‘ఏదైనా జరగొచ్చు’ ఆడియో విడుదల
ప్రముఖ నటుడు శివాజీరాజా కొడుకు విజయ్రాజాను హీరోగా పరిచయం చేస్తూ కె.రమాకాంత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. బాబీసింహా విలన్ గా నటిస్తున్నారు. పూజా సోలంకి, సాషాసింగ్ హీరోయిన్స్. కె. ఉమాకాంత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. మొదటి పాటను పరుచూరి గోపాలకృష్ణ, రాధాకృష్ణ…. రెండో పాటను తమ్మారెడ్డి భరద్వాజ, బెనర్జి…. మూడో పాటను సి.కళ్యాణ్, రాజ్ కందుకూరి…. నాలుగో పాటను ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్… ట్రైలర్ ను హీరోలు శ్రీకాంత్, తరుణ్ ఆవిష్కరించారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ… ‘పదేళ్లక్రితం మా సినిమా విరోధిలో నటించాడు. అప్పుడే ఇంత పెద్దోడు అయ్యాడా అనిపిస్తోంది. దర్శకుడి ప్రతిభ ట్రైలర్ లో కనిపిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని, విజయ్ రాజా విజయవంతమైన హీరో అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. హార్డ్ వర్క్ ను నమ్ముకో, అదే నిన్ను సక్సెస్ చేస్తుందని విజయ్ కు చెపుతున్నాను’ అన్నారు.
తరుణ్ మాట్లాడుతూ.. ‘నేను బాలనటుడిగా నటిస్తున్నప్పటి నుంచి శివాజీరాజా గారు తెలుసు. ట్రైలర్, పాటలు చూస్తుంటే ఫన్ థ్రిల్లర్ లా అనిపిస్తోంది. నాకు హాలీవుడ్ లో ఫేవరేట్ డైరెక్టర్ క్వైంటిన్ టొరంటినో. పోస్టర్స్, ట్రైలర్ చూశాక ఈ దర్శకుడిలోనూ ఆయన శైలి కనిపించింది. పాటలు దేనికదే వైవిధ్యంగా ఉన్నాయి. ఈ సినిమా కోసం విజయ్ జిమ్ లో చాలా కష్టపడ్డాడు. డాన్సులు నేర్చుకున్నాడు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని చెప్పారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. . ‘మూర్ఖత్వానికి సరిహద్దులు లేవనే అంశంతో తెరకెక్కిన థ్రిల్లర్ లా కనిపిస్తోంది. విజయ్ రాజాను చూస్తుంటే బొబ్బిలిరాజాలో శివాజీరాజా గుర్తొస్తున్నాడు. ఇటీవల వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’తో సహా మా కాంబినేషన్ లో శివాజీరాజా నటించిన ప్రతి చిత్రం హిట్ అయ్యింది. ‘ఏదైనా జరగొచ్చు’ అనే టైటిల్ పెట్టారు.. మంచే జరుగుతుంది, హిట్టే వస్తుంది అని ఆశిస్తున్నాను’ అన్నారు.
సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘నా సినిమాల్లోహీరోగా చేశాడు. నా ప్రతీ సినిమా తప్పనిసరిగా నటించేవాడు. నిర్మాత, నటుడు అని కాకుండా ఫ్యామిలీలా ఉండేవాళ్లం. అతని మంచితనం, స్నేహమే అందుకుకారణం. సేవాగుణం ఉన్న వ్యక్తి. ఆ మంచితనం వల్లే అతని కొడుకు ఈరోజు ఒక మంచి సినిమాతో హీరో అవుతున్నాడు. విజయ్ రాజా పేరులోనే ఉంది విజయం. ట్రైలర్, పాటల్లో అతని పెర్ఫార్మెన్స్ చూశాక విజయవంతమైన హీరో అవుతాడు అనిపిస్తుంది. పట్టుదల ఉన్న కుర్రాడు. దర్శకుడు రమాకాంత్ వెరీ సెన్సియర్ గా పర్ఫెక్ట్ మేకింగ్ చేసినట్టు కనిపిస్తోంది. ఎంతో ఖర్చు పెట్టి తీసిన సినిమాలా కనిపిస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ జరగొచ్చు. పెద్ద ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నాను’ అన్నారు.
బెనర్జీ మాట్లాడుతూ ‘ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నుంచి శివాజీరాజా పరిచయం. విజయ్ రాజాను చూస్తుంటే మా పాత రోజులు గుర్తు వస్తున్నాయి. ఈ సినిమా చూస్తుంటే ‘శాటర్ డే నైట్ ఫీవర్’ అనే ఇంగ్లీష్ చిత్రం గుర్తొచ్చింది. అప్పట్లో అది పెద్ద హిట్టై జాన్ ట్రావొల్టా పెద్ద హీరో అయ్యాడు. ఈ సినిమాతో విజయ్ రాజాకు కూడా అంత పేరు రావాలని ఆశిస్తూ టీమ్ కు ఆల్ ది బెస్ట్’ అన్నారు.
తమ్మారెడ్డి మాట్లాడుతూ ‘శివాజీరాజా కూడా హీరో అవుదామని వచ్చాడు. హీరోగా చేశాడు, మంచి పెర్ఫార్మర్ గా పేరు సంపాందించాడు. మంచి హ్యూమన్ బియింగ్ అనిపించుకున్నాడు. వాళ్లబ్బాయి భవిష్యత్తు బాగుండాలి. పాటలు, ట్రైలర్ బాగున్నాయి. సినిమా కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నాను’ అన్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘హీరోను, దర్శకుడి పనితనాన్ని, సినిమాటోగ్రపీని, మ్యూజిక్ ని చూస్తుంటే సక్సెస్ జరగొచ్చు అనిపిస్తోంది. సినిమా ఏమాత్రం బాగున్నా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చూస్తున్నారు. సక్సెస్ కు అంశాలన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. కొత్త హీరోను పరిచయం చేసేటప్పుడు ఎలాంటి సంగీతం కావాలో అలాంటి సంగీతం ఇచ్చాడు శ్రీకాంత్ పెండ్యాల. అతడిని అభినందిస్తున్నాను’ అన్నారు.
అచ్చిరెడ్డి మాట్లాడుతూ ‘ముప్పై ఏళ్లుగా శివాజీరాజా మాకు మంచి మిత్రుడు . ట్రైలర్స్, పాటలు చూశాక శివాజీరాజా తన కొడుకు ఎంట్రీ మూవీని రమాకాంత్ లాంటి దర్శకుడి చేతిలో పెట్టి మంచి నిర్ణయం తీసుకున్నాడు అనిపించింది. మరో విజయ్ దేవరకొండ అంతటి సక్సెస్ ను విజయ్ రాజా అందుకోవాలని ఆశిస్తున్నాను’ అన్నారు.
శివాజీరాజా మాట్లాడుతూ… ‘రమాకాంత్ ఏం చెప్పాడో అది తీశాడు. నాకు కావాలసిన వాళ్లంతా ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. వీళ్లందరి, ప్రేమాభిమానాలు, సపోర్ట్ తోనే నేను 450 సినిమాలు చేయగలిగాను. అదే ప్రేమను నా కొడుకుపై చూపిస్తూ ఆశీర్వదించడం ఆనందంగా ఉంది. శ్రీకాంత్ పెండ్యాల చక్కని సంగీతం అందించాడు. సినిమాను, మా అబ్బాయిని ఆశీర్వదించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను’ అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘విజయ్ స్పురద్రూపి. చూడగానే సక్సెస్ ఫుల్ హీరో అవుతాడు అనిపిస్తోంది. శివాజీ డియరెస్ట్ ఫ్రెండ్. అతని మంచితనం తన బిడ్డకు ఆశీర్వాదం అవుతుంది. విజయ్ అంటే విక్టరీ, రాజా అంటే కింగ్. కింగ్ ఆఫ్ ద విక్టరీ అవుతాడు. పాటలు, సినిమాటోగ్రఫీ బాగుంది. గట్టి హిట్ కొట్టబోతున్నారు అనే విషయం అర్థమవుతోంది’ అన్నారు.
హీరో విజయ్ రాజా మాట్లాడుతూ.. ‘వచ్చిన అతిథులందరికీ థ్యాంక్స్. శని, ఆదివారాలు శ్రీకాంత్ గారి ఇంటికెళ్తే.. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత పైకి వస్తారని రోషన్ కు, నాకు చెప్పి ప్రోత్సహించేవారు. నాకీ అవకాశం ఇచ్చిన రమాకాంత్ గారికి ధన్యవాదాలు. శ్రీకాంత్ పెండ్యాల అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. పూజ, సాషా బ్యూటిఫుల్ కోస్టార్స్. థ్రిల్లర్ అండ్ హారర్ తో కూడిన కామెడీ ఎంటర్ టైనర్ ఇది. అందరూ ఈ సినిమా చూసి ఆదరిస్తారని భావిస్తున్నాను’ అన్నారు.
.దర్శకుడు రమాకాంత్ మాట్లాడుతూ.. ‘ఇదో కాన్సెప్ట్ బేసుడ్ సినిమా. థ్రిల్లర్ అండ్ హారర్ కామెడి మూవీ. అందరూ చక్కగా నటించారు. ముఖ్యంగా హీరో విజయ్ రాజా, విలన్ బాబిసింహా అద్భుతంగా నటించారు. ప్రేక్షకులను ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తుందని భావిస్తున్నాం’ అన్నారు.
సంగీత దర్శకుడు మాట్లాడుతూ… ‘డిఫరెంట్ జానర్ సినిమా. ఇలాంటి చిత్రానికి ఎంత రిక్వైర్ మెంట్ ఉంటుందో దానికి తగ్గస్థాయిలో సంగీతం అందించాను. ప్రేక్షకులను ఈ చిత్రం తప్పక నచ్చుతుందని నమ్ముతున్నాను’ అని చెప్పారు.
అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోయిన్స్ పూజా సోలంకి, సాషా సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.
సహనిర్మాత సుదర్శన్ మాట్లాడుతూ.. ‘స్టుపిడిటీ హ్యాజ్ నో బౌండరిస్ అనేది ఈ సినిమా థీమ్. మ్యూజిక్ హ్యాజ్ నో బౌండరీస్ అని శ్రీకాంత్ ప్రూవ్ చేశాడు. దర్శకుడు రమాకాంత్ తో పాటు టీమ్ అంతా కలసి గుడ్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దారు’ అని చెప్పారు