ఎమ్మెల్యే మూవీ ఆడియో రివ్యూ

Published On: March 19, 2018   |   Posted By:

ఎమ్మెల్యే మూవీ ఆడియో రివ్యూ


కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఎమ్మెల్యే మూవీకి సంబంధించి ఆడియో సాంగ్స్ అన్నీ జ్యూక్ బాక్స్ రూపంలో రిలీజ్ చేశారు. ఆశ్చర్యకరంగా సినిమాలో నాలుగే పాటలున్నాయి. వీటిలో రెండు పాటలు ఇప్పటికే లిరికల్ వీడియో రూపంలో విడుదల కాగా, మిగిలిన 2 పాటలతో కలిపి జ్యూక్ బాక్స్ విడుదల చేశారు.

టోటల్ గా చూసుకుంటే నాలుగు పాటలు వేటికవే భిన్నంగా ఉన్నాయి. మణిశర్మ మరోసారి తన సీనియారిటీ చూపించాడు. సినిమాలోని రొమాంటిక్ యాంగిల్ ని ఎలివేట్ చేసేలా గర్ల్ ఫ్రెండ్  అనే సాంగ్ కంపోజ్ కాగా.. హీరో హీరోయిన్స్ కెమిస్ట్రీని తెలిపేలా మోస్ట్ వాంటెడ్ అబ్బాయి  అనే సాంగ్ ఉంది.

సినిమాకు కీలకమైన మలుపులో వచ్చేట్టు యుద్ధం యుద్ధం అనే సాంగ్ ను కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది. లిరిక్స్, మ్యూజిక్ అలానే ఉన్నాయి. ఇక హేయ్ ఇందు అనే మరో పాట ఇటు యూత్, అటు క్లాస్ ను ఆకట్టుకునేలా కంపోజ్ అయింది. మార్చి 23న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయింది ఎమ్మెల్యే మూవీ.