Reading Time: 4 mins

అల్లుడు అదుర్స్ సినిమా సక్సెస్ మీట్

మా “అల్లుడు అదుర్స్” చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ థాంక్స్- సక్సెస్ మీట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

‘రాక్షసుడు’  వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ‘అల్లుడు అదుర్స్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై సూపర్ హిట్ టాక్ తో విజయవంతంగా నడుస్తోంది.

నభా నటేష్, అను ఇమ్మానుయెల్ హీరోయిన్స్ గా రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వంలో గొర్రెల సుబ్రమణ్యం భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఇంటిల్లిపాదినీ అలరిస్తోంది.  ఈ సందర్బంగా చిత్ర  బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ నభా నటేష్, సోను సూద్, నటులు చమ్మక్ చంద్ర, రచ్చ రవి, దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, బెల్లంకొండ సురేష్, చిత్ర నిర్మాత గొర్రెల సుబ్రమణ్యం, చిత్ర సమర్పకుడు గంజి రమేష్ కుమార్,  రచయితలు శ్రీకాంత్ విస్సా, రాజేంద్రకుమార్, తదితరులు పాల్గొన్నారు..

అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు

చిత్ర సమర్పకుడు గంజి రమేష్ కుమార్ మాట్లాడుతూ.. “మా ‘అల్లుడు అదుర్స్’ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ.. మంచి విజయాన్ని సాధించింది. మా హీరో సాయి శ్రీనివాస్ డాన్సులు, ఫైట్స్,తో పాటు పెర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. సోను సూద్ క్యారెక్టర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. నైజాం, వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజు, శిరీష్ లు ఎంతో ఇష్టపడి సినిమా మీద నమ్మకంతో రిలీజ్ చేశారు. వారి నమ్మకం నిజమైంది. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మంచి సినిమా తీశారని ప్రశంసిస్తున్నారు. సినిమా సూపర్ సక్సెస్ అయినందుకు చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నాం” అన్నారు.

ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు

చిత్ర నిర్మాత గొర్రెల సుబ్రమణ్యం మాట్లాడుతూ.. “మా సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సాయి శ్రీనివాస్ తో ఫస్ట్ సినిమా తీయడం చాలా హ్యాపీగా ఉంది. డాన్సులు, ఫైట్స్ ఎంతో కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేశాడు. ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నాను. హీరోయిన్ నభా నటేష్ సినిమాకి బాగా సపోర్ట్ చేసి.. కోపరేట్ చేసింది. అలాగే సోనుసూద్ చక్కగా నటించి మాకు ఎంతో సహకరించారు. సంక్రాంతికి అందరూ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చూస్తారు. అలాంటి సినిమానే మాకు సంతోష్ శ్రీనివాస్ చేసి పెట్టారు. నేను మా ఫ్యామిలీ అంతా థియేటర్ కి వెళ్లి ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేశాం. అలాగే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో విజయం సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇమీడియట్ గా సాయి తో రెండో సినిమా తీయడానికి మేము రెడీగా ఉన్నాం” అన్నారు.

