ఎంత మంచివాడ‌వురా మూవీ రివ్యూ

Published On: January 15, 2020   |   Posted By:

ఎంత మంచివాడ‌వురా మూవీ రివ్యూ

ఎంత బోరుగాడివిరా (`ఎంత మంచివాడ‌వురా!`రివ్యూ)
 
Rating:1.5/5

 ఎప్పుడూ మాస్ క‌థ‌ల్లోనే కనిపిస్తున్నాం…ఫ్యామిలీలకు దూరం అయ్యిపోతున్నాం అని కళ్యాణ్ రామ్ కు లోపల ఫీలింగ్ ఉందేమో. ఈ కథ చెప్పగానే కనెక్ట్ అయ్యి చేసేసాడు.  గుజ‌రాతీలో సక్సెస్ అయిన `ఆక్సిజ‌న్‌`కి రీమేక్‌ అవటం కూడా ఆయన ఒప్పుకోవటానికి కారణం అయ్యింటుంది. ఇవన్నీ కాకపోయినా `శ‌త‌మానం భ‌వ‌తి`తో జాతీయ అవార్డుని సొంతం చేసుకున్న స‌తీష్ వేగేశ్న  డైరక్షన్ అనేసరికి కొద్దిగా టెమ్ట్ అయ్యింటాడు. సంక్రాంతికి తను ఓ ఫీల్ గుడ్ సినిమాతో రావటం ఖచ్చితంగా బాగుంటుందని చేసిన ఈ సినిమా అతని కోరికని తీర్చిందా… రీమేక్ చేసేటంత విషయం ఉన్న పాయింటేనా ఈ కథలో ఉన్నది. ఈ సినిమా సతీష్ కు శతమానం భవతిలాంటి హిట్ ఇస్తుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.  

స్టోరీ లైన్

బాలు (కల్యాణ్ రామ్) చిన్నప్పుడే అమ్మా,నాన్నను పోగొట్టుకోవటంతో ఒంటరితనంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు. దాంతో పెద్దయ్యాక తనలాగ ఒంటరితనంతో బాధపడేవారికి, తోడు ఏర్పాటు చేసి సాయం చేయాలనుకుంటాడు. అందుకోసం  ‘ఆల్ ఈజ్ వెల్ ఎమోషన్స్ సప్లేయర్’ అనే స్టార్టప్ ఎమోషన్ కంపెనీ ప్రారంభిస్తాడు. బంధం, అనుబంధం కోసం మెహం వాచి,ఆప్యాయత కోసం అర్రులు చాస్తున్న వారికి కోరుకునే ఎమోషన్ ని అందించటం ఆ స్టార్టప్ లక్ష్యం.ఈ స్టార్టప్ వినటానికి బాగానే ఉన్నా కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. వాటిని బాలు ఎలా ఫేస్ చేసాడు. ఎలా జనాలకు సాయిం చేసాడు.  నందిని (మెహ్రీన్)తో అతని ప్రేమ కథ  ఎలా మొదలై, ముగిసింది, ఇసుక మాఫియా నడిపే గంగరాజు గంగరాజు(రాజీవ్ కనకాల)తో బాలుకు గొడవేంటి  వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
కధా, స్క్రీన్ ప్లే విశ్లేషణ

