కనబడుటలేదు మూవీ రివ్యూ

Published On: August 19, 2021   |   Posted By:

కనబడుటలేదు మూవీ రివ్యూ

సునీల్ ‘కనబడుటలేదు’ రివ్యూ

Rating:-1.5/5

డిటెక్టివ్  సినిమాల‌ంటే మన తెలుగువాళ్లకు భలే ఇంట్రస్ట్.  వాళ్ళలో ఇటువంటి సినిమాలపై మంచి అంచ‌నాలు ఉంటాయి. అందులోనూ సునీల్ సినిమా చేసాడంటే మరీను. వరసపెట్టి ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా కూడా సునీల్ సినిమా అంటే ఏదో తెలియ‌ని ఆస‌క్తి ఉంటుంది. ఇప్పుడు మ‌రో సినిమాతో వ‌చ్చాడు సునీల్. డిటెక్టివ్ అంటూ హాలీవుడ్ రేంజ్ బిల్డప్ సినిమాతో వ‌చ్చేసాడు. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు ఆక‌ట్టుకుంది..? టీజర్‌, ట్రైలర్‌లు కూడా మంచి రెస్పాన్స్‌ రావటంతో ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ మరింతగా పెరిగాయి. మరి డిటెక్టివ్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించాలన్న మిషన్‌లో సునీల్ సక్సెస్‌ అయ్యాడా..? కథేంటి ..కొత్త దర్శకుడు తన డైరక్షన్ స్కిల్స్ తో  ఏ మేరకు ఆకట్టుకున్నాడు..?  

 స్టోరీ లైన్

 శశిత(వైశాలి రాజ్) కు తన బోయ్ ప్రెండ్  సూర్య(సుక్రాంత్ వీరల్లా) మోసం చేసాడనే బాధ. దాంతో తనకు ఇష్టం లేకపోయినా ఆదిత్య(యుగ్ రామ్) ని పెళ్లి చేసుకుంటుంది. అయితే సూర్యపై కోపం పోదు. అందుకోసం చివరకు సూర్యని చంపేయాలని డిసైడ్ అవుతుంది. అందుకోసం తన భర్తతో కలిసి ఓ ప్లాన్ వేసి అతనుండే వైజాగ్ బయిలుదేరుతుంది. ఈ క్రమంలో తన ప్లాష్ బ్యాక్ అంతా భర్తకు చెప్తుంది. చివరకు వైజాగ్ చేరేసరికి అసలు కొంత కాలంగా  సూర్య కనపించటం లేదని తెలుస్తుంది. సూర్య ఏమయ్యాడు. అతను మిస్సవటానికి గల కారణం ఏమిటి..ఎవరైనా చంపేసారా..డిటెక్టివ్ (సునీల్) కు ఈ కేసు ఎవరు అప్పచెప్పారు..చివరకు ఏం తేలింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్ ..

తెలుగు తెరమీద డిటెక్టివ్‌ తరహా కథలు ఎప్పుడో కానీ రావు. నవీన్ నటించిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వచ్చి రెండు సంవత్సరాల పైగా  అయ్యింది. ఆ తర్వాత అలాంటి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ను ఎంచుకున్న దర్శకుడు బాలరాజ్‌, తొలి ప్రయత్నంలోనే ఇలాంటి కథను ఎంచుకున్నాడు. అయితే ఇలాంటి కథలకు ఇంట్రస్టింగ్ స్టోరీతో పాటు గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే అత్యవసరం.  ఓ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌లో ఉండాల్సిన స్పీడు మాత్రం లోపించింది. చాలా సన్నివేశాలు సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకులను విసిగిస్తాయి. సాధారంగా ఫస్ట్‌ హాఫ్‌లో డిటెక్టివ్ పాత్రను ఎస్టాబ్లిష్ చేసి, కథలోకి పంపుతారు. అయితే ఆ క్యారక్టర్ ని సెంకడాఫ్ దాకా తీసుకురాలేదు. అలా కథలోకి డిటెక్టివ్ ని తీసుకొచ్చేందుకు సమయం తీసుకున్నాడు దర్శకుడు. ద్వితీయార్థంలో వచ్చే ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌లోనూ పెద్దగా ప్లో లేదు. స్లో నేరేషన్‌ ఇబ్బంది పెడుతుంది.

ఓ మనిషి కనపడలేదు, మరో పోలీస్ మర్డర్ అని  మొద‌ల‌య్యే ఇన్వెస్టిగేష‌న్ ఆ త‌ర్వాత ఒక దానికి మరొకటి.. ప్ర‌తీ సీన్ కు ముడిపెట్టుకుంటూ ఎక్క‌డా క‌న్ఫ్యూజ్ కాకుండా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు.అయితే దాన్ని డిటెక్టివ్ పాయింటాఫ్ వ్యూలో చెప్తే బాగుండేది. అలా కాకుండా డైరక్టర్  పాయింటాఫ్ వ్యూలో ఫస్టాఫ్ మొత్తం చెప్పే ప్రయత్నం చేసాడు. దాంతో సెకండాఫ్ లో కానీ డిటెక్టివ్ కు పనిలేదు. ఆ పాత్ర కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుడుకీ  పని అంతకన్నా లేదు.