దిల్ రాజు, శిరీష్ గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. “సాయి శ్రీనివాస్ ఫస్ట్ ఫిల్మ్ ‘అల్లుడు శ్రీను’ కి ఏ హీరో తొలి సినిమా కి రానంత రెవిన్యూ వచ్చింది. ఇది నిజం. చరిత్ర. ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’ సినిమా  ఫస్ట్ జనవరి 15న రిలీజ్ అనుకున్నాం. సంక్రాంతికి వస్తే బాగుంటుందని 14న రిలీజ్ చేశాం. అయినా కూడా ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి మా సినిమాని బాగా ఆదరిస్తున్నారు. ఫస్ట్ రోజే మూడున్నర కోట్లు షేర్ వచ్చింది.  మూడు రోజుల్లోనే పది కోట్ల షేర్ వచ్చింది. మొత్తం ఈ సినిమా బడ్జెట్ 32కోట్లు. మాకు శాటిలైట్, ఆడియో రైట్స్ మీద 21 కోట్లు వచ్చాయి. నిర్మాతలు సేఫ్ గా వున్నారు. ఇక నుండి వచ్చేదంతా ప్రాఫిట్ అవుతుంది. సోను సూద్ కనిపించినప్పుడల్లా థియేటర్స్ లో రెస్పాన్స్ బాగుంది. ఆడియెన్స్ విజిల్స్ వేస్తున్నారు. ఆయన ప్రజలకు ఎంతో హెల్ప్ చేశారు. అది ప్రపంచం అంతా తెలుసు. అలా చేయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి. నైస్ జెంటిల్మన్. రియల్ హీరో. అలాంటి సోనూసూద్ మా చిత్రంలో ఉన్నందుకు గర్వపడుతున్నా. మాకు ఎంతో సపోర్ట్ చేసి ఈ సినిమాలో నటించారు. నభా నటేష్ చేయికి దెబ్బతగిలినా కూడా లెక్కచేయకుండా షూటింగ్ చేసింది. అలాంటి హీరోయిన్స్ ఉండాలి. నభాకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సంతోష్ శ్రీనివాస్ మేము ఏదైతే అనుకున్నామో అలాంటి సినిమాని సంక్రాంతికి ఇచ్చాడు. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ చిత్రం యాభై కోట్ల క్లబ్ల్ లో చేరుతుంది. మేము శంకరాభరణం, సప్తపది సినిమాలు తీయలేదు. పక్కా కమర్షియల్ సినిమా చేశాం. మా అబ్బాయి ఓవరాక్షన్ చేశాడంటున్నారు. అసలు ఓవరాక్షన్ చేస్తేనే కదా సూపర్ హిట్ అవుతుంది. మాకు రెవిన్యూ ముఖ్యం. అది ఇచ్చిన ప్రేక్షకులకు పాదాభి వందనం. ‘అల్లుడు అదుర్స్’ ని ఇంత పెద్ద హిట్ చేసిన అభిమానులకు, ఆడియెన్స్ కి కృతజ్ఞతలు.  నేను 20 ఏళ్లనుండి సినిమాలు తీస్తున్నాను.  దిల్ రాజు, శిరీష్ గురించి ఈ మధ్య వరంగల్ శ్రీను అనే వ్యక్తి రకరకాల కామెంట్స్ చేశాడు. అవన్నీ అవాస్తవాలు. దిల్ రాజు నిర్మాతగా  ఎన్నో గొప్ప సినిమాలు తీశాడు. అలాగే డిస్ట్రిబ్యూటర్ గా కొన్ని వందల సినిమాలు రిలీజ్ చేసి ఎగ్జిబిటర్స్ కి, బయ్యర్లుకి  లైఫ్ ఇచ్చారు. వాళ్లిద్దరూ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థే నాశనం అయిపోయేది. వరంగల్ శ్రీను అనే వ్యక్తి  ‘హుషారు’ జిఎస్టీ ఇంతవరకు నిర్మాతకు కట్టలేదు. అలాంటి వ్యక్తికి దిల్ రాజు, శిరీష్ లను కామెంట్ చేసే అర్హత లేదు. జేఏసీ నాయకులు నిజా నిజాలు తెలియకుండా మాట్లాడవద్దు. ముందు వాళ్ళు ‘హుషారు’ జిఎస్టీ డబ్బులు ఇప్పించాలి” అన్నారు.

ఆ క్రెడిట్ అంతా ఆయనదే

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంతా చాలా కష్టపడి చేశారు. ముఖ్యంగా ఈ సినిమా ఇంత బాగా అడుతుందంటే దానికి కారణం మా సాయి. ఈ క్రెడిట్ అంతా తనకే దక్కుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్టాఫ్ అంతా బాగా నవ్వుతూ.. సెకండాఫ్లో లో సాయి చేసిన ప్రతి మూమెంట్ కి ఆడియెన్స్ క్లాప్స్ కొడుతున్నారు. లిటరల్ గా నేను చూశాను. ఇది సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. ఈ సినిమా రేంజ్ ఏంటనేది నెల తరువాత అందరికీ తెలుస్తుంది. సుబ్రమణ్యం, రమేష్ గారు పాండమిక్ టైంలో కూడా భయపడకుండా షూటింగ్ చేశారు. అన్ కాంప్రమైజ్డ్ గా ఈ సినిమాని చాలా గ్రాండియర్ గా నిర్మించారు. చోటా గారి విజువల్స్, దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ సినిమాకి బాగా ప్లస్ అయింది.  మేము ఏదైతే అనుకొని తీశామో.. అది ఫుల్ ఫిల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా చూసిన వారిని ఎలావుందీ అని అడిగి మా అల్లుడు అదుర్స్ సినిమా చూడండి. గొప్ప అనుభూతి కలుగుతుంది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు” అన్నారు.

