Reading Time: 2 mins

అల్లుడు అదుర్స్‌ మూవీ రివ్యూ

బెదుర్స్:’అల్లుడు అదుర్స్‌’ రివ్యూ

Rating:1.5/5

పండగ వచ్చేసింది. భీబత్సమైన స్టార్ కాస్టింగ్ తో కూడిన ప్యాడింగ్ ని తీసుకుని అల్లుడు ధియోటర్ లో దిగిపోయాడు. ఇక మిగిలింది హిట్ కొట్టేయటమే అన్నట్లుగా  ఫ్యామిలీ లు చూడదగ్గ యాక్షన్ కామెడీ అని పబ్లిసిటీ చేస్తున్నారు. కుర్రాళ్లకు మసాలా కావాలి అంటూ హోలా చికా   ఐటం సాంగ్ తో హోరెత్తిస్తున్నారు. రాక్షసుడు సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీను కు ఫాలోయింగ్ పెరిగింది అనటం కన్నా  ఓ వర్గంలో అతను సినిమాలు చూడవచ్చు అనే ఆశను రేకిత్తించాడు. దాంతో జనాలు ఈ అల్లుడుని చూడటానికి ఉత్సాహం చూపించారు. అయితే అల్లుడు గిల్లుడు జనాలకు నచ్చిందా? ఈ సినిమా కథేంట>.బెల్లంకొండ కు మరో హిట్ దొరికినట్లేనా? ఆ విశేషాలు చూద్దాం.

స్టోరీ లైన్

శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) తొలి చూపులోనే  కౌముది (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. ఆమె ప్రముఖ ఫ్యాక్షన్ లీడర్ జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్) కూతురు. అంతేకాదు కౌముదికి ప్రేమ అంటే గిట్టదు. ఈ క్రమంలో పది రోజుల్లో ఆమెను  ప్రేమలో దించేస్తానని తండ్రి తో ఛాలెంజ్  ఆ పని మీద ఉందామనుకునే సరికి.. శ్రీను ఎక్స్ లవర్ వసుంధర (అను ఇమ్మాన్యుయేల్) సీన్ లోకి వస్తుంది. దాంతో ఎక్స్ లవర్ కు, ప్రస్తుత లవర్ కు మధ్య ఇరుక్కుపోతాడు శ్రీను. అంతేకాదు ఆమె జైపాల్ రెడ్డి రెండో కూతురని రివీల్ అవుతుంది. వీటిన్నటికీ తోడు ఆమె గజ( సొనూ సూద్) ప్రేమలో వుంటుంది. కానీ పెద్ద రౌడీ అయిన గజకు జైపాల్ రెడ్డి అంటే కోపం. పగ తీర్చుకోవాలని చూస్తూంటాడు. ఈ థ్రెడ్స్ అన్ని ఒక చోట కలుస్తాయి. అది ఏమిటి శ్రీను ఏం చేసాడు. చివరకు అతని ప్రేమ కథ ఎలా ముగిసింది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎనాలసిస్ ..

ఈ సినిమా స్క్రీన్ ప్లే పూర్తి ఫార్ములాతో సాగుతుంది.  కమర్షియల్ సినిమాకు అన్ని పాళ్లు సరిగ్గా పడాలి. అప్పుడే అది అందరినీ ఎంటర్టైన్ చేయగలుతుంది. కానీ డైరక్టర్ అత్యుత్సాహంతో చేసిన అతి సీన్స్ సినిమాను దెబ్బ కొట్టాయి. ప్రతీ సీన్ లోనూ కామెడోనో,ఎమోషనో ఉండాలని పడ్డ తాపత్రయం కథను అర్దం పర్దం లేకుండా చేసేసింది. ఓ క్రమ పద్దతిలో కథ వెళ్లదు. కథలో అప్పటికప్పుడు కృత్రిమమైన అడ్డంకి రావటం.దాన్ని హీరో అతి తెలివితో దాటడం. ఇదే స్కూల్ లో రన్ అవుతుంది. అందుకు కారణం ఎత్తుకున్న కథలోనే లోపం ఉండటం.

