Reading Time: 2 mins
ఎవ‌రు మూవీ రివ్యూ
 
ఏ వన్ థ్రిల్లరు (‘ఎవ‌రు’ మూవీ రివ్యూ)
 
Rating: 3.5/5
 
క్షణం, గూఢచారి..ఇలాంటి సినిమాలు కూడా తెలుగులో వస్తాయా అని ఆశ్చర్యంగా చూసేలా చేసిన సినిమాలు అవి. చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద బజ్ మూటకట్టుకున్న ఈ సినిమాల తర్వాత అడవి శేషు చేస్తున్న సినిమా అంటే ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. ఆ విషయం ఆయనీకి తెలుసు. అందుకేనేమో రిస్క్ తగ్గుతుందని.. స్పానిష్ లో వచ్చి హిట్టైన The Invisible Guest (2016) అనే థ్రిల్లర్ రైట్స్ తీసుకుని కొత్త సినిమాని మన ముందుకు వదిలాడు. ఈ మధ్యనే హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్ను కాంబినేషన్లో  ‘బద్లా’  గా ఇదే థ్రిల్లర్  రీమేక్  హిట్టైంది. తెలుగులో కూడా ఈ సినిమా అదే స్దాయి విజయం సాధిస్తుందా..  తెలుగు నేటివిటి కు తగినట్లుగా ఏ మార్పులు చేసారు. అసలు ఈ సినిమా కథేంటి…మన ప్రేక్షకులకు పట్టే సినిమాయేనా…వంటి విషయాలు రివ్యూలో పరిశీలిద్దాం. 
 
కథేంటి

ఊహించని పరిస్థితుల్లో సమీర (రెజీనా)  డీఎస్పీ అశోక్ (నవీన్ చంద్ర) మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. తనదేమీ తప్పు లేదని, కేవలం అతను తనపై అత్యాచారం చేయటం వల్లనే హత్య చేయాల్సి వచ్చిందనేది ఆమె వాదన.  అయితే ఆమె చెప్పేది విని నమ్మటానికి సిద్దంగా ఎవరూ లేరు. పోలీస్ డిపార్టమెంట్ తమ డీఎస్పీని చంపేసిందని సీరియస్ గా ఉంటుంది. ఈ కేసుని ఓ పేరున్న లాయిర్ కు అప్పచెప్తుంది. అప్పుడు తన లాయిర్ సాయింతో బెయిల్ పై బయిటకు వచ్చి, లంచగొండి ఎస్సై విక్రమ్ సహదేవ్ (అడివి శేష్)  సాయిం అడుగుతుంది. డబ్బు తీసుకుని సాక్ష్యాలు తారుమారు చేయటానికి సిద్దపడచతాడు విక్రమ్.. అయితే అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా నిజం తెలిస్తే కానీ తను హెల్ప్ చేయలేనని, నెక్ట్స్ స్టెప్ వేయలేనని క్లియర్ గా చెప్తాడు.  అప్పుడు సమీర ఏం చెప్పింది…అసలు ఆ హత్య ఎందుకు చెయ్యాల్సి వచ్చింది? చివరకు రెజీనా ఈ కేసు నుంచి బయట పడిందా లేదా అన్న ఇంట్రస్టింగ్ విషయాలు  తెలుసుకోవాలి అంటే ఈ సినిమాను ఖచ్చితంగా వెండి తెరపై చూడాల్సిందే.
 
ట్విస్టాట…

Invisible Guest (2016) ని తెలుగుకు తగినట్లు మార్చి, మనల్ని తన స్క్రీన్ ప్లే తో ఏమార్చాడు దర్శకుడు. అలాగని కీలకమైన ట్విస్ట్ లు జోలికి వెళ్లలేదు.ఉన్న స్క్రీన్ ప్లేకే  సర్పైజ్ లు యాడ్ చేసి సూపర్ అనిపించుకున్నాడు. అయితే ఎంత ఎన్ని మార్చినా మార్కులు మొత్తం ఒరిజనల్ తయారు చేసిన రైటర్ కే పడతాయి. అంత బాగుంటుంది Invisible Guest (2016) . ఫస్టాఫ్ మొత్తం రెజీనా మోటీవ్ ఏమిటి..అడవి శేషు యాంగిల్ ఏంటి అనేది ఎక్సప్లెయిన్ చేయటానికే సరిపోతుంది.  ఫస్టాఫ్ డీసెంట్ గా రన్ అయినా అంత పెద్ద ఎక్సైట్మెంట్ లేదనే చెప్పాలి. అందుకే తెలివిగా దర్శకుడు ముగించేస్తాడు. సెకండాఫ్ కు వచ్చేసరికి మర్డర్ మిస్టరీ చిక్కపడుతుంది. మెల్లిమెల్లిగా ఒక్కో పొర విడుతు…ఫైనల్ గా కథని మొత్తాన్ని తల క్రిందులు చేసే షాకింగ్ ట్విస్ట్ తో ముగుస్తుంది. 