నాకు తెలుగు తర్వాతే ఏదైనా

సోను సూద్ మాట్లాడుతూ.. “బాలీవుడ్, తమిళ్, తెలుగు మలయాళం,  కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలు చేశాను. అయినా కూడా నా ఫస్ట్ ప్రియార్టీ తెలుగుకే ఇస్తాను. నన్ను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. వారికి చాలా థాంక్స్. సంతోష్ శ్రీనివాస్ కందిరీగ లో చేశాను. మంచి దర్శకుడు. ఈ సినిమాని సూపర్బ్ గా తెరకెక్కించాడు. సాయి శ్రీనివాస్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. సినిమాకోసం చాలా కష్టపడతాడు. బెల్లంకొండ సురేష్, సుబ్రమణ్యం, రమేష్ బాగా సపోర్ట్ చేసి చాలా రిచ్ గా ఈ సినిమా తీశారు. వారికి నా థాంక్స్.  సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమాని సక్సస్ చేసిన ఆడియెన్స్ అందరికీ థాంక్స్” అన్నారు.

జెన్యున్ హిట్ ఇది

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “మా సినిమా చాలా అద్భుత విజయం సాధించింది. సినిమా చూసిన వారంతా చాలా బాగుంది. మేము బాగా ఎంజాయ్ చేశాం అని..   జెన్యున్ గా చెపుతున్నారు. చూసిన వారిని అడిగి థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి.. బాగుంటే పదిమందికి చెప్పండి. మా కష్టమంతా మర్చిపోయి ఒక కొత్త ఎన్టర్జీ ఇచ్చారు ప్రేక్షకులు. సోనూసూద్ గారు మా చిత్రంలో నటించడం చాలా హ్యాపీగా ఉంది. పాండమిక్ టైములో ఆయన ఎన్నో సేవాకార్యక్రమాలు చేశారు. అది అందరివల్ల కాదు. అంచనాలకు మించి చేసిన సోను లెజండరీ పర్సన్ అని నా ఫీలింగ్. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ హార్డ్ వర్క్ చేసి బెస్ట్ ఔట్ ఫుట్ ఇచ్చారు. ఒక నిర్మాత కొడుకుగా నిర్మాత కష్టాలు అన్నీ నాకు తెలుసు. సుబ్రమణ్యం, రమేష్ ఎంత కష్టపడ్డారో నేను దగ్గరుండి చూశాను. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో విజువల్ ఫీస్ట్ గా ఈ సినిమాని నిర్మించారు. వారి ప్యాషన్ అంతా సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. అలాగే సంతోష్ శ్రీనివాస్ ఎక్స్ఆర్డినరి గా సినిమాని రూపొందించారు. దేవిశ్రీప్రసాద్ తన మ్యూజిక్ తో ఈ సినిమాని నెక్స్ట్ లెవల్స్ కి తీసుకెళ్లాడు. చోటా గారు అమేజింగ్ విజువల్స్ ఇచ్చారు. తమ్మిరాజు ఫస్ట్ నుండి ఆయన సూపర్ హిట్ సినిమా అని మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. అవినాష్ సెట్స్ అద్భుతంగా వేశాడు.  నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ ఇద్దరూ బ్యూటిఫుల్ గా యాక్ట్ చేశారు. ప్రేక్షకులను నవ్వించడానికి జెన్యున్ గా ఈ సినిమా చేశాం. అద్భుత విజయం సాధించింది.  అభిమానులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అన్నారు.

అనంతరం సోనూసూద్ చేతులమీదుగా ‘అల్లుడు అదుర్స్’ సక్సెస్  షీల్డ్ లను చిత్ర యూనిట్ కి అందజేశారు.