ఉప్పెన చిత్రం పాటకు అద్వితీయ స్పందన
సూపర్ స్టార్ మహేష్‌బాబు విడుదల చేసిన ‘ఉప్పెన’లోని ‘రంగులద్దుకున్న’ పాటకు అద్వితీయ స్పందన
పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా కు డైరెక్టర్‌గా ఇదే తొలి చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లపై చిత్రీకరించిన ‘రంగులద్దుకున్న’ లిరికల్ వీడియో సాంగ్‌ను సూపర్ స్టార్ మహేష్‌బాబు నవంబర్ 11న విడుదల చేసిన విషయం తెలిసిందే. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ బాణీలు కూర్చిన ఈ మనోహరమైన లవ్ సాంగ్‌ను శ్రీమణి రాయగా, యాజిన్ నిజర్, హరిప్రియ అంతే కమ్మని స్వరాలతో సుమనోహరంగా ఆలపించారు. పాటలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లను చూసినవాళ్లు వారితో ప్రేమలో పడకుండా ఉండలేరన్నంతగా వారి మధ్య కెమిస్ట్రీ ముచ్చటగొల్పుతోంది.
చాలా తక్కువ సమయంలోనే ఈ పాట శ్రోతల ప్రేమను సంపాదించి 1 మిలియన్ వ్యూస్‌ను దాటడం విశేషం. ముఖ్యంగా దేవిశ్రీ బాణీలు ఎంత మెలోడియస్‌గా ఉన్నాయో, “రంగులద్దుకున్న తెల్ల రంగులవుదాం.. పూలు కప్పుకున్న కొమ్మలల్లెవుందాం..” అంటూ శ్రీమణి రాసిన సాహిత్యం అంత బాగా ఆకట్టుకుంటోంది. గాయనీ గాయకులు యాజిన్ నిజర్, హరిప్రియ గానం ఈ పాటకు వన్నె తెచ్చింది.
దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట బ్లాక్‌బస్టర్ హిట్టయి, మ్యూజిక్ చార్టుల్లో టాప్ పొజిషన్‌లో ఉండగా, ‘ధక్ ధక్ ధక్’ సాంగ్ సైతం సంగీతప్రియుల ఆదరణను పొందింది. ఇప్పుడు మూడో పాట ‘రంగులద్దుకున్న’తో డీఎస్పీ మరో మ్యాజిక్ చేశారని అందరూ ప్రశంసిస్తున్నారు.
దర్శకత్వం వహించడంతో పాటు ‘ఉప్పెన’కు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను బుచ్చిబాబు అందించారు.
తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్న ‘ఉప్పెన’ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులూ పూర్తయ్యాయి. సానుకూల పరిస్థితులు ఏర్పడి, థియేటర్లు తెరుచుకోగానే చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నద్ధంగా ఉన్నారు.
తారాగణం:

పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ
సాంకేతిక బృందం:
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుద్దీన్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: మౌనికా రామకృష్ణ
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్