పాత హిట్ సినిమాలు చూసి కొత్త కథలు రాయటం కొత్తేమీ కాదు. క్రియేటివిటికి ఏదో ఒక ప్రేరణ అవసరమే. కాదనలేం. అంత మాత్రాన తన కెరీర్ లో హిట్ గా నిలిచిన కందిరీగ ని  ఓ కళాఖండం అని భావించి, అదే కథని మళ్లీ రిపీట్ చేయాలనుకోవటం మాత్రం సాహసమే. ఇంకా అల్లుడు,మామ సవాళ్లు కథలు జనం ఎగబడి చూస్తారని భావించంటం, ఒకే ఇంట్లో విలన్, హీరో సెటప్ పెట్టి కన్ఫూజన్ కామెడీ క్రియేట్ చేయాలనుకోవటం ఇవన్నీ ఎప్పటి ఆలోచనలు. ఏ దిసగా తెలుగు సినిమాను ముందుకు తీసుకెళ్తాయి. తెలుగు సినిమా వెనకబడిపోతే మాకెందుకు.ముందుకెలితే మాదెంకుకు అనుకున్నా, అసలు పెట్టిన పెట్టుబడి అయినా రాబట్టాలి కదా.చూసిన కథనే మళ్లీ అదే ధోరణిలో చెప్తే జనం అంత మతిలేకుండా చూసేస్తారా, పోనీ కథ ఎలాంటిదయినా జనం ఎగబడి చూడ్డానికి బెల్లంకొండ శ్రీను స్టార్ హోదా ఇంకా తెచ్చుకోలేదు. క్లాస్ట్లీ ప్యాడింగ్ తో సినిమాలు గెంటుకొస్తున్నాడు.

రాక్షసుడు తప్ప కెరీర్ లో హిట్ ఉందా. అదీ తమిళ సినిమా ని యాజటీజ్ రీమేక్ చేసారు. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి నడిచిపోయింది. ఒక హిట్ కొట్టాం కదా అని పాత కథలను తవ్వి మన ముందు పెడితే ఏం ఉత్సాహం ఉంటుంది. పండగను ఈ అల్లుడు పాడు చేసాడనిపిస్తుంది. స్టోరీ లైన్ రొటీన్, స్క్రీన్ ప్లే విసుగెత్తిస్తుంది. బెల్లంకొండ నటన ఏమీ ఉండదు. డాన్స్,ఫైట్స్ తప్ప చెప్పుకునేందుకు ఏమీ లేదు. మరి ఏం చూసి ఈ సినిమాకు వెళ్లాలి అంటే సమాధానం చెప్పలేని పరిస్దితి. అంత భారి బడ్జెట్ పెట్టినప్పుడు దానికి తగ్గ కసరత్తు కథ మీద చేయలేకపోవటం మాత్రం దారుణమనే చెప్పాలి. 
 
టెక్నికల్ గా

ఈ సినిమాకు మంచి టెక్నీషియన్స్ పనిచేసారు. కానీ అవుట్ ఫుట్ మాత్రం ఆ స్దాయిలో రాలేదు.  చోటా కె. నాయుడు ప్రతి ఫ్రేమ్ ని రిచ్ గా చూపించినా ఎక్కడా డెప్త్ అనేది లేదు. కొన్ని స్టయిలీష్ షాట్స్ వున్నా అంతగా మెప్పించవు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చాలా సాదాసీదాగా సాగింది. ఎక్కడా ఆయన నుంచి ఆశించే మెరుపులు లేవు.  కొన్ని పంచ్ డైలాగులు పేలాయి.మరికొన్ని తుస్సుమన్నాయి. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ బాగుంది. ఎడిటర్ మాత్రం అన్యాయమే చేసి,లెంగ్త్ పెంచి జనాలను విసిగించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం బాగున్నాయి.
 
చూడచ్చా

అనవసరం.టైమ్ ,డబ్బులు రెండూ వేస్టే.

ఎవరెవరు..
 

నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్‌, నభానటేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌, సోనూసూద్‌, ప్రకాశ్‌ రాజ్‌, వెన్నెల కిషోర్‌, బ్రహ్మజీ, తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: చోటా కె.నాయుడు
ఎడిటింగ్‌: తమ్మిరాజు
నిర్మాత: గొర్రెల సుబ్రహ్మణ్యం
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీనివాస్‌
బ్యానర్‌: సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌
రన్ టైమ్ : 2గం|| 29ని||
విడుదల తేదీ: 14-01-2021