ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీ రివ్యూ

Published On: July 18, 2019   |   Posted By:

ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీ రివ్యూ

ఇది పూరి ‘బుర్రకథ’  (‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ)
Rating: 2.5/5

కొత్త కథలతో తెలుగు సినిమా ఈ మధ్యన ఇంట్రస్టింగ్ గా మారింది. పాతకు నీళ్లొదిలి, కొత్తను ఆహ్వానిస్తూ సినిమాలు చేస్తున్నారు. ప్రేక్షకులు అలాంటి సినిమాలనే ఆదరిస్తున్నారు. ఈ మధ్యన వరసగా వచ్చిన సినిమాలు ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తున్నాయి. ఇప్పుడు సీనియర్ డైరక్టర్ పూరి జగన్నాథ్ సైతం తనో కొత్త పాయింట్ తో పలకరిస్తానంటున్నారు. సైన్స్ ఫిక్షన్ తరహా హాలీవుడ్ పాయింట్ ని తీసుకుని తెలుగు నేటివిని అద్ది అందించారని చెప్పబడుతున్న ఈ సినిమా ఎలా ఉంది…పూరి ఎదురుచూస్తున్న హిట్ వచ్చిందా..రామ్ కెరీర్ కు ఏమన్నా ప్లస్ అవుతుందా… ఇంతకీ ఈ సినిమా కథేంటి..మనవాళ్లకు నచ్చేదానా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ

ఉస్తాద్ శంకర్‌ (రామ్‌ పోతినేని) మనీ కోసం అవసరమైతే మర్డర్స్ చేసే రకం. అయితే నడిచినంతకాలం అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఒక్కసారి పోలీస్ లకు పట్టుబడితే..ఇప్పుడు అదే అయ్యింది శంకర్ ఓ పొలిటీషియన్  కాశీ రెడ్డి (పునీత్ ఇస్సార్) మర్డర్ కేసులో దొరికిపోయాడు. ఆ క్రమంలోనే తన లవర్ చాందిని(నభా నటేషా) చనిపోయింది. జైలుకు వెళ్లిన శంకర్ కు ఒకటే కోరిక..తన లవర్ ని చంపేసినవాళ్లని తిరిగి చంపేయాలని. జైలునుంచి తప్పించుకుని ఆ పనిలో ఉండగా గాయపడతాడు. అతని వెంటపడ్డ సీఐబీ కు దొరికిపోతాడు. వాళ్లు ఇతన్ని ఎంక్వైరీ గట్రా చేయకుండా మెల్లిగా అతని మైండ్ లోకి  కొన్ని జ్ఞాపకాలు ప్రవేశపెడ్తారు. అవి ఎవరివీ అంటే చనిపోయిన ఓ సీబీఐ అధికారి  (సత్య)వి. ఆ విషయం తెలియని శంకర్ ఏం చేసాడు. ఇప్పుడు అతని మెదడులో ఉన్న సీబీఐ ఆఫసర్ జ్ఞాపకాలు ప్రకారం వెళ్లిపోయాడా, అసలు వాళ్లెందుకు ఆ పని చేసారు…చాందినీని చంపిందెవరు.. శంకర్ పగ తీర్చుకున్నాడా  వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హాలీవుడ్ ప్రేరణ

దాదాపు ఇలాంటి స్టోరీ లైన్ తో  Criminal (2016)అనే సినిమా వచ్చింది. అయితే ఇక్కడ మనకు తెలుగు నేటివిటి అంటూ రొటీన్ సీన్స్ ని కలుపుకుంటూ పూరి ఆ పాయింట్ ని ఎడాప్ట్ చేసుకున్నారు. అయితే సినిమాని తన స్టైల్ కు మార్చుకుని ఎక్కడా కాపీ అనిపించకుండా చేయటంలో మాత్రం సక్సెస్ అయ్యారు. అక్కడ సీఐఏ ఉంటే ఇక్కడ సీబీఐ ని తీసుకువచ్చాడు. అలాగే కీలకమైన మరికొన్ని సీన్స్ ని కూడా మార్చుకుంటూ వెళ్లాడు. అయితే క్రిమినల్ మైండ్ లో ఓ పోలీస్ అధికారి జ్ఞాపకాల చిప్ పెట్టడం మాత్రం రెండింటింలోనూ కామనే.
 
