అశోక్ రెడ్డి చిత్రం ఆడియో ఆవిష్కరణ
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య చేతుల మీదుగా `అశోక్ రెడ్డి` ఆడియో ఆవిష్కరణ!
రజనీకాంత్ కత్తి,రంభ జంటగా ఎల్.వి. క్రియేటివ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో లెంకల `అశోక్ రెడ్డి` నిర్మిస్తోన్న చిత్రం `అశోక్ రెడ్డి`. అశోక్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. రాంబాబు.డి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాల్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. బిగ్ సీడీని మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ కొణిజేటి రోషయ్య, సీడీలను నటి కవిత, థియేట్రికల్ ట్రైలర్ ను దర్శకుడు బాబ్జీ, నటుడు చిట్టిబాబు ఆవిష్కరించారు.
అనంతరం రోషయ్య మాట్లాడుతూ, ` ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో సినిమాల సక్సెస్ రేట్ తక్కువగా ఉందని విన్నాను. మంచి కథతో సినిమాలు చేస్తే విజయవకాశాలున్నాయి. కొత్తవారంతా కథ, పాత్రల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమాలు చేయాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. చిన్న సినిమా నిర్మాతలు ఎప్పటి నుంచి ఇండస్ర్టీలో నలిగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా అంతా కలిసి మెలిసి వెళ్లాలి. ఇక `అశోక్ రెడ్డి` చిత్రం విజయం సాధించి టీమ్ అందరికీ మంచి పేరు రావాలి. సినిమాలో పాటలు, ట్రైలర్లు బాగున్నాయి. ప్రేక్షకులంతా చిత్రాన్ని ఆదరించాలి` అని అన్నారు.
అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ` నేను 11వ ఏట నాటకాలు వేడయం మొదలుపెట్టాను. సాఘింకం, పౌరాణికం నాటకాలు రోజు వేసేవాడిని. చదువుకన్నా ఇలాంటి యాక్టివిటీస్ పైనే ఎక్కువగా దృష్టిపెట్టేవాడిని. పరిశ్రమలో కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న నిర్ణయంతో హైదరాబాద్ కు వచ్చాను. మూడేళ్లు ప్రయత్నాలు చేసి కొన్ని కారణాల వల్ల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. సినిమాలపై నాకున్న ఫ్యాషన్ ను ఇప్పుడిలా నిరూపించుకోబోతున్నా. అశోక్ రెడ్డి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. చిత్రీకరణ, సెన్సార్ పనులు కూడా పూర్తిచేసాం. నాపేరు ను టైటిల్ గా పెట్టాలని దర్శకుడు, ఇతర యూనిట్ సభ్యులు పట్టుబట్టడంతో పెట్టడం జరిగింది. కథకు టైటిల్ పక్కాగా యాప్ట్ అయింది. మరో రెండు సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. అందులో `శ్రీరంగ నాయిక` అనే చిత్రం ఒకటి. వాటన్నింటిని జనవరిలో రిలీజ్ చేస్తాం. అశోక్ రెడ్డి చిత్రం అన్ని వర్గాల వారికి నచ్చుతుంది. సినిమాను అంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
నటి కవిత మాట్లాడుతూ, ` అశోక్ రెడ్డిగారికి సినిమాలంటే చాలా ఫ్యాషన్. ఆయన నిర్మాతగా ఉంటూనే ఓ పాత్ర పోషించారు. తప్పకుండా నటుడిగా సక్సెస్ అవుతారు. కళామాతల్లి ఒడిలో ఎంతమందికైనా స్థానం ఉంటుంది. పక్కా ప్రణాళిళి, ప్లానింగ్ ప్రకారం వెళ్తే అందరూ సక్సెస్ అవుతారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. ఏ సినిమా అయినా ఒక్కటే. అన్ని సినిమాలు ఆడాలి. కథ బాగుంటే ప్రేక్షకులు ఏ చిత్రాన్నానైనా ఆదరిస్తారు. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా` అని అన్నారు.
బాబ్జి మాట్లాడుతూ, `గత ఏడాది విడుదలైన `అర్జున్ రెడ్డి` ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. కానీ ఆ ఆర్జున్ రెడ్డి కన్నా అశోక్ రెడ్డి నల్లగొండ జిల్లాలో గతంలో ఎన్నో సంచలనాలు నమోదుచేసారు. కార్మికనాయకుడిగా, స్టూడియోట్ లీడర్ గా ఇద్దరం కలిసి ఎన్నో పోరాటాలు చేసాం. ఏ సహాయం కావాలన్నా ఎవరైనా అశోక్ రెడ్డి గారి దగ్గరకి వచ్చేవారు. కాదనకుండా సహాయం చేసి ఆదుకునే మంచి వ్యక్తితత్వం గలవారు. సినిమాల్లోకి వస్తారని ఎప్పుడూ అనుకోలేదు. నాకు మంచి మిత్రుడైనా ఆయనలో ఇంత ఫ్యాషన్ ఉందని గమనించలేదు. అశోక్ రెడ్డి పాటలు బాగున్నాయి. ట్రైలర్ లో విజువల్స్ బాగున్నాయి. సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నా. చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులంతా ఆదరించాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
చిత్ర దర్శకుడు నంది వెంకటరెడ్డి మాట్లాడుతూ, `అశోక్ గారికి కథ చెప్పగానే బాగా నచ్చడంతో వెంటనే చేస్తానన్నారు. అందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సినిమాలో ఆయన నటించడం మాకు చాలా సంతోషంగా ఉంది. కథలో చక్కని సందేశం కూడా ఉంది. యూత్ కు నచ్చే అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి` అని అన్నారు.
సంగీత దర్శకుడు రాంబాబు. డి మాట్లాడుతూ, ` మొత్తం నాలుగు పాటలున్నాయి. అందులో రెండు పాటలు నేనే రాసాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ఎప్పుడు రుణపడే ఉంటాను. పాటలు విన్నవాళ్లంతా బాగున్నాయని చెప్పారు. సినిమా కూడా బాగుంటుంది. తప్పకుండా అందరనీ మెప్పించే సినిమా అవుతుంది` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రంగ, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యానారాయణ, రాజేష్, చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ కుప్పలి, శ్రీదేవి, సురేష్,సంఘర్ష, నాగేశ్వర్, తన్నేరు, బి.కుమారి, భూపాల్, అంజనేలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: వెంకట్ సోకళ్ల, రాము, ఛాయాగ్రహణం: యాదగిరి.డి, మాటలు: మహేష్, ఎడిటింగ్: శ్రీశైలం, ఫైట్స్: మధు డైమండ్, స్టోరీ, స్ర్కీన్ ప్లే, డైరెక్షన్: నంది వెంకటరెడ్డి.