ఎర్రచీర చిత్రం ట్రైలర్ ప్రోమో విడుదల
శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న హరర్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ చిత్రం ఎర్రచీర. శ్రీరామ్, అయ్యప్ప పి శర్మ, కారుణ్య చౌదరి, కమల్ కామరాజు, బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రదారులుగా సుమన్ బాబు దర్శకత్వం వహించి నటించిన చిత్రం ఎర్రచీర. అత్యద్భుతమైన గ్రాఫిక్స్ తో యాక్షన్ సెంటిమెంట్ హర్రర్ కోణాలతో ఉన్న యాక్షన్ ట్రైలర్ ను దసరా కానుకగా విడుదల చేయనున్నారని నిర్మాతలలో ఒకరైన ఎన్ వి వి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ట్రైలర్ కు సంబంధించిన ప్రోమోను ఆదివారం ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ యాక్షన్ ట్రైలర్ తో ఎర్రచీర అంచనాలను భారీగా పెంచుతుందనీ, నందు మాస్టర్ చేసిన ఫైట్స్ సరికొత్తగా ఉంటాయని, కారుణ్య చౌదరి, సాయి తేజస్విని హర్రర్ ఎపిసోడ్స్ భయాన్ని కలిగిస్తుందని దర్శక నిర్మాత సుమన్ బాబు తెలిపారు. ఇందులో భాగంగా యాక్షన్ ట్రైలర్ కి సంబంధించి ప్రోమోను ఈరోజు విడుదల చేయడం జరిగింది.
నటీనటులు :
రఘుబాబు, అజయ్, ఆలి, బిగ్ బాస్ భానుశ్రీ, జీవ, మహేష్, భద్రం, గీత సింగ్, అన్నపూర్ణమ్మ, సత్యకృష్ణ, సురేష్ కొండేటి
టెక్నీషియన్స్ :
ఎడిటర్ – వెంకట ప్రభు
మ్యూజిక్ – ప్రమోద్ పులిగెర్ల
నిర్మాతలు – ఎన్వీ.వీ. సుబ్బారెడ్డి, సుమన్ బాబు
కథ – స్క్రీన్ప్లే – దర్శకత్వం :- సి.హెచ్. సుమన్ బాబు