Reading Time: < 1 min

ఆకాశం నీ హ‌ద్దురా సినిమా పాట విడుద‌ల‌

సూర్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘ఆకాశం నీ హ‌ద్దురా’ సినిమాలోని ‘కాటుక క‌నులే’ పాట విడుద‌ల‌

సూర్య హీరోగా న‌టిస్తోన్న ‘ఆకాశం నీ హ‌ద్దురా’ మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్‌లో ఒక‌టి. ఇప్ప‌టిదాకా వ‌చ్చిన ప్ర‌చారంతో అంద‌రి దృష్టినీ ఈ సినిమా ఆక‌ర్షిస్తోంది. లేటెస్ట్‌గా జూలై 23 సూర్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆ చిత్రంలోని ఓ కొత్త పాట‌ను నిర్మాత‌లు విడుద‌ల చేశారు.

“కాటుక క‌నులే మెరిసీపోయే పిల‌డా నిను చూసీ” అంటూ సాగే ఈ పాట‌లో సూర్య‌, హీరోయిన్ అప‌ర్ణా బాల‌ముర‌ళి మ‌ధ్య రొమాంటిక్ కెమెస్ట్రీ అల‌రిస్తోంది. ఎప్ప‌టిలా సూర్య డైనమిక్‌గా ఆ సాంగ్‌లో క‌నిపిస్తుండ‌గా, అప‌ర్ణ త‌న హావ‌భావాల‌తో ఆక‌ట్టుకుంటోంది. పాట‌లో ఆ ఇద్ద‌రూ కొత్త‌గా పెళ్ల‌యిన దంప‌తులుగా క‌నిపిస్తున్నారు.

జీవీ ప్ర‌కాశ్‌కుమార్ స‌మ‌కూర్చిన ఆహ్లాద‌క‌ర‌మైన సంగీత బాణీల‌కు, భాస్క‌ర‌భ‌ట్ల త‌న క‌లంతో మ‌రోసారి చిక్క‌ని ప‌దాల‌తో సుమ‌ధుర‌మైన సాహిత్యాన్ని అందించారు. సింగ‌ర్ ధీ త‌న జీర గొంతుతో పాట‌కు ప్రాణం పోశారు.

సుధ కొంగ‌ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, శిఖ్యా ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై సూర్య‌, రాజ‌శేఖ‌ర్ క‌ర్పూర సుంద‌ర‌పాండ్య‌న్‌, గునీత్ మోంగా, ఆలిఫ్ సుర్తి క‌లిసి నిర్మిస్తున్నారు.

క‌లెక్ష‌న్ కింగ్ డాక్ట‌ర్ ఎం. మోహ‌న్‌బాబు ఒక కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

తారాగ‌ణం:

సూర్య‌, డాక్ట‌ర్ ఎం. మోహ‌న్‌బాబు, అప‌ర్ణా బాల‌ముర‌ళి, ప‌రేష్ రావ‌ల్‌, ఊర్వ‌శి, క‌రుణాస్‌, వివేక్, ప్ర‌స‌న్న‌, కృష్ణ‌కుమార్ కాళీ వెంక‌ట్‌

సాంకేతిక వ‌ర్గం:

స్క్రీన్‌ప్లే:  షాలిని ఉషాదేవి, సుధ కొంగ‌ర‌
అడిష‌న‌ల్ స్క్రీన్‌ప్లే:  ఆలిఫ్ సుర్తి, గ‌ణేశా
డైలాగ్స్‌:  రాకేందు మౌళి
సంగీతం:  జీవీ ప్ర‌కాష్‌కుమార్‌
సినిమాటోగ్ర‌ఫీ:  నికేత్ బొమ్మి
ఎడిటింగ్‌:  స‌తీష్ సూర్య‌
ఆర్ట్‌:  జాకీ
యాక్ష‌న్‌:  గ్రెగ్ పోవెల్‌, విక్కీ
కొరియోగ్ర‌ఫీ:  శోబి, శేఖ‌ర్ వీజే
పీఆర్వో:  వంశీ-శేఖ‌ర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌:  అచిన్ జైన్‌, ప‌విత్ర‌
స‌హ నిర్మాత‌లు:  రాజ‌శేఖ‌ర్ క‌ర్పూర సుంద‌ర‌పాండ్య‌న్‌, గునీత్ మోంగా, ఆలిఫ్ సుర్తి
నిర్మాత‌:  సూర్య‌
క‌థ‌-ద‌ర్శ‌క‌త్వం:  సుధ కొంగ‌ర‌
బ్యాన‌ర్లు:  2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, శిఖ్యా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