ఎన్టీఆర్ మహానాయకుడు సెన్సార్ పూర్తి

ఎన్టీఆర్ మహానాయకుడుకు క్లీన్ ‘U’.. ఫిబ్రవరి 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల..
నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్ జంటగా నటించిన సినిమా ఎన్టీఆర్ మహానాయకుడు. ఎన్టీఆర్ బయోపిక్ లో రెండో భాగంగా వస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ ‘U’ సర్టిఫికేట్ అందుకుంది ఈ చిత్రం. ఫిబ్రవరి 22న భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, సుమంత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. నందమూరి బాలకృష్ణ NBK ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను నిర్మించారు.
నటీనటులు:నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి..
సాంకేతిక నిపుణులు:దర్శకుడు: క్రిష్ జాగర్లమూడిబ్యానర్స్: NBK ఫిల్మ్స్, వారాహి చలనచిత్రం, విబ్రి మీడియా నిర్మాత: నందమూరి బాలకృష్ణసంగీతం: MM కీరవాణి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ మాటలు: సాయి మాధవ్ బుర్రా లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేష్ క్యాస్ట్యూమ్ డిజైనర్: ఐశ్వర్య రాజీవ్