Reading Time: 2 mins
కనులు మూసి తెరిచేలోపే  షార్ట్ ఫిలిం రివ్యూ


సాధారణంగా మనస్సు మూసి తెరిచేలోపే చూసిన షార్ట్ ఫిల్మ్ లు మెమిరీలోంచి మాయమైపోతూంటాయి. అలా అంతర్దానం కాకుండా ఉండాలంటే అర్దవంతమైన విషయం,విశేషం ఏదో కంటెంట్ లో కరెంట్ లా అంతర్లీనంగా ఉండాలి. అందుకోసం చాలా మంది  ప్రయత్నిస్తూంటారు. కొందరే సక్సెస్ అవుతారు. మరికొందరు చూసినవారికి నిరాశమిగిలుస్తారు. మరి ఈ షార్ట్ ఫిలిం మనకు ఏ విధమైన ఫీలింగ్ క్రియేట్ చేసిందో ఓ సారి చూద్దాం.

స్టోరీలైన్

అర్జున్,శృతి ఇద్దరూ ప్రేమలో ఉంటారు. ఎంతగా అంటే అర్జున్ కోసం తండ్రిని ఎదురిస్తుంది శృతి. శృతి కోసం తనకు ఇష్టం లేని రెగ్యులర్ జాబ్ చెయ్యటానికి సైతం సిద్దపడతాడు అర్జున్. ఒకరిని మరొకరు ఇంతగా ప్రేమించుకున్న ఈ ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి విడిపోతారు.  కనులు మూసి తెరిచేలోపే వారి ప్రేమ కథ ఆగిపోయింది. ఆ కమ్యునికేషన్ కు కారణం ఏమిటి ? విడిపోయిన వాళ్లిద్దరు మళ్లి కలిసే అవకాసం ఉందా?  అనే విషయాలతో నడుస్తుందీ షార్ట్ ఫిల్మ్.

ఎలా ఉందంటే…
 
అప్పుడెప్పుడో జంధ్యాల,రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో వివాహ భోజనంబు సినిమా వచ్చింది. అందులో హీరో సీతారాముడు స్త్రీలను ద్వేషిస్తూ ఉంటాడు. వారి చేతిలో మోసపోయిన వారికోసం ఒక సంఘం కూడా నడుపుతూ ఉంటాడు. తనకు స్త్రీల మీద ద్వేషం కలగడానికి కారణమైన ఓ చిన్న సంఘటన ఉంటుంది. అది ఓ చిన్న కమ్యునికేషన్ గ్యాప్ తో ఉంటుంది. అంటే అదేదో తేలిపోతే వాళ్లిద్దరూ ఒకటవుతారు. అఫ్ కోర్స్ క్లైమాక్స్ లో ఇద్దరూ అదే పనిమీద ఉంటారనుకోండి. అలాంటి కాన్సెప్టు ఆ నాటికి 1988 కు బాగుండేవి. కానీ ఇప్పటికి ఈ యంగస్టర్స్, అదీ తమను తాము ప్రూవ్ చేసుకోవటానికి అతి చిన్న కమ్యునికేషన్ గ్యాప్ ని కాన్సెప్ట్  గా తీసుకుని కథ చేయటం విచిత్రమే. బలమైన కాన్సెప్ట్  లేకపోతే ఏ కళారూపమైనా బలహీనంగానే ఉంటుంది. మరో విషయం సదరు హీరో,హీరోయిన్స్ ప్రేమ కథ మీద చూసేవారికి ప్రేమ కలగకపోతే  వారు విడిపోయినా కలవాలని కోరుకోరు. అవన్ని ప్రక్కన పెడితే మిగతాదంతా బాగుంది. డైలాగుల్లో అక్కడక్కెడా మెసేజ్ తో మేనేజ్ చేద్దామని చూసారు. అలాగే డైరక్షన్ కూడా నీటుగా,నాచురల్ గా ఉంది. షార్ట్ ఫిల్మ్ అయినా ఆర్టిస్ట్ లు సినిమా స్దాయి ఫెరఫార్మెన్స్ చూపించారు . మరీ అంత అవసరం లేదేమో. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ షార్ట్ ఫిలింకు సినిమా లుక్ తెచ్చిపెట్టాయి.

నటీనటులు

కీర్తి సాయి చంద్ర
రిషిత రెడ్డి
మహేంద్ర గణాచారి
మాధవి
ప్రసన్న కుమార్

డైరక్షన్ టీమ్ :

శ్రీను యాదవ్, ప్రసన్నకుమార్
సంగీతం : యతీష్
ఎడిటర్: సురేష్ దుర్గం
సినిమాటోగ్రఫీ : శ్రీనివాస్ చౌదరి
నిర్మాత : ప్రశాంత్ యర్రమిల్లి
రచన, దర్శకత్వం : కనక వెంకటేష్.బి