కొత్తగా మా ప్రయాణం సక్సెస్‌మీట్
నూతన కథానాయకుడు ప్రియాంత్ హీరోగా యామిని భాస్కర్ హీరోయిన్ గా ఈ వర్షం సాక్షిగా ఫేమ్ రమణ మొగిలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” కొత్తగా మా ప్రయాణం ” .
ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించి విజయం సాధించిన సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో…
రామారావు ఆర్టిస్ట్ మాట్లాడుతూ… ఈ సినిమా కోసం చెప్పాలంటే హీరోగారు టైటిల్ కొత్తగా మా ప్రయాణం అని పెట్టించుకోవడం గ్రేట్. కొత్త యాక్టర్ అయినా ఎక్కడా జంకు లేకుండా తడబడకుండా చాలా బాగా చేశారు. ప్రత్యేకించి నయమనిబంధనలు ఏమీ లేకుండా అందరూ నాలాగే ఫ్రీడమ్‌గా ఉండాలని కోరుకునే పాత్ర పోషించారు. హీరోయిన్ అంతర్వేదిటు అమలాపురం అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రానికి ఈ చిత్రానికి చాలా ఇంప్రూవ్ అయ్యారు. మన భారతదేశ సంస్కకృతి ప్రకారం ఒక ఆడ, మగ కలిసి ఉండాలంటే పెళ్లి చేసుకుని ఉండాలి లేదని ఉంటే ఈ సమాజంలో ఎదురయ్యే సమస్యల గురించి ఈ చిత్రంలో చాలా బాగా చూపించారు అన్నారు.
రామకృష్ణ మాట్లాడుతూ… చిన్న సినిమా అయినా ఇంత పెద్ద సక్సెస్ సాధించినంపదుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలోని హీరో నా క్లోజ్ ఫ్రెండ్ ఫస్ట్ మూవీ అయినా తన పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఈ యూనిట్ అందరికీ కృతజ్ఞతలు అని అన్నారు.
దేవేందర్ మాట్లాడుతూ… హీరో ప్రియాంత్ చాలా బాగా నటించారు. ఈ చిత్ర కాన్సెప్ట్ కూడా చాలా బావుంది. ఆయనకు ఇలాంటి సక్సెస్‌లు మరెన్నో రావాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు.
హీరో ప్రియాంత్ మాట్లాడుతూ… చాలా ఆనందంగా ఉందిక. మా చిత్రం జనవరి 25న విడుదలైంది. థియేటర్లు పెద్దగా దొరకలేదు. అందు వల్ల కేవలం 30 థియేటర్లలో మాత్రమే రిలీజ్ చెయ్యగలిగాము. అయినా రెండవ వారం కూడా ఇంత సక్సెస్‌గా నడుస్తుందంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నుంచి మరికొన్ని థియేటర్లు పెంచుతున్నాం. ఈ రోజు నుంచి 55 ధియేటర్ల వరకు పెంచుతున్నాం. ప్రేక్షకులకు ఈ చిత్రం చాలా బాగా నచ్చింది. కథ కథణం బాగా వచ్చాయి. ఇంకా ఈ చిత్రం చాలా మందికి రీచ్ కావాలని కోరుకుంటున్నాను. అందరూ ఈ చిత్రాన్ని థియేటర్స్‌కి వెళ్ళి చూసి మమ్మల్ని బ్లెస్ చెయ్యాలని కోరుకుంటున్నాను మీ అందరికీ నా కృతజ్ఞతలు అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో ప్రియాంత్ , యామిని భాస్కర్ , భాను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికిసంగీతం : కార్తీక్ కుమార్ రొడ్రీగ్, నిర్మాత : నిశ్చయ్ ప్రొడక్షన్స్, దర్శకత్వం : రమణ మొగిలి