ఆర్ఆర్ఆర్ – రౌద్రం రణం రుధిరం మూవీ రివ్యూ
రాజమౌళి “ఆర్ ఆర్ ఆర్” రివ్యూ!
మొత్తానికి మూడేళ్ళ నిరీక్షణకు తెర పడింది, తమ అభిమాన హీరోలని తెరమీద చూసుకుని ఎన్టీఆర్,చరణ్ ఫాన్స్ లో ఆనందం కట్టలు తెంచుకుంటోంది. RRR అంటూ గత కొన్ని నెలలుగా ఊగిపోతున్న అభిమానులకు రాజమౌళి చెప్పినట్టుగానే బిగ్ ట్రీట్ తో థియోటర్స్ లోకి దిగిపోయారు. రియల్ ఫ్రెండ్స్ కాస్తా రీల్ ఫ్రెండ్స్ గా మారి ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన సమయం ఇది.ఆ అంచనాలను అలాగే ఒడిసిపెట్టి సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లారా? RRR కేవలం ఫాన్స్ కే కాదు, ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ అనిపించారా? RRR థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల ఉత్సాహం ఉరకలుకు ఈ సినిమా సరైన ప్రతి ఫలం ఇస్తుందా. RRR మ్యానియాతో, RRR ఫీవర్ తో ఊగిపోతున్న క్రేజ్ ని ఈ సినిమా క్యాష్ చేసుకోగలుగుతుందా.‘బాహుబలి’తోనే కొత్త రికార్డులు సృష్టించిన రాజమౌళి ఈ సినిమాతో దాన్ని దాటారా.
అలాగే ఇద్దరి స్టార్స్ ను కథలో బాలెన్స్ చేయగలిగారా? ప్యాన్ ఇండియా మేకింగ్ కు తగ్గ కథేనా? కథ ఏంటి? ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగే అవకాసం ఈ సినిమా ఇస్తుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
Storyline:
అవి బ్రిటీష్ వాళ్లు భారతదేశాన్ని ఏలుతున్న రోజులు. దేశమే కాదు అందులో మనుష్యులు తమ తొత్తులు, బానిసలు అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో 1920 లో అదిలాబాద్ లో ఓ గోండు తెగ కు చెందిన మల్లి అనే చిన్న పాప పాడిన పాట విని,ఆమెను తమతో పాటు తీసుకెళ్లాలని ఫిక్స్ అవుతారు. అడ్డుపడిన ఆ పిల్ల తల్లిని చావకొట్టి ఎత్తుకుపోతారు. అప్పుడు ఆ తెగ కాపరి భీమ్ (ఎన్టీఆర్) ఆ పాపను వెనక్కి తీసుకురావటానికి డిల్లీ వెళ్తాడు. ఈ విషయం బ్రిటీష్ వారికి తెలుస్తుంది. అదే సమయంలో బ్రిటీష్ వారి దగ్గర పోలీస్ అధికారిగా రామ్ రాజు (రామ్ చరణ్) పనిచేస్తూంటాడు. సమర్ధుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న అతనికి భీమ్ ని పట్టుకునే పని అప్పచెప్తారు. తమ తమ పనిల్లో ఉన్న రామ్, భీమ్ లు యధాలాపంగా బయిట కలుస్తారు.తన కోసమే రామ్ వెతుకుతున్నాడని తెలియక భీమ్ అతనితో స్నేహం చేస్తాడు. కొద్ది రోజుల్లోనే ప్రాణ స్నేహితులుగా మారతారు. ఈ క్రమంలో భీమ్ కు ఆ పాప …ఎక్కడ దాచారో తెలుస్తుంది. ఆమె ను ఎత్తుకురావటానికి పెద్ద స్కెచ్ వేస్తారు. రామ్ దాన్ని అడ్డుకుని భీమ్ ని బంధిస్తాడు. బ్రిటీష్ ప్రభుత్వం భీమ్ కు ఉరిశిక్ష వేస్తుంది. అప్పుడు భీమ్ ఏం చేసాడు. అసలు రామ్ నేపధ్యం ఏమిటి..