Reading Time: 2 mins
అర్ధ శతాబ్దం చిత్రం ఓటీటీ ఆహా రిలీజ్
 
 
“అర్ధశతాబ్ధం” సినిమా వరల్డ్ ప్రీమియర్‌ను ఎనౌన్స్ చేసిన ‘ఆహా’
 
ఆహా నుంచి వస్తున్న మరో ఒరిజినల్‌ ‘అర్ధ శతాబ్దం’ మార్చి 26 నుంచి స్ట్రీమ్ కానుంది.
 
మార్చిలో మహా ఎంటర్‌టైన్మెంట్‌కు రెడీ అవుతోంది 100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా. ఈ సందర్భం అర్ధశతాబ్దం సినిమా మార్చి 26 నుంచి ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమ్ కానుందన్న విషయాన్ని వెల్లడించారు మేకర్స్‌. 
 
ఈ జాతీ, మత, వర్ణ వివక్ష కు వ్యతిరేకంగా పోరాటం ప్రేమ కోసం జరిగే పోరాటమే ఈ సినిమా కథ.  వయోలైన్స్‌ దాని వల్ల జరిగిన ఇతర పరిణామాలను  ఈ సినిమాలో ప్రధానంగా చూపిస్తున్నారు. 2003 లో జరిగిన కథగా ఈ సినిమాను రూపొందించారు. కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్‌, కృష్ణ ప్రియ, సుహాస్‌, పవిత్ర లోకేష్‌, అజయ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
 
రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “అర్ద శతాబ్ధం”. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌ గ్లింప్స్‌తో సినిమా మీద మంచి బజ్‌ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
 
ఇప్పటికే క్రాక్‌ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆహా త్వరలో నాంది లాంటి మరో హిట్ సినిమాను స్ట్రీమ్ చేసేందుకు రెడీ అవుతోంది. సూపర్ ఓవర్‌ లాంటి ఒరజినల్‌తో సక్సెస్ సాధించిన ఆహా.. ఇప్పుడు అర్ధ శతాబ్దంతో పాటు రానా హోస్ట్ చేస్తున్న నంబర్ 1 యారి ని స్ట్రీమ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇలా బిగ్ ప్రాజెక్ట్స్ తో తెలుగు వారికి మరింత చేరువవుతోంది ఆహా. సూపర్‌ స్టార్స్‌ నటించిన సినిమాలతో పాటు క్లాసిక్స్‌తో ప్రేక్షకులకు అద్భుతమైన కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది ఆహా.
 
నటీనటులు, సాంకేతిక నిపుణులు:
నటీనటులు:కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్‌, కృష్ణ ప్రియ, సుహాస్‌, పవిత్ర లోకేష్‌, అజయ్‌, శుభలేఖ సుధాకర్‌, రాజా రవీంద్ర, రామ రాజుచ దిల్‌ రమేష్, టీఎన్‌ఆర్‌, శరణ్య, నవీన్‌ రెడ్డి, ఆమని
బ్యానర్‌ : రిషితా శ్రీ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ, 24 ఫ్రేమ్స్‌ సెల్యూలాయిడ్‌
డైరెక్టర్‌ : రవీంద్ర పుల్లె
నిర్మాత : చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ
డీఓపీ: వెంకట్‌ ఆర్‌ సేకమూరి, అష్కర్, ఇ జె వేణు
మ్యూజిక్‌ : నోఫెల్ రాజ
ఎడిటర్‌ : జే ప్రతాప్ కుమార్‌
ఆర్ట్ డైరెక్టర్‌ : సుమిత్‌ పటేల్‌
యాక్షన్‌ : అంజి మాస్టర్