బందూక్ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాను అందించిన లక్ష్మణ్ మురారి క్రియేటివ్ టీమ్ నుండి నూతన చిత్రం సన్నాహాలు జరుగుతున్నాయి.
యవ్వనమంటేనే ఉరకలేసే ఉత్సాహం, అను నిత్యం నవ్వుతూ నవ్విస్తూ చలాకీగా ఉండే ఇరవెై ఏళ్ళ కుర్రాడి జీవితంలో అనుకోకుండా వచ్చిన మార్పులకు కారణం ప్రేమ, ఈ మత్తులో స్నేహం, నమ్మకద్రోహం, చివరకు ప్రాణాలు తీసే స్థితికి చేరుకునే దశనే ఈ టీనేజ్,+2 అనే కాన్సెప్ట్ తో నూతన హీరో ప్రియాన్ష్, ఆరంగేట్రం చేయబోతున్నాడు, బన్నీ అని పిలుచుకునే ప్రియాన్స్ తండ్రి అడుగుజాడల్లో తన భవిష్యత్ లక్ష్యాల్ని నిర్ధేశించుకొని, ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి చిన్ననాటి నుండే నటనపై మక్కువతో బాలనటుడిగా తన ప్రతిభని చాటాడు, మూడవ తరగతిలో బ్రహ్మస్త్రం సినిమా నుండి పదవ తరగతి లో బందూక్ చిత్రం వరకు, పలు చిత్రాలలో పాటు, వాణిజ్య ప్రకటనలలో సైతం తన ప్రతిభను చాటాడు, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే అచ్చ తెనుగు నుడికారానికి నిలువెత్తు రూపం బన్నీ ప్రియాన్ష్.
దీనికి కారణం చిత్రదర్శకుడైన తండ్రి బందూక్ లక్ష్మణ్, సామాజిక బాధ్యత కలిగిన తన కుటుంబమే, తన పెరిగినదంత సినిమా వాతావరణమే అవడంతో సహజంగానే సినిమాపై ఇష్టాన్ని పెంచుకున్నాడు బన్నీ… డాన్స్, కరాటే,బాస్కెట్బాల్, పోటోగ్రఫీలో అందెవేసిన చేయి, అంతేకాదు సినిమారంగంలోని 24 క్రాప్ట్స్ పై అవగాహన పెంచుకుంటున్న చిచ్చరపిడుగు. సినిమా ఈజ్ మై పాషన్, నాట్ మై ఏటీఎం అనే తండ్రి మాటలే ప్రియాన్ష్ సినిమారంగంపై ఆసక్తిని పెంచాయోమో అందుకే అనుక్షణం సినిమానే జీవితంగా, తన కలల్ని సాకారం చేసుకోవాలని కోరుకుంటున్న ప్రీయాన్ష్ కు అభినందనలు..1980 లో జరిగిన ఒక యదార్ధ సంఘటన ద్వారా రూపుదిద్దుకుంటున్న
సంగీతం: కార్తీక్ కొడకండ్ల
కెమేరా: రాహుల్ మాచినేని