Reading Time: < 1 min

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత

మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేయాలని సూచించారు. వైద్యులు చెప్పినట్టుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది. రెండు రోజుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు.

మన తెలుగు నేల ప్రముఖ వ్యాపార వేత్త, ఈటీవీ ఛానెల్ అధినేత, ప్రముఖ నిర్మాత అలాగే ఈనాడు దినపత్రిక సృష్టికర్త గా దిగ్గజం రామోజీరావు గారు ఎలాంటి ముద్ర వేశారో అందరికీ తెలిసిందే. రంగం ఏదైనా సరే బెస్ట్ క్వాలిటీ కంటెంట్ మాత్రమే ఇవ్వడం ఆయన ఆనవాయితీగా పెట్టుకొని ఎన్నో మన్ననలు పొందారు.

అలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహా టెలివిజన్ రంగంలో కూడా ఒక కొత్త ఒరవడి సృష్టించారు. కానీ ఇప్పుడు ఆయన ఇకలేరు అనే విషాద వార్త తెలుగు ప్రజల్లో టెలివిజన్ రంగం సహా సినీ వర్గాల్లో విషాద ఛాయలు తీసుకొచ్చింది. నిన్న రాత్రి సమయంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు.

మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా పచ్చళ్ళు, ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై మంచి సినిమాలు కూడా అందించారు. ఇలా వారు టచ్ చేయని రంగం లేదు.

ఈనాడు సంస్థల అధినేతగా రామోజీరావు ఫిలిం సిటీ నిర్మించడమే కాదు అనేక సినిమాలను నిర్మించారు కూడా. ఉషాకిరణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేసిన అఆయన ఎన్నో మరపురాని సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. హృద్యమైన కథలకు ఆ సంస్థ పెట్టింది పేరు అనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ లేకున్నా యువ దర్శకులకూ, నటీనటులకు అవకాశాలిచ్చి, వారి ప్రతిభను బయటకు తీసుకొచ్చి ఎందరినో తెలుగు సినీ పరిశ్రమకు అందించింది.