అతను బ్రిటీష్ వారి దగ్గర ఎందుకు పనిచేస్తున్నాడు. విడిపోయిన ప్రాణ స్నేహితులు మళ్లీ కలిసారా…తిరిగి గోండుల పిల్ల మల్లి తన గూడానికి వెళ్లగలిగిందా,విజయ్ రామరాజు (అజయ్ దేవగన్) పాత్ర ఏమిటి, వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Screenplay Analysis:
The Motorcycle Diaries (2004)నుంచి ప్రేరణ పొందినట్లుగా చెప్పబడుతున్న ఈ కథ మన పాత సినిమా షోలే (1975)ని గుర్తు చేస్తుంది. ఈ సినిమాలో వరసగా ఎపిసోడ్స్ వస్తూంటాయి. హీరోలు ఇంట్రడక్షన్, తర్వాత ఇంట్రవెల్ బ్లాక్, ఆ తర్వాత ప్లాష్ బ్యాక్ బ్లాక్, ఫైనల్ గా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బ్లాక్. ఇలా వరసగా ఎపిసోడ్స్ వెళ్తూంటాయి. వాటిని కలుపుతూ సన్నని కథ నడుస్తూంటుంది. అలాగే హీరోలకు ఇద్దరకి వారి పాత్రలను ..ఒకరు నిప్పు, మరొకరు నీరుగా డిజైన్ చేసారు. నిప్పుగా ఎప్పుడూ మండిపడుతూ ఉండే రామారాజు, నీరులా అందరినీ కలుపుకుంటూ వెళ్ళే భీమ్ లను క్యారక్టర్స్ ని దృష్టిలో పెట్టుకునే సీన్స్ నడుస్తూంటాయి. అయితే ఫస్టాఫ్ ఉనట్లుగా సెకండాఫ్ రేసీగా అనిపించదు. అందుకు స్క్రీన్ ప్లేనే కారణమనిపిస్తుంది. సినిమాలో మెయిన్ కాంప్లిక్ట్స్ బ్రిటీష్ వారు.
ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి హీరోలు ఇద్దరూ కలిసి …బ్రిటీష్ వారి పోరాటం ప్రకటిస్తే సీన్స్, స్క్రీన్ ప్లే వేరే విధంగా ఉండేది. అలాగే సెకండాఫ్ లో అజయ్ దేవగన్ ప్లాష్ బ్యాక్ కథకు పెద్దగా అవసరం లేదేమో అనిపిస్తుంది. రామ్ చరణ్ పాత్ర సీతారామరాజు అని చెప్పినప్పుడు అతనికి స్వతంత్ర్య ఉద్యమానికి ప్రేరణ అనవసరం అనిపిస్తుంది. ఇక అలియా భట్ పాత్ర అయితే తెరపై సీన్లే లేదు.హీరోలు ఇద్దరికి సీన్స్ బాలెన్స్ చేయటం మీద దృష్టి పెట్టి స్క్రిప్టు ని సోసోగా మార్చేసారు. యాక్షన్ ఎపిసోడ్స్ మాయలో కొంతవరకూ ఆ వెలితి కనపడదు కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి అది పూర్తిగా కనపిస్తుంది. సెకండాఫ్ లో ఏమీ జరిగినట్లు అనిపించదు. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సినిమా భీమ్ లక్ష్యంతో మొదలై, రామ్ అలాగే ఫన్ కు, రొమాన్స్ కు అవకాసం లేకుండా పోయింది. దాంతో రిపీట్ ఆడియన్స్ కు ఈ సినిమా చోటు ఇచ్చే అవకాసాలు తక్కువ.
