ఆచార్య మూవీ రివ్యూ

Published On: April 29, 2022   |   Posted By:

ఆచార్య మూవీ రివ్యూ

చిరు ‘ఆచార్య’ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

👎

అనగనగా ఓ టెంపుల్ టౌన్ . దాని పేరు ధర్మ స్దలి. స్వయంగా అమ్మవారు వెలిసిన పుణ్యస్థలం ధర్మస్థలి. దానికి కొన్ని వందల చరిత్ర. అక్కడో గిరిజన తండా. అయితే ధర్మ స్దలిని దోచుకునే పోగ్రాం పెట్టుకున్నాడు పొలిటీషన్ బసవ (సోనూసూద్) . అయితే అతనికి అడ్డం పడతాడు ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టిన ఆచార్య (చిరంజీవి). అయినా సరే మైనింగ్‌ మాఫియా లీడర్‌ రాథోడ్‌ (జిషు సేన్‌ గుప్తా) తో కూడా బసవ చేతులు కలిపి…అక్కడ ప్రాంతాన్ని మైనింగ్ కు అప్పగించటానికి రంగం సిద్దం చేస్తాడు. అయితే ఆచార్య గురించిన ఓ విషయం బసవ కు తెలుస్తుంది. ఆచార్య ..మరెవరో కాదు తామని గతంలో అడ్డగించిన సిద్ధ(రామ్ చరణ్) కు చెందిన వాడే అని. ఇంతకీ ఈ సిద్ద ఎవరు…ఆచార్యకు అతనికి లింకేమిటంటే…సిద్ద …ఓ నక్సలైట్ నాయకుడు శంకర్(సత్యదేవ్) కుమారుడు. తను కాల్పుల్లో చనిపోతూ ఆచార్య కు అప్పచెప్తాడు. ఆచార్య …ధర్మ స్దలికి చెందిన నాసర్ కు అప్పచెప్తాడు. అక్కడే పెరిగిపెద్దవుతాడు సిద్ద. అక్కడ గురుకులంలో పెరిగి పెద్దవాడైన సిద్ధ (రామ్ చరణ్), అక్కడి ప్రజలకు అండగా నిలబడి అనుక్షణం ధర్మాన్ని రక్షించేపనిలో ఉంటాడు.

అయితే రాజకీయంగా ఎదగాలనుకున్న బసవ (సోనూసూద్) ధర్మస్థలిని చేజిక్కించుకోవాలని అనుకుంటాడు. కానీ ధర్మస్థలిని కాపాడుతున్న సిద్ధ అడ్డుతొలగిస్తేనే ధర్మస్థలి తన సొంతమవుతుందని భావించిన బసవ అతడి అనుచరులు సిద్ధ మీద అటాక్ చేస్తారు. ఆ క్రమంలో గాయపడిన అతడ్ని కొందరు కాపాడుతారు. అడవిల్లో కు వెళ్లి నక్సలైట్ అవుతాడు. అక్కడే ఆచార్య పరిచయం అవుతాడు. అయితే ఓ సారి దాడిలో ఆచార్య ని రక్షిస్తూ తను బలవుతాడు. అప్పుడు ధర్మ స్దలిని రక్షించే భాధ్యతను ఆచార్యకు అప్పచెప్తాడు. అలా ఆ ప్రాంతంలోకి అడుగుపెడతాడు ఆచార్య (చిరంజీవి). బసవ అతడి గ్యాంగ్ చేసే అరాచకాల్ని ఒకొక్కటిగా ఎండగడుతూ ఉంటాడు. చివరికి ఆచార్య ధర్మస్థలిని కాపాడుతాడు.

Screenplay Analysis:

చిరంజీవి, చరణ్ లాంటి మెగా హీరోలతో కొరటాల శివ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తెలిసిన డైరక్టర్ సినిమా చేస్తున్నారంటే ఎంతో కొంత ఏంటి కాస్త ఎక్కువే ఎక్సెపెక్ట్ చేస్తాము. అయితే చిరంజీవి ఇమేజ్ ని, చరణ్ క్రేజ్ ని వాడుకోవటంలో కొరటాల తడబడ్డాడు..బొక్క బోర్లా పడ్డాడు. ముఖ్యంగా చిరంజీవి సినిమా అంటే ఈ వయస్సుకీ హీరోయిన్ ని ఎక్సెపెక్ట్ చేస్తారు. అలాగే ఫన్ ఆయన బలం. ఆ రెంటినీ ఈ సినిమాలో ప్రక్కన పెట్టారు. దాంతో ఫస్టాఫ్ చాలా డ్రైగా సాగుతుంది. కేవలం చిరంజీవి ఫైట్స్ ..ఐటమ్ సాంగ్స్ తప్పించి ఏమీ కనపడవు. మధ్య మధ్య లో అర్దం పర్దం లేకుండా విలన్స్ వచ్చి పోతూంటారు. వాళ్లకూ ఈ ఆచార్య ఎవరో తెలిసే సరికి ఇంట్రవెల్. ఆ తర్వాత విలన్స్ కు ఆచార్యకు మధ్య ఏదో జరుగుతుందేమో..పెద్ద యుద్దం అనుకుంటే …సిద్ద ప్లాష్ బ్యాక్ ఓపెన్ చేసి సెకండాఫ్ మొత్తం నింపేస్తారు.