తెలుగు వెర్షనే,,,

Invisible Guest (2016) సినిమా రీమేక్ గా వచ్చిన  బద్లా తో పోలిస్తే..తెలుగు వెర్షనే ఇంకాస్త బాగా చేసారనిపిస్తుంది. అయితే ఆ ప్రాసెస్ లో కొంత సాగ తీసినా, బోర్ కొట్టే సీన్స్ పెట్టినా థ్రిల్లింగ్ ఎఫెక్ట్ మాత్రం తగ్గలేదు. 

 ఎవరెలా చేశారంటే..
 
సినిమాకు రెజీనా, అడవి శేషు పాత్రలే ప్రాణం. హత్యకేసు తన మెడకు చుట్టుకుందని తెలిసినప్పుడు రెజీనా నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ఇక అడవి శేషు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరప్టెడ్ పోలీస్ అధికారి పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. మిగతావారంతా తమ పాత్రల పరిధి మేర చక్కగానే నటించారు.

సాంకేతికంగా..
 
ఇది పూర్తిగా స్క్రీన్ ప్లే బేసెడ్ సినిమా. సినిమా ప్రారంభం నుండి చివ‌రి ట్విస్ట్ దాకా స్క్రీన్ ప్లే మనతో  ఆడుకుంటుంది. ఎవరు హత్య చేసారా అనే విషయం మనకు ఎక్కడా దొరక్కుండా ముందుకు వెళ్తుంది. కొత్త దర్శకుడు ఆ విషయం గుర్తు పెట్టుకుని ఎక్కడా అతి పోకడలు పోకుండా ఇంటెన్సిటీతో తెరకెక్కించి న్యాయం చేసారు. అయితే డైరక్షన్ లో అద్బుతాలు మాత్రం ఆశించలేం. సినిమా తగినట్లు మేకింగ్ ఉంటుంది.  

అలాగే ఈ సినిమాకు కీలకంగా నిలిచించి శ్రీ చరణ్ పాకాల బ్యాగ్రౌండ్ స్కోర్.  ఎడిటింగ్ కూడా క్రిస్పీగా బాగుంది. లెంగ్త్ కూడా తక్కువే కావడంతో ఏ ఇబ్బందీ అనిపించకుండా సినిమాని ఎంజాయ్ చేసేయొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా టెర్రిఫిక్ గా ఉంది. లో బడ్జెట్ సినిమా అయినా అదొక లోపంగా సినిమాలో ఎక్కడా కనిపించదు. చాలా రిచ్ గా ఉంటుంది. కాన్సెప్టు కు తగినట్లు నిర్మాణ విలువలు ఉన్నాయి.  

చూడచ్చా?

ఎవరైతే బద్లా, Invisible Guest (2016) చూడలేదో  వాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. 
 
  
తెర ముందు..వెనక

నిర్మాణ సంస్థ‌: పివిపి సినిమా
న‌టీన‌టులు: అడివిశేష్‌, రెజీనా క‌సండ్ర‌, న‌వీన్ చంద్ర‌, ముర‌ళీశ‌ర్మ‌, ప‌విత్రా లోకేశ్ త‌దిత‌రులు
సంగీతం: శ్రీచ‌ర‌ణ్ పాకాల‌
ఛాయాగ్ర‌హ‌ణం: వ‌ంశీ ప‌చ్చిపులుసు
క‌ళ‌: అవినాశ్ కొల్ల‌
కూర్పు: గ్యారీ బి.హెచ్‌
సంభాష‌ణ‌లు: అబ్బూరి ర‌వి
నిర్మాత‌లు: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె
ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ రామ్‌జీ