ఆడతనమా చూడతరమా చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

Published On: October 23, 2021   |   Posted By:
 
ఆడతనమా చూడతరమా చిత్రం ఫస్ట్ లుక్ విడుదల
 
ఆడతనమా చూడతరమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన దర్శకుడు నక్కిన త్రినాధ్ 
 
 
శ్రీమతి ఉషశ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్  బ్యానర్ పై నిర్మించబడిన చిత్రం ఆడతనమా చూడతరమా . మాన్యం కృష్ణ, అవికా రావ్ హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత సుబ్బారెడ్డి ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు.
 
ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు నక్కిన త్రినాధ్ విడుదల చేశారు.
 
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పండు మాట్లాడుతూ…
 
మా ఆడతనమా చూడతనమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన డైరెక్టర్ నక్కిన త్రినాధ్ గారికి ధన్యవాదాలు.నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన నిర్మాత సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు, అందరికి నచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతోంది. త్వరలో మా సినిమా ట్రైలర్ ను విడుదల చెయ్యబోతున్నాము అన్నారు. 
 
నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ…
 
డైరెక్టర్ పండు మంచి కాన్సెప్ట్ తో ఆడతనమా చూడతరమా సినిమాను తెరకెక్కించారు. సినిమా బాగా వచ్చింది, పాటల మినహ చిత్రీకరణ పూర్తి అయ్యింది. మా దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ లో వస్తోన్న మొదటి సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి. మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన నక్కిన త్రినాధ్ గారికి ధన్యవాదాలు అన్నారు. 
 
నటీనటులు: 
మాన్యం కృష్ణ, అవికా రావ్, సప్తగిరి, తాగుబోతు రమేష్, ధనరాజ్ తదితరులు
 
సాంకేతిక నిపుణులు: 
డైరెక్టర్: పండు
నిర్మాత: సుబ్బారెడ్డి
సంగీతం: సుక్కు
సినిమాటోగ్రఫీ: నానాజీ. ఎంవి.గోపి
డాన్స్: అనీష్
ఫైట్స్: మల్లేష్