 పాయింట్ కొత్త..రివేంజ్ పాత

ఇలా హాలీవుడ్ పాయింట్ తీసుకుని తెలుగుకు ఎడాప్ట్ చేయటం కొత్తేమీ కాదు. గతంలో పూరి సైతం చేసినవే. అయితే ఎంత బాగా ఎడాప్ట్ చేసారనేదే ఎప్పుడూ క్వచ్చిన్. ఈ సినిమాలో నేటివిటి అద్దే క్రమంలో రొటీన్ సీన్స్ ని వేసుకుంటూ వెళ్ళటమే విసిగిస్తుంది. అలాగే ఈ మధ్యనే వచ్చిన ఆది నటించిన బుర్ర కథను సైతం ఈ సినిమా గుర్తు చేస్తుంది. ఇక అంతకు ముందు అల్లు అర్జున్, రామ్ చరణ్ నటించిన ఎవడు సైతం ఇలాంటి కథ కదా. ఇక ఈ సినిమా పాయింట్ కొత్తగా అనిపించినా పూరి తన మార్క్ పాత రివేంజ్ ఫార్ములాతో నింపేసాడు.

పెద్ద మైనస్

ఇక ఈ సినిమాలో విలన్ అనేవాడు చివరి దాకా కనపడడు. దాంతో హీరో క్యారక్టర్ యాక్టివ్ గా ఉన్నట్లు కనపడినా పూర్తి ప్యాసివ్ గా నడుస్తుంది. దాంతో థ్రిల్లర్ లక్షణాలతో యాక్షన్ సినిమా ముగిసింది.

మాస్ ముసుగులో..

ఇక ఈ సినిమాని పూరి జగన్నాథ్ పూర్తి మాస్ మూవిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసారు. అయితే మాస్ జనం ఇంకా అలాగే ఉంటే ఈ సినిమా వాళ్లకు బాగా కిక్ ఇస్తుంది. అలా కాకుండా వాట్సప్, ఫేస్ బుక్ , ట్విట్టర్ లతో అప్ డేట్ అయిన వాళ్లకి ఇది సోసోగా ఉందనిపిస్తుంది. మాస్ అంటే మరీ డైలాగులు, ఫైట్ లు వంటి వి మరీ నాటుగా ఉండక్కర్లేదేమో అనిపిస్తుంది.   కథని తన ఇష్టానికి తగినట్లుగా తిప్పుకుంటూ వెళ్లి ,   సీన్లు రాసుకున్నారు. ఈ క్రమంలో మాస్‌ని మెప్పించాడేమో గానీ,ఫ్యామిలీలను ఆకట్టుకోవటం కష్టమే అనిపిస్తుంది.

రామ్ దే కష్టం

ఇక ఈ సినిమాలో హైలెట్ గా చెప్పుకోదగింది మాత్రం హీరో రామ్ నే .అతనికి  మాస్ హీరో అనిపించుకోవాలనే కోరిక ఈ సినిమాతో తీరినట్లునిపిస్తుంది.  అతని కష్టం,ఎనర్జీ తెరపై పూర్తి స్దాయిలో కనిపిస్తుంది. క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ తో సహా అంతా రామ్ కష్టమే మరి.
 
టెక్నికల్ గా …

 సినిమాటోగ్రఫర్ రాజ్ తోట ఈ సినిమాని లేపి నిలబెడితే …. మణిశర్మ తన నేపధ్య సంగీతంతో మొత్తం మోసాడు.  ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదనిపించాడు. నిర్మాతలు పూరి – ఛార్మి ల నిర్మాణ విలువులు సినిమాకు తగ్గట్లే ఉన్నాయి.
 
చూడచ్చా
మాస్ సినిమాలు మిస్ అవుతున్నాం అని ఫీలయ్యేవారికి నచ్చే చిత్ర

తెర వెనక ..ముందు
బ్యాన‌ర్స్‌: పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్
న‌టీన‌టులు: రామ్, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌, పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌
సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌
ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ
ఆర్ట్‌: జానీ షేక్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌
మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌
ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