కోరమీను మూవీ రివ్యూ
ఆనంద్ రవి ‘కోరమీను’ రివ్యూ
Emotional Engagement Emoji
అప్పట్లో వచ్చిన ‘ప్రతినిధి’ అనే చిన్న చిత్రం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో ఆనంద్ రవి రచయితగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ‘నెపోలియన్’తో రచయితగా, హీరోగా మరోసారి మెరిశారు. ఇప్పుడు మూడో సారి రవి కథ అందించడంతో పాటు హీరోగా నటించిన సినిమా ‘కోరమీను’ . డిఫరెంట్ ప్రమోషన్స్ తో మీసాల రాజుకి మీసాలు ఏమయ్యాయి.. అంటూ కొరమీను సినిమా ప్రమోషన్స్‌ను చేశారు. మీసాలు రాజు ఎవరు? అసలు మీసాలకు, కొరమీను సినిమాకు సంబంధం ఏంటి? అనే ఇంట్రెస్ట్ అందరిలోనూ క్రియేట్ అయ్యింది. ఆ ఇంట్రస్ట్ ని సినిమాలోనూ కంటిన్యూ చేసి హిట్ కొట్టారా… ఈ ఏడాది (2022)లో థియేటర్లలో విడుదలైన చివరి తెలుగు చిత్రం కొరమీను హిట్ కొట్టింగా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
”ఈ రోజు జాయిన్ అయిన మీసాల రాజు గారికి జాలరిపేటలో నిన్న రాత్రి ఎవరో మీసాలు తీసేశారని సమాచారం” టీవీలో వార్త. విజయవాడలో క్రిమినల్స్ కు కర్రు కాల్చి వాత పెట్టి, అవసరం అనుకుంటే ఎనకౌంటర్స్ తో భయపట్టి అక్కడ వారికి సింహస్వప్నమైన, ఎన్నో ఎంకౌంటర్లు చేసిన డీసీపి సీతారామ రాజు అలియాస్ మీసాల రాజు (శత్రు) విశాఖకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. సిటీలోకి వచ్చిన రోజునే ముసుగు వేసి జాలరిపేట బ్రిడ్జ్ దగ్గర ఎవరో అతడి మీసాలు తీసేసారు. పరువు పోయిందని పగతో రగులుతున్న శత్రు, మీసాలు తీసింది ఎవరో అని ఎంక్వైరీ మొదలు పెడతాడు. ఆ క్రమంలో జాలరిపేటకు చిన్న సైజ్ డాన్ కరుణ (హరీష్ ఉత్తమన్) గురించి తెలుస్తుంది. అలాగే అతని లవర్ మీను అలియాస్ మీనాక్షి (కిశోరీ ధాత్రక్) గురించి వినపడుతుంది. అంతేకాదు ఆమె కోసం తన డ్రైవర్ కోటి (ఆనంద్ రవి)తో కరుణ గొడవ పడటం గురించి పూర్తిగా తెలుస్తుంది. మీసాల రాజు విశాఖకు రావడానికి ముందు రోజు నుంచి మీను, కోటి, కరుణ కనిపించకుండా పోతారు. వాళ్ళ ముగ్గురూ ఎవరు.. ఏమయ్యారు? వీళ్ళకు ఈ మీసాల తీసివేత కార్యక్రమానికి లింకేంటి.. మధ్యలో వచ్చే డ్రగ్స్ మ్యాటర్ ఏంటి….జాలరిపేటలో అసలు ఏం జరుగుతోంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్..
ఇది స్క్రిప్టు ఓరియెంటెడ్ ఫిల్మ్. జాలరీపేటకు వచ్చిన మీసాల రాజు మీసాలు తీసేయడంతో మొదలైన కథ మెల్లిగా డెప్త్ లోకి వెళ్తుంది. విలన్ వైపు కథను టర్న్ చేస్తాడు. విలన్ కరుణ అరాచకాలు, సముద్ర తీర ప్రజల జీవనవిధానం ఆసక్తికరంగా తెరకెక్కించడంతో మనకు తెలియకుండానే ఎంగేజ్ అవుతాం. కరుణ, మీనాక్షి, అలాగే కోటి, మీనాక్షి మధ్య నడిచే డ్రామా కొంత ఆసక్తిగా ఉంటుంది. ఆనంద్ రవి మంచి డైలాలు రైటర్. ఆ డైలాగ్స్ ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేస్తాయి. ఏదో మంచి కథ, ఫీల్‌తో సినిమా ఉండబోతుందనే విషయం సినిమా ప్