సినిమా మొద‌ట్లోనే ఓ చిన్న క్లూ ఇచ్చుకుని  చిన్న దాన్నుంచి క‌థ‌ను అల్లుకున్న తీరు అద్భుత‌మని అనిపించే ట్రీట్మెంట్ చేసుకోవాలి. కానీ అది జరగేలదు. కొన్ని హాలీవుడ్ చిత్రాల తరహాలో జరిగిన కథ చూపెట్టి,డిటెక్టివ్ రంగంలోకి దింపాడు.  ఇలాంటి క‌థ‌లు మ‌న ద‌గ్గ‌ర ఎంత‌వ‌ర‌కు ఎక్కుతాయ‌నేది వేచి చూడాల్సిన విష‌యం. పైగా ఇలాంటి సీరియస్ క‌థ‌లో కూడా కామెడీ రాసుకున్నాడు డైరక్టర్. క్లైమాక్స్  ట్విస్ట్ బాగానే పేలినా అక్కడి దాకా నడిపిన విధానం విసిగించాడు.


టెక్నికల్ గా..

అలాగే ఇలాంటి సినిమాలకు నేపథ్య సంగీతం అవసరం. అదే సీన్స్  మరింతగా ఎలివేట్ చేస్తుంది. తన మ్యూజిక్‌తో మార్క్‌ సినిమా స్థాయిని పెంచాలి. అదే జరగలేదు. ఇక  ఎడిటింగ్‌ సినిమాకు మేజర్‌ డ్రా బ్యాక్‌. చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్‌ చేస్తే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

నటుడుగా సునీల్ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోవటంతో పాటు సీరియస్‌ ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌ లోనూ సత్తా చాటాడు. లుక్‌, యాటిట్యూడ్‌ ఇలా ప్రతీ విషయంలోనూ పర్ఫెక్షన్‌ చూపించాడు.పూర్తిగా టైట్ స్క్రీన్ ప్లే కాకపోవటంతో సునీల్ ఈ చిత్రానికి త‌న‌వంతు ప్ర‌య‌త్నం బాగానే చేసినా.. ఫలించలేదు. మిగతా వాళ్లు పెద్దగా నటనకు ఆస్కారం లేకపోయినా ఉన్నంతలో పరవాలేదనిపించారు.
 
వాస్తవానికి డిటెక్టివ్ క‌థ‌కు పాట‌లు అక్క‌ర్లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ కావాలి. ఈ బాధ్య‌త‌ను సరిగ్గా నిర్వర్తించలేకపోయారు. ఈయ‌న ఇచ్చిన ఆర్ఆర్ సినిమాపై ఇంట్రస్ట్ చంపేసింది. ఇక సినిమాటోగ్ర‌ఫీ వ‌ర్క్ ఫరవాలేదు.  ఇక ద‌ర్శ‌కుడు బాలీవుడ్ ఓ ర‌కంగా పెద్ద సాహ‌స‌మే చేసాడు. క్రైమ్,థ్రిల్లర్ సినిమాలు చూసే అల‌వాటు ఉన్న వాళ్ల‌కు త‌ప్ప ఇత‌రుల‌కు ఈ చిత్ర క‌థ పెద్ద‌గా ఎక్క‌దు. ఇది నార్మ‌ల్ మాస్ ఆడియ‌న్స్ కు ఎంత‌వ‌ర‌కు ఎక్కుతుందనేది చూడాలి.
 
చూడచ్చా…

ఈ డిటెక్టివ్ బాగానే ఉన్నాడు.. కానీ..పూర్తిగా కనిపించలేదు

 
ఎవరెవరు..
బ్యాన‌ర్స్‌: ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్
నటీనటులు:  సునీల్‌, సుక్రాంత్‌ వీరెల్ల, వైశాలిరాజ్, హిమ‌జ‌, యుగ్రం, శశిత కోన, నీలిమ ప‌త‌కంశెట్టి, సౌమ్య శెట్టి, C/o కంచరపాలెం’ ఫేమ్ రాజు, ఉమా మ‌హేశ్వ‌ర రావు, కిషోర్‌, శ్యామ్ మ‌రియు మ‌ధు తదితరులు
సంగీతం: మ‌ధు పొన్నాస్‌
డిఒపి:  సందీప్ బద్దుల
ఎడిటింగ్‌: రవితేజ కుర్మాన‌
రన్ టైమ్ ‌:1గంట, 51నిముషాలు
ర‌చ‌న‌,ద‌ర్శక‌త్వం:  బాల‌రాజు ఎం.
 స‌మ‌ర్ప‌ణ‌: సరయు తలసిల
పిఆర్ఓ:  వంశీ – శేఖ‌ర్‌.
 నిర్మాత, సాగర్ మాచనూరు సతీష్ రాజు దిలీప్ కూరపాటి
విడుదల తేదీ:19,ఆగస్టు 2021