అసలు సిద్ద ఎవరు…అతను నేపధ్యం ఏమిటి అనేది ఈ కథకు అసలు సంభందం లేదు..అవసరమూ లేదు. ఎందుకంటే సిద్ద అనే పాత్ర లేకపోయినా ఈ కథ ఉంటుంది. ఎందకంటే ఆచార్య పాత్ర నక్సలైట్..ఆయన్ని ఎవరూ ప్రేరేపించకపోయినా వచ్చి సమస్యలను పరిష్కరించగలరు. అలాంటిది సిద్ద పాత్ర వచ్చి మోటివైట్ చేసి సమస్య దగ్గరకు పంపాలా…పంపితే పంపాడు..ఆ సిద్ద ఎవరు అనేది అంత సేపు మనకు చెప్పాలా..రామ్ చరణ్ ని చూపటానికి కాకపోతే…కాంప్లిక్ట్ లేని కథ. ఉన్న కాస్త కాంప్లిక్ట్ విలన్స్ తో మైనింగ్ మాఫియా. అదీ మనకు ఖలేజా..రీసెంట్ గా వచ్చిన అఖండ గుర్తు చేసేవే.

కేవలం ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంది..కేవంల ఆ ధర్మ స్దలి సెట్ మాత్రమే. దాన్ని బేస్ చేసుకుని సినిమా మొత్తం భరించలేము కదా. మొత్తం మీద ఇది చిరంజీవి వైపు నుంచి చూస్తే ప్యాసివ్ యాక్షన్ క్యారక్టర్. యాక్షన్ చేస్తున్నట్లే ఉంటుంది కానీ ప్యాసివ్ గా తనకు ఎవరూ ఎదురేలేనట్లు వెళ్ళుతుందీ పాత్ర. అదే బోర్ కొట్టేసింది. యాక్షన్ కు రియాక్షన్ ఉంటేనే కదా మజా. అన్నిటికన్నా ముఖ్యం ఎక్కడా ఇది వరకటిలా నక్సల్స్ ప్రభావం అంతగా లేదు కాబట్టి.. ఇప్పటి పరిస్థితులకు అది అంతగా సింకవలేదు.

Analysis of its technical content:

ఈ సినిమాని దర్శకుడుగా కొరటాల శివ తనదైన స్టైల్ లో ఎక్కువ ఎలివేషన్స్, భారీ బిల్డప్పులు లేకుండా చేద్దామనుకున్నారు. అయితే కమర్షియల్ మాస్ హీరోలకు కొన్ని అంశాలు తప్పనిసరి..ఆ ప్రెజంటేషన్ లో మాస్ కు రీచ్ కాని పరిస్దితి ఏర్పడింది. అలాగే కథలో సిద్ద పాత్రకు చోటు లేదు. కానీ ఇరికించినట్లైంది. దాంతో స్క్రీన్ ప్లే మొత్తం బోర్ గా తయారైంది.

పాటల్లో తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి చిందేసిన భలే బంజారా పాట అభిమానుల్ని బాగా అలరిస్తుంది. ఈ వయస్సు లో కూడా కొడుకుతో కలసి ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేయడం చిరుకు మాత్రమే చెల్లింది. అలాగే ఈ సినిమాకు మెయిన్ హైలెట్ ఆర్ట్ వర్క్. అలాగే మణిశర్మ సంగీతం, నేపథ్య సంగీతం అప్ టు ది మార్క్ లేదు. తిరు కెమెరా వర్క్ బాగుంది. రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకి ప్లస్ అయ్యింది. పూజా హెగ్డే.. ఉన్న‌దంటే ఉన్న‌దంతే. వెన్నెల కిషోర్‌, ర‌వి కాలే లాంటివాళ్లు పరిస్దితి మరీ దారుణం. అసలు గుర్తింపు లేదు.

బాగున్నవి:

భలే భలే బంజారా సాంగ్
ఆర్ట్ వర్క్

బాగోలేనివి:

కథ, కథనం
అవుట్ డేటెడ్ ప్రెజంటేషన్
డల్ గా సాగే ప్రొసీడింగ్స్
ఎంటర్టైన్మెంట్ లేకపోవటం

CONCLUSION:

మెగాస్టార్ వీరాభిమానులకు ఈ సినిమా విందు భోజనం లా కనిపిస్తుందేమో మిగతావాళ్లకు మామూలుగా కూడా ఆనదు.

Movie Cast & Crew

నటీనటులు: చిరంజీవి, రామ్‌చరణ్‌, తనికెళ్ల భరణి, పూజా హెగ్డే, అజయ్‌, సోనూసూద్‌, సంగీత, జిషు సేన్‌గుప్త తదితరులు;
సంగీతం: మణిశర్మ;
సినిమాటోగ్రఫీ: తిరు;
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి;
నిర్మాత: నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి, రామ్‌చరణ్‌;
రచన, దర్శకత్వం: కొరటాల శివ;
Run Time:2 hr 34 Mins
విడుదల: 29-04-2022