ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత

Published On: November 4, 2020   |   Posted By:

ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత

ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత     

తెలుగు-తమిళ భాషల్లో పలు చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన కోలా భాస్కర్ (55) కన్ను మూశారు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. గత కొంతకాలంగా భాస్కర్ గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు (నవంబర్ 4) ఉదయం 8 గంటలకు భాస్కర్ తుది శ్వాస విడిచారు.

“ఖుషి, 7జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే” వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచితులైన కోలా భాస్కర్ ఏకైక కుమారుడు కోలా బాలకృష్ణ ప్రముఖ దర్శకులు సెల్వ రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఓ ద్విభాషా చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు.

తెలుగులో ‘నన్ను వదలి నీవు పోలేవులే’ పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని కోలా భాస్కర్ నిర్మించారు.