ఉంగరాల రాంబాబు ట్రయిలర్ రివ్యూ

Published On: September 11, 2017   |   Posted By:

ఉంగరాల రాంబాబు ట్రయిలర్ రివ్యూ

సునీల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సంబంధించి ఇది రెండో ట్రయిలర్. ఇప్పటికే విడుదలైన ట్రయిలర్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ రావడంతో మరింత కేర్ తీసుకొని సెకెండ్ ట్రయిలర్ లాంచ్ చేశారు. సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో భాగంగా.. టాలీవుడ్ కు చెందిన హాస్య నటులు అందరి సమక్షంలో ఈ ట్రయిలర్ లాంచ్ చేశారు.

ఉంగరాల రాంబాబు సినిమాకు సంబంధించి విడుదల చేసిన మొదటి ట్రయిలర్ లోనే పాత్రల పరిచయం అయిపోవడంతో.. రెండో ట్రయిలర్ లో ఆశ్చర్యకరమైన ఎలిమెంట్స్ ఏమీ లేవు. కాకపోతే మొదటి ట్రయిలర్ ను కామెడీ యాంగిల్ లో కట్ చేస్తే.. తాజాగా విడుదల చేసిన రెండో ట్రయిలర్ లో కామెడీతో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చూపించారు. రైతే రాజు అనే బలమైన సబ్జెక్ట్ ను ఎలివేట్ చేసేలా సినిమా తెరకెక్కిందనే విషయం తాజా ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.

తన గత చిత్రాలతో విమర్శకుల ప్రశంసల సైతం అందుకున్న క్రాంతి మాధవ్.. ఈ సినిమాకు దర్శకుడు. ఈనెల 15న థియేటర్లలోకి రానున్న ఉంగరాల రాంబాబు సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించాడు.