ఒక్క క్షణం సినిమా టీజర్ రివ్యూ

Published On: December 4, 2017   |   Posted By:
ఒక్క క్షణం సినిమా టీజర్ రివ్యూ

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమాతో మోస్ట్ ప్రామిసింగ్ డైరక్టర్ అనిపించుకున్నాడు దర్శకుడు వీఐ ఆనంద్. ఆ సినిమాతో  బౌన్స్ బ్యాక్ అయిన ఈ దర్శకుడు తాజాగా ఒక్క క్షణం అంటూ మరో సినిమా రూపొందించాడు. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ ఒక్క టీజర్ తో సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేశాడు దర్శకుడు.
ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమాలో డిఫరెంట్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకున్న వీఐ ఆనంద్.. ఒక్క క్షణం మూవీకి కూడా అలాంటి కొత్త కాన్సెప్ట్ ఎంచుకున్నాడనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతుంది. “ర్యాండమ్ గా విసిరిన అగ్గిపుల్లల్లో ఒక్కొక్కటి ఒక్కో డైరక్షన్ లో పడిందని అనుకుంటాం. కానీ ఈ 2 పుల్లలు మాత్రం ప్యారలల్ గా పడ్డాయి. గుప్పెడు పుల్లల్లో 2 ప్యారెలల్ గా పడినప్పుడు.. వందల కోట్ల జనాల్లో ఎంతమంది జీవితాలు ప్యారలల్ గా ఉండొచ్చో ఆలోచించండి” ఈ ఒక్క డైలాగ్ చాలు సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేసింది.
టీజర్ చూస్తుంటే.. ఒకరి జీవితంలో జరిగే సంఘటనలు మరొక జీవితానికి కనెక్ట్ అవుతాయనే విషయం తెలుస్తోంది. కాకపోతే దీనికి హీరో క్యారెక్టర్ ఎలా కనెక్ట్ చేశారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక టీజర్ ఎండింగ్ లో హీరోతో చెప్పించిన డైలాగ్ చూస్తే సినిమాలో హీరోయిజం కూడా పుష్కలంగా ఉందనే విషయం కూడా అర్థమౌతోంది. హీరోహీరోయిన్ల పెర్ఫార్మెన్స్ తో పాటు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు ఓ కిక్ ఇచ్చింది. ఓవరాల్ గా అల్లు శిరీష్ మరో హిట్ కొడతాడేమో అనిపించేలా కట్ అయింది ఒక్క క్షణం టీజర్