ఓ బేబి చిత్రం రివ్యూ
సమంత విశ్వరూపం (`ఓ బేబి` రివ్యూ)
Rating:3
సెవెంటీన్ ఎగైన్ కాన్సెప్ట్ లు హాలీవుడ్ పాత…మనకు కొత్త. మనందరి జీవితాల్లో మళ్లీ బాల్యంలోకి వెళ్లాలని, పెద్దవాళ్ల జీవితాల్లో తిరిగి యవ్వనంలోకి వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ ఏం చేసినా అది సాధ్యం కాదు. అయితే అది ఊహల్లో అయినా జరిగితే..తెరమీద అయినా కనపడితే అది తృప్తి. ఆ కిక్ నే ఈ సినిమా అందిస్తుంది. అందుకే ఇప్పటికే ఏడు భాషల్లోకి ఈ మిస్ గ్రానీ రీమేక్ అయ్యి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు తెలుగులోనూ రీమేక్ అయ్యి మన ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ చిత్రం కథేంటి…మనకు ఇక్కడ కూడా వర్కవుట్ అవుతుందా..తెలుగు నేటివిటిని ఈ సినిమాలో నింపేసారా..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్ ఏంటంటే…
సావిత్రి అలియాస్ బేబీ (లక్ష్మి) భర్త పెళ్లైన కొత్తలోనే పోవటంతో కుటుంబ భాధ్యతలు మొత్తం ఒక్కర్తే మోయాల్సి వస్తుంది. తనెంత కష్టపడైనా తన కొడుకు శేఖర్ (రావు రమేష్)ను చదివించి ప్రొఫెసర్ని చేస్తుంది. డబ్బై ఏళ్ల వయస్సు వచ్చినా ఇప్పటికి తన చిననాటి ఫ్రెండ్ చంటి (రాజేంద్రప్రసాద్)తో కలిసి క్యాంటీన్ నడుపుతూంటుంది. వయస్సు ప్రభావంతో ఆమెకు గ్యాస్,కీళ్ల నొప్పులువంటి సమస్యలు, మరో ప్రక్క తన చాధస్తంతో ఇబ్బందులు పడుతున్న కోడలు (ప్రగతి)తో సమస్య. ఈ లోగా ఆమె యథాలాపంగా అనే మాటలు కూడా ఆమె కోడలు (ప్రగతి)ని ఇబ్బందిపెడుతాయి. ఈ లోగా కోడలికి గుండెపోటు రావటంతో వృధ్దాశ్రమానికి ఆమెను పంపుతారు. ఆ క్రమంలో ఆమె ఇంటినుంచి వెళ్ళిపోతూ ఓ ఫొటో స్టూడియోకు వెళ్తుంది. ఆమె మనస్సులో ఒకటే కోరిక..ఈ వృధ్యాప్యం వలనే కదా ఈ సమస్యలు అన్నీ అని,తన యవ్వనం తిరిగి వెనక్కి వస్తే బాగుండును అని. అక్కడ ఫొటో స్టూడియోలో ఓ స్వామీజీ (జగపతిబాబు) మహిమతో ఆమె ఆలోచనలు నిజం అవుతాయి. ఆమె యవ్వనం తిరగి వచ్చి 24 ఏళ్ల బేబి (సమంత)గా మారుతుంది. అక్కడ నుంచి బేబి జీవితంలో అనేక మార్పులువస్తాయి. ఆమె కుటుంబం సైతం రియలైజ్ అవుతుంది. కొత్త జీవితంలో పరిచయం అయిన విక్రమ్ (నాగశౌర్య) పరిస్దితి ఏమిటి…ఇంతకీ ఆమెకు వెనక్కి తిరిగి వచ్చిన యవ్వనం వలన ఏ కలిసివచ్చింది వంటి విషయాలు తెరపై చూస్తేనే బాగుంటుంది.
ఈ రీమేక్ ఎలా ఉంది
ప్రక్క భాషలో వచ్చిన రీమేక్ చేయటం పెద్ద కష్టమేమీ కాదు. దాదాపు నేటివిటి అంతా మనదే ఉంటుంది. కానీ మనది కానీ కల్చర్, దేశం నుంచి వచ్చిన సినిమాని రీమేక్ చేయటం అంటే కత్తిమీద సామే. ఆ సాముని సమర్దవంతంగా చేయగలిగింది నందినీ రెడ్డి. ఫస్టాఫ్ లో మొదట అరగంట ఒరిజనల్ సినిమాలో ఉండదు. కొత్త సీన్స్ ని తయారు చేసి కథను పరిచయం చేస్తారు. అలాగే హిందూ మతానికి సంభందించిన వినాయకుడు,స్వామీజి అనే ఎలిమెంట్స్ తీసుకువచ్చి ఫాంటసీని ప్రశ్నార్దకంగా మారకుండా తప్పించగలిగారు. లేకపోతే ఒరిజనల్ కొరియా సినిమాలో లాగ ఓ ఫొటో స్టూడియోలోకి వెళ్లింది…24 ఏళ్ల అమ్మాయిగా మారింది అంటే బిలీవబులిటీ సమస్య వచ్చేది ఖచ్చితంగా. వాటిని స్క్రిప్టు దశలోనే దాటేసారు.
