Reading Time: 2 mins

కెఎస్‌ 100 చిత్రం జులై రిలీజ్‌

‘కెఎస్‌ 100’ అన్నివర్గాలవారిని ఆకట్టుకునే ఒక రొమాంటిక్‌ హర్రర్‌   – దర్శకుడు షేర్‌ 
 
 
మోడలింగ్‌ స్టార్స్‌ సమీర్‌ ఖాన్‌, సునీతా పాండే, శైలజా తివారి, ఆశిరాయ్‌, శ్రద్దా శర్మ, అక్షిత మాధవ్‌ హీరోహీరోయిన్‌లుగా షేర్‌ (షాలిని ఫేమ్‌) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”కెఎస్‌100”.. చంద్రశేఖరా మూవీస్‌ పతాకంపై వెంకట్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన రాగా ఇటీవల విడుదలైన ట్రైలర్‌, ఆడియో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. జులై 12న ప్రపంచవ్యాప్తంగా సినిమారిలీజ్‌కాబోతుంది. ఈసందర్భంగా దర్శకుడు షేర్‌ ఇంటర్వ్యూ… 
 
మీ గురించి చెప్పండి? 
– మాది హైదరాబాద్‌ ఇక్కడే పుట్టి పెరిగాను. తరువాత ఉన్నత విద్య కోసం దుబాయ్‌లో వరల్డ్‌ టాప్‌ అకాడమీలో ఒకటైన ‘ఎమిరేట్స్‌ అకాడమీ’ గ్రాడ్యుయేషన్‌ చేశాను. ఆ సమయంలోనే హాలీవుడ్‌ మూవీ ‘మిషిన్‌ ఇంపాజిబుల్‌ ఘోస్ట్‌ ప్రోటోకాల్‌’ కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేసి అక్కడి టెక్నిక్స్‌ నేర్చుకున్నాను. ఆ తరువాత ఇండియాకి వచ్చి సినిమా మీద ఉన్న ఫ్యాషన్‌తో దర్శకుడినయ్యాను. 
 
నటుడిగా, టెక్నీషియన్‌గా ఏఏ సినిమాకి వర్క్‌ చేశారు? 
– హీరోగా నా మొదటి సినిమా ‘పార్సిల్‌’, తరువాత ‘ఇంకాఏమి అనుకోలేదు’ సినిమాలో విలన్‌గా నటించాను. అలాగే ‘ఆమ్లెట్‌’ సినిమాలో మెయిన్‌ లీడ్‌గా నటించాను, హీరోగా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ‘వి’ సినిమా చేశాను. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ‘అనగనగాఒకరాజకుమారుడు’ సినిమా చేశాను. ఆ తరువాత నా స్వీయ దర్శకత్వంలో ‘షాలిని’ సినిమా చేశాను. ఆ సినిమాకు దర్శకుడిగా నాకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమాకు 75 రోజుల ఫంక్షన్‌ కూడా జరిపాము. తమిళ్‌లో కూడా హీరోగా 3 సినిమాల్లో నటించాను. 
 
కె ఎస్‌ 100 గురించి చెప్పండి? 
– ఈసినిమాకి నేనే స్టోరీ స్క్రీన్‌ ప్లే దర్శకత్వ బాధ్యతలు వహించాను. హాలీవుడ్‌ తరహాలో ఉండే ఒక రొమాంటిక్‌ హారర్‌ చిత్రం. కేవలం హారర్‌ కాకుండా మంచి ఎమోషన్‌ కూడా ఉంటుంది. ఫస్ట్‌ ఆఫ్‌ మొత్తం హారర్‌, కామెడీతో ఎంటర్‌ టైనింగ్‌గా సాగుతూ సెకండ్‌హాఫ్‌కి వచ్చేసరికి మంచి ఫ్యామిలీ ఎమోషన్‌తో కూడిన ఒక సందేశాత్మక చిత్రం. 
 
ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ల గురించి? 
– ఒక మంచి కంటెంట్‌ ఉన్న స్టోరీ కాబట్టి హీరో హీరోయిన్లుగా ఇంటర్‌నేషనల్‌ మోడల్స్‌ అయినా సమీర్‌ ఖాన్‌, సునీతా పాండే, శైలజ తివారి, ఆశిరాయ్‌, శ్రద్దా శర్మ, అక్షిత మాధవ్‌ లను తీసుకోవడం జరిగింది. నేషనల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న పూర్వి  కీలక పాత్రలో కనిపిస్తుంది. అలాగే విలన్‌ గా సుమన్‌ అనే నూతన నటుడు నటించారు. ప్రతి ఒక్కరు తమ పరిధి మేర బాగా నటించారు. 
 
కె ఎస్‌ 100 కాన్సెప్ట్‌ ఏంటి? 
– ఒక ఫ్రెష్‌ ఫీల్‌ ఉండే హర్రర్‌ సినిమా.. నలుగురు అమ్మయిలు వెకేషన్‌కి ఒక ఇంటికి వెళ్తారు. అక్కడ వారికి ఏదో ఆత్మ ఉందని తెలుస్తుంది. అసలు ఆ ఆత్మ ఎవరిది? అక్కడే ఎందుకు ఉంది, వారు దాని బారి నుండి ఎలా బయటపడ్డారు అనేది సినిమా చూసి తెలుకోవాల్సిందే. 
 
టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి? 
– సాధారణంగా కెఎస్‌ అంటే యూత్‌ వేరే వాటి గురించి ఆలోచిస్తారు. అయితే ఈ సినిమాలో కెఎస్‌ అంటే కుమార్‌, స్వామి అనే ఇద్దరుబెస్ట్‌ఫ్రెండ్స్‌. వారి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా సినిమా ఉంటుంది కాబట్టి ‘కె ఎస్‌ 100’ అని టైటిల్‌ పెట్టడం జరిగింది. అంతే తప్ప ఇది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా. 
 
మిగతా టెక్నిషియన్స్‌ గురించి చెప్పండి? 
– ఈ సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. ప్రతి పాటకి నవనీత్‌ చారి గారు అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. అలాగే లిరిక్స్‌ భాష్య శ్రీ. ఆయన సాహిత్యం గురించి మీ అందరికి తెలిసిందే..ఇక వంశీ సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి మంచి ఎసెట్‌. రామ్‌ మోహన్‌ చారి బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆడియన్స్‌కి ఒక ఫ్రెష్‌ ఫీల్‌ ఇస్తుంది. 
షూటింగ్‌ ఏఏ లొకేషన్స్‌ లో జరిపారు? 
– మా సినిమా గ్రాండ్‌గా ఉండాలని ప్రొడ్యూసర్‌ వెంకట్‌ రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించారు. కాకినాడ, హైదరాబాద్‌, కామారెడ్డి, గోవా, మహారాష్ట్రలోని అద్భుతమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించాము. 
 
మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌ ఏంటి? 
– ఒక ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీ ఉంది. దానికి కూడా వెంకట్‌ రెడ్డిగారే ప్రొడ్యూస్‌ చేయడానికి ముందుకు వచ్చారు. టైటిల్ కూడా రిజిస్టర్ చేయడానికి అప్లై చేశాం. జులై 12 ఈ సినిమా విడుదలయ్యాక ఆ సినిమా వివరాలు వెల్లడిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు షేర్‌.
 
 
 
 
 
10 Attachments