సెంకడాఫ్ ఎంతకీ అవదా అనే ఫీలింగ్ కలిగింది అంటే…ఖచ్చితంగా అది స్క్రీన్ ప్లే సమస్యే. ఎంచుకున్న స్టోరీ లైన్ లో నావెల్టీ ఉన్నా దాన్ని ఎగ్జిక్యూట్  చెయ్యటంలో దర్శక,రచయిత సతీష్ ఘోరంగా ఫెయిలయ్యారు. శ్రీనివాస కళ్యాణం వంటి డిజాస్టర్ తర్వాత ఆయన స్క్రీన్ ప్లే విషయంలో పాఠం నేర్చుకోలేదు. అసలు ఆ స్టోరీ లైనే ఎప్పుడో ఎనభైల నాటిదిలా ఉంటుంది. సర్లే గుజరాత్ లో సూపర్ హిట్ కదా ఇక్కడ కూడా ఆడుతుంది అనుకుని మెదలెట్టారు అనుకోవచ్చు. కానీ ఇప్పటి మన తెలుగు కుర్రాళ్ల ఆలోచనలను ఎక్కడా కూడా ఈ సినిమా ప్రజెంట్ చేయదు. అసలు ఇలా జనాలకు మంచి చేయటమే జీవితాశయం గా ఉండే జనాలు లోకంలో ఉంటారా అనే సందేహం ఓ టైమ్ లో మనకు కలగక మానదు. దానికి తోడు ఈ సినిమాలో విలన్ దీ డమ్మీ రోలే. మంచితనాన్ని,మానవత్వాన్ని డైలాగుల్లో కుప్పలుగా పోయటమే కానీ, అందుకు తగ్గ విషయం సీన్స్ లో కనిపించదు.

ఎవరెలా..
పాపం కళ్యాణ్ రామ్ తన శాయిశక్తులా  ఈ పాత్రకు న్యాం చేద్దామని ప్రయత్నం చేసాడు కానీ అసలు ఆ పాత్ర అతనికి సెట్ అయితేనే కదా ఏదైనా చెయ్యటానికి. ఉన్నంతలో మెహరీన్ ..పాపం ట్రై చేసింది. రాజీవ్ కనకాలది ఓ డమ్మీ విలన్ క్యారక్టర్. అతను ఏమీ చెయ్యటానికి ఏమీ లేదు. వెన్నెల కిషోర్, ప్రవీణ్ తమను నవ్వించటానికే పెట్టుకున్నారని తెలియటం వలన ఆ కోణంలో కొన్ని నవ్వులు రప్పించాలని చూసారు. అవీ ఫలించ లేదు.
 
టెక్నికల్ గా ..
గోపీసుంద‌ర్  పాటల్లో ఏమో ఏమో, ఔనో కాదో తెలియ‌ని.. బాగానే ఉన్నా గొప్పగా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే.  రాజ్‌తోట కెమెరా వర్క్ ది బెస్ట్. నిర్మాణ విలువ‌లు సోసోగా  ఉన్నాయి. ‘శ‌త‌మానం భ‌వతి’తో మెప్పించిన ద‌ర్శకుడు స‌తీస్ వేగేశ్న ఈ సినిమాలో ఆ మ్యాజిక్ ఏమీ కనపడదు. రైటింగ్, డైరక్షన్ ఏదీ అప్ టుది మార్క్ లేదు. గుజరాతి కథను తెలుగుకి తగినట్లు మార్చుకోవటం ఫెయిల్యూర్ అయ్యారు.
 
చూడచ్చా…
మీలో ఉన్న సహనానికి పరీక్ష పెట్టాలనుకుంటే వెంటనే పండగ అని కూడా చూడకుండా థియోటర్లో దూకేయండి

ఎవరెవరు..
న‌టీన‌టులు: క‌ల్యాణ్‌ రామ్‌, మెహ‌రీన్‌, సుహాసిని, న‌రేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, శ‌ర‌త్‌కుమార్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, సుదర్శన్‌, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు
స‌ంగీతం: గోపీసుంద‌ర్‌
ఛాయాగ్రహ‌ణం: రాజ్ తోట‌
కూర్పు: త‌మ్మిరాజు
క‌ళ‌: రామాంజ‌నేయులు
స‌మ‌ర్పణ‌: శివ‌లెంక కృష్ణప్రసాద్‌
నిర్మాత‌లు: ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త
దర్శకత్వం: స‌తీష్ వేగేశ్న
సంస్థ: ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్‌
విడుద‌ల‌ తేదీ: 15-01-2020