Reading Time: < 1 min

ఊరి పొలిమేర -2 మూవీ న‌వంబ‌ర్ 2 విడుద‌ల‌

న‌వంబ‌ర్ 2న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మైన  మా ఊరి పొలిమేర -2

శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్ పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రంమా ఊరి పొలిమేర-2. డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని నవంబ‌ర్ 2న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మవుతోంది.
ఈ సంద‌ర్భంగా నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూమా ఊరి పొలిమేర‌ మొద‌టి పార్ట్ ఎంత పెద్ద హిట్ట‌యిందో అంద‌రికీ తెలిసిందే. సెకండ్ పార్ట్ పై ఇప్ప‌టికే భారీ అంచానాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా భారీ బ‌డ్జెట్ తో చేశాం. ఇటీవ‌ల మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ చేతుల మీదుగా విడుద‌లైన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌తి విష‌యంలో ఎంతో కేర్ తీసుకుని మా ద‌ర్శ‌కుడు మా ఊరి పొలిమేర‌-2 పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేస్తున్నారు. న‌వంబ‌ర్ 2న సినిమాను గ్రాండ్ గా థియేట‌ర్స్ లో రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

ద‌ర్శ‌కుడు డా.అనిల్ విశ్వ‌నాథ్ మాట్లాడుతూగ్రామీణ నేప‌థ్యంలో జ‌రిగే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి మా ఊరి పొలిమేర‌-2 చిత్రాన్ని తెర‌కెక్కించాం. మొద‌టి పార్ట్ క‌న్నా సెకండ్ పార్ట్ ఇంకా ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా ఉండ‌బోతుంది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వచ్చింది. పాడేరు, కేర‌ళ‌, ఉత్త‌రాఖండ్ లో షూటింగ్ చేశాము. మా నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నేను అడిగిన ప్ర‌తిదీ స‌మ‌కూర్చుతూ సినిమా క్వాలిటీగా రావ‌డానికి స‌హ‌క‌రిస్తున్నారు. స‌త్యం రాజేష్‌, కామాక్షి అద్భుతంగా న‌టించారు. నవంబ‌ర్ 2న మా సినిమా గ్రాండ్ గా థియేట‌ర్స్ లో రిలీజ్ కాబోతుంది అన్నారు.

సాంకేతికవర్గం :

సంగీతం : గ్యాని
సినిమాటోగ్ర‌ఫీః ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి
ఎడిటింగ్ః శ్రీ వ‌ర‌
నిర్మాతః గౌరి కృష్ణ‌
స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైర‌క్ష‌న్ః డా.అనిల్ విశ్వ‌నాథ్‌