ఆహా చిత్రాల ప్రీమియర్స్
జూలై 9న ‘ఒక చిన్న విరామం’, ‘విక్రమార్కుడు’ చిత్రాల ప్రీమియర్స్‌తో సందడి చేయనున్న ఆహా
గతవారం పదిహేను చిత్రాలతో సందడి చేసిన హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ఈ జూలై 9న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఒక చిన్న విరామం’, యాక్షన్ డ్రామా ‘విక్రమార్కుడు’ వంటి చిత్రాలతో డబుల్ ప్రీమియర్స్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. ‘ఒక చిన్న విరామం’ సినిమా విషయానికి వస్తే ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. పునర్నవి భూపాలం, గరిమ, నవీన్ నేని ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే తమిళంలో మక్కల్ సెల్వన్ నటించిన కమర్షియల్ యాక్షన్ డ్రామా జుంగను తెలుగులో ‘విక్రమార్కుడు’గా అందిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతితో పాటు సయేషా, మడొన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
‘చిన్నవిరామం’ సినిమా సుదీప్ చెగూరి దర్శక నిర్మాణంలో రూపొందింది. బిజినెస్‌మేన్ అయిన దీపక్ తనను ప్రేమించిన వారి కోసం ఎంతదూరమైనా వెళ్లే వ్యక్తి. అలాంటి వ్యక్తి తన గర్భవతి అయిన భార్య సమీరా కోసం బాలు, మాయ సాయాన్ని కోరుతాడు. అప్పుడేం జరిగిందనేదే కథ. ఈ సినిమా వీక్షక్షకులను ఉత్కంఠతకు గురిచేస్తుంది. ముఖ్య పాత్రధారుల పెర్ఫామెన్సెస్, థ్రిల్లింగ్ మూమెంట్స్, ఎమోషన్స్ కలబోతగా సినిమా రన్ అవుతుంది.
‘విక్రమార్కుడు’ సినిమా కథ విషయానికి వస్తే జుంగ అనే పాత్ర చుట్టూ నడిచే కథ ఇది. ఓ తగాదాలో తన పూర్వీకుల ఆస్థిని, థియేటర్‌ను కోల్పోతాడు. అతను పారిస్‌కు వెళ్లాల్సి వస్తుంది. అక్కడకు వెళ్లిన తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి డాన్‌గా మారి క్రిమినల్ గ్యాంగ్‌తో పోరాటం చేస్తాడు. యాక్షన్ సన్నివేశాలు, కామెడీ అన్ని కలగలిపి పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా మారుతుంది. గోకుల్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది.
రీసెంట్గా ‘సూపర్‌హిట్స్’ అనే క్యాంపెయిన్‌ను ఆహా స్టార్ట్ చేసింది. ప్రేక్షకులు తమ అభిమాన తారలు నటించిన తమ ఫేవరేట్ చిత్రాలు, వెబ్ ఒరిజినల్స్‌ను చూడటం ద్వారా అభిమానాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. కార్తి నుంచి రవితేజ, సమంత, తమన్నా, అల్లరి నరేశ్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కెరీర్ బెస్ట్ ఫెర్ఫామెన్స్ చేసిన ‘సుల్తాన్, క్రాక్, నాంది, లెవన్త్ అవర్, సామ్, ట్రాన్స్’ చిత్రాలను, వెబ్ సిరీస్‌లను ‘ఆహా’లో ఎంజాయ్ చేయవచ్చు.
2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రాలైన ‘క్రాక్, జాంబిరెడ్డి, నాంది, చావు కబురు చల్లగా, సుల్తాన్, లెవన్త్ అవర్, అర్ధ శతాబ్దం, కాలా, లుకా, షైలాక్, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ వంటి వాటితో పాటు అపరిమితమైన ఎంటర్టైన్మెంట్ను అందించే ఏకైక మాధ్యమం ‘ఆహా’ మాత్రమే