ఇక్షు చిత్రం సెప్టెంబర్ రిలీజ్

Published On: August 6, 2022   |   Posted By:

ఇక్షు చిత్రం సెప్టెంబర్ రిలీజ్

రామ్ అగ్నివేష్,  రాజీవ్ కనకాల, బాహుబలి ప్రభాకర్,  చిత్రం శీను వంటి ప్రముఖ తారాగణం రూపొందిన తాజా చిత్రం ఇక్షు. పద్మజ పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై డా.హన్మంత్ రావు నాయుడు నిర్మించిన ఈ సినిమాకు వివి ఋషిక దర్శకత్వం వహించారు.

ఇప్పటికే ఈ సినిమా ఐదు భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ ముగించుకోగా తాజాగా మొదటి ప్రీమియర్ ను కూడా ప్రదర్శించారు. బిజినెస్ కోసం వేసిన ఈ ప్రీమియర్ లో ఇక్షు సినిమాకి మంచి ఆదరణ లభించింది. దర్శకురాలు వివి ఋషికతో పాటు హీరో రామ్ అగ్నివేష్ కి మంచి మార్కులు పడ్డాయి.

ఈ  సినిమాతో దర్శకురాలిగా అరంగేట్రం చేసిన  వివి ఋషిక  ఎంచుకున్న  కథకు సినీ ప్రముఖులు ఫిదా అయ్యారు. యువ నటుడు రామ్ అగ్నివేశ్ ఈ సినిమాతో  అరంగేట్రం చేసినప్పటికీ ప్రముఖ నటినటులతో సమానంగా నటించి వారితో ప్రశంసలు పొందారు.

ఇక ఈ సినిమా తమిళ్, మలయాళం  ధియేటరికల్ హక్కులను ఒక ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది.

ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం జీ5 సహా నెట్ఫ్లిక్ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి. మిగిలిన బిజినెస్ కార్యక్రమాలు అన్నీ పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీ డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలో ప్రెజెంటర్ గా సాయి కార్తీక్ గౌడ్ జాడి నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ కానుంది.