వన్ ఉమెన్ సమంత …
ఇక సమంత ఫెరఫార్మెన్స్ ఈ సినిమాలో అత్యుత్మమంగా కనపడుతుంది. ఎందుకంటే నవ్వటం ఈజీ..నవ్వించటం చాలా కష్టం. ఆ కష్టమైన పనిని చాలా ఇష్టపడి చేసిందని సీన్స్ చూస్తుంటే అర్దమవుతుంది. దాంతో మార్కులు మొత్తం సమంత నటనకే పడతాయి. సీనియర్ నటి లక్ష్మిని పోలినట్టుగానే ఎక్సప్రెషన్స్ పెట్టడం, ఆమెలాగా నడవడం, మాట్లాడటం కష్టం అయినా ఎక్కడా ఎబ్బెట్టు లేకుండా సునాయిశంగా చేసేసింది.అలాగే ఎమోషన్స్ సీన్స్ లో ఆమెలోని సీనియర్ నటీమణి విశ్వరూపం చూపించింది. రావు రమేష్, రాజేంద్రప్రసాద్, లక్ష్మీ ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. ఇక నాగశౌర్య విషయానికి వస్తే రెగ్యులర్ గా చేసుకుంటూ పోయారు.
ఇబ్బందే…
సినిమా ఫస్టాఫ్ ఫన్ తో నడిచిపోయినా , సెంకడాఫ్ దగ్గరకి వచ్చేసరికి కొంచెం సాగతీతకు గురైనట్లు అనిపిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండను అనిపిస్తుంది. అంతేకాకుండా రాబోయే పదో సీన్ లో సైతం ఏం జరుగుతుందో సామాన్య ప్రేక్షకుడు సైతం ఊహించేలా సీన్స్ ఉండటం ఇబ్బంది.
టెక్నికల్ గా ..
గోదావరి యాసతో చిన్మయి సమంతకు చెప్పిన డబ్బింగ్, ఆ డైలాగులు నవ్వు తెప్పించాయి. లక్ష్మీ భూపాల మాటలు చాలా బాగున్నాయి. వయస్సులో పెద్దవాళ్లు ఎలా మాట్లాడతారో వాటిని గుర్తు చేస్తూ మాటలకి తగ్గట్టుగానే సామెతలు జోడించిన విధానం ఆకట్టుకుంటుంది. ‘పెద్దవాళ్లు ఉన్నంతవరకే మనం పిల్లలం. వాళ్లతో పాటే మన బాల్యం కూడా వెళ్లిపోతుంది’ వంటి డైలాగులు ధియోటర్ నుంచి బయిటకు వచ్చాక కూడా హాంట్ చేస్తాయి.
ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రతీ సీన్ ప్రేక్షకుడి హృదయాలకు హత్తుకునేలా షూట్ చేయటంలో కెమెరా మెన్ ప్రతిభ కనబడుతుంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే. పాటల పరంగా డల్ అయినా బీజీఎమ్ పరంగా చూసిన మిక్కీ జె మేయర్ తనేంటో చూపించారు.ఇక దర్శకురాలు నందిని రెడ్డి మళ్లీ ఫామ్ లోకి వస్తుందనటంలోసందేహం లేదు. ఎమోషన్ సీన్స్ తో పాటు కామెడీ సన్నివేశాలలో సమంత పాత్రను తెరపై ఆమె ఆవిష్కరించిన తీరు గుర్తుండిపోతుంది.
చూడచ్చా
ఫన్ కోసం సరదాగా ఓ వీకెండ్ ని కాలక్షేపం చేయటానికి చూడచ్చు.
తెర వెనక ముందు..
నటీనటులు : సమంత, లక్ష్మి, రావు రమేష్, రాజేంద్రప్రసాద్, ప్రగతి రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి కీలక పాత్రల్లో నటించారు. మ్యూజిక్: మిక్కి జె.మేయర్,
కెమెరా: రిచర్డ్ ప్రసాద్ ,
డైలాగ్స్: లక్ష్మీ భూపాల్,
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ,
ప్రొడక్షన్ , డిజైన్:జయశ్రీ లక్ష్మీ నారాయణ,
నిర్మాతలు: సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యువు థామస్ కిమ్ ,
ఆర్ట్: విఠల్.కె,
దర్శకత్వం: బి.వి.నందినీ రెడ్డి,
నిర్మాణ సంస్థలు: సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్,
సహ నిర్మాతలు: విజయ్ దొంకాడ, దివ్యా విజయ్.