర‌కాశ్, త‌రుణ్ అరోరా, ఆదిత్య మీన‌న్, అభిమ‌న్యు సింగ్, విక్ర‌మ్ జిత్, రాజ్ వీర్ సింగ్, శియాజీ షిండే, శుభ‌లేక సుధాక‌ర్ త‌దిత‌రులు..

సాంకేతిక నిపుణులు:
స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌కుడు: శ‌్రీనువైట్ల
నిర్మాత‌లు: న‌వీన్ యేర్నేని, వై. ర‌విశంక‌ర్, మోహ‌న్(సివిఎమ్)
క‌థ‌: శ్రీ‌నువైట్ల‌, వంశీ రాజేష్ కొండ‌వీటి
స‌హ నిర్మాత‌: ప‌్ర‌వీణ్ మ‌ర్పూరి
సీఈఓ: చెర్రీ
సినిమాటోగ్ర‌ఫీ: వెంకట్ సి దిలీప్
ఎడిటర్: ఎంఆర్ వ‌ర్మ‌
సంగీతం: ఎస్ఎస్ థ‌మ‌న్
ఆర్ట్ డైరెక్ట‌ర్: ఏఎస్ ప్ర‌కాశ్