Analysis of its technical content:
దర్శకుడుగా రాజమౌళి కమర్షియల్ ఎంటర్టైనర్స్ తీయటంలో పీహెడ్ డీ చేసేసారు. అయితే బాహుబలిలాంటి సినిమా దాని బాబులాంటి సినిమా మళ్లీ మళ్ళీ రావాలంటే కష్టం. అయితే ఎపిసోడిక్ గా కథ రాసుకోవటం ఆయన జాబ్ కు హ్యాపీగా ఉండచ్చేమో కానీ ఆ ఎపిసోడ్స్ అన్ని తెరపై సరిగ్గా కలవనప్పుడు ఇబ్బందే. అలాగే ప్రతీ సారి ఆయన సినిమాల్లో ఇంట్రవెల్ ఉన్నంత గొప్పగా క్లైమాక్స్ ఉండుదు. ఈ సారి అదే జరిగిందే. ఆయన సినిమాల్లో కనపించే రొమాంటిక్ సాంగ్స్ కూడా కనపడకపోవటం మరో మైనస్. అలాగే నీరు, నిప్పు అంటూ హీరోలు ఇద్దరినీ పరిచయం చేశారు కానీ… ఆ కాన్సెప్ట్‌కీ, సినిమాకీ సంబంధమేమీ లేకపోవటం ఆశ్చర్యమనిపిస్తుంది.
ఇక పాటల్లో నాటు నాటు సాంగ్ చాలా బాగుంది. కొరియోగ్రఫీ కూడా అదిరిపోయింది. థియోటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మిగతా పాటలు సోసోగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు కలిసొచ్చింది. సెంథిల్ కెమెరా వర్క్ ఎప్పటిలాగే సినిమాకు వెన్నుముకలా ఉంది. ప్రతి సీన్ ని చాలా గ్రాండ్ లుక్‌లో చూపించారు. అలాగే శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు శిరిల్ వర్క్, నెక్ట్స్ లెవిల్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ లో వచ్చే మినీయేచర్ ట్రైన్ ఎపిసోడ్ మాములుగా లేదు. కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్ కూడా స్పెషల్ గా చెప్పుకోవాలి. బుర్రా సాయిమాధవ్ మాటల్లో పెద్దగా విరుపు,మెరుపు లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది ఈ భారీ సినిమాకు?
నటీనటుల్లో..
ఎన్టీఆర్ నటనలో ఎవరూ పోటీ రారు అన్నట్లు చేసారు. రామ్ చరణ్ సెకండాఫ్ లో తన నటనా కౌశలం ప్రదర్శించారు. వాళ్ల ప్రెడ్షిప్ సీన్స్, ఫైట్ సీన్స్ ప్రత్యేకంగా ఉన్నాయి. ‘నాటు నాటు’ పాటలో ఇద్దరూ కలిసి చేసిన డాన్స్ వేరే హీరోలతో సాధ్యం కాదేమో అనిపిస్తుంది. అలియాభట్ కు అసలు సీన్స్ లేవు. అజయ్ దేవగణ్ సినిమాకి కీలకం. కానీ మరీ పాత కాలం వ్యవహారంలా ఉంది. శ్రియది చిన్న పాత్రే. భీమ్ ఇష్టపడే బ్రిటిష్ యువతిగా ఓలివియా మోరిస్ బాగా చేసింది. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ కాజువల్ గా చేసుకుంటూ పోయారు. ప్రత్యేకత ఏమీ లేదు.
హైలెట్స్
ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిపి చేయటం
భారీగా జంతువుతో చేసిన ఇంట్రవెల్
మైనస్ లు
సెకండాఫ్
అజయ్ దేవగన్ ప్లాష్ బ్యాక్
CONCLUSION:
చూడచ్చా
ఇంత పెద్ద తెలుగు సినిమాని ఎలా మిస్ చేసుకోమని చెప్తాం?’బాహుబలి’తో పోలిక మాత్రం పెట్టుకోకూడదు.
Movie Cast & Crew
తెర వెనక…తెర ముందు
బ్యానర్: డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు :యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, సముద్ర ఖని, అజయ్ దేవగన్, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్ తదితరులు.
మాటలు: సాయిమాధవ్ బుర్రా, కర్కీ,
కాస్ట్యూమ్ డిజైనర్: రమా రాజమౌళి.
ఎడిటర్:శ్రీకర్ ప్రసాద్,
వి.ఎఫ్.ఎక్స్ సూపర్ విజన్: వి.శ్రీనివాస్ మోహన్,
మ్యూజిక్: ఎం.ఎం.కీరవాణి,
ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్,
సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌కుమార్,
కథ: వి.విజయేంద్రప్రసాద్,
నిర్మాత: డి.వి.వి.దానయ్య,
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి.
Run Time: 3 గం 02 నిమిషాలు
విడుదల: 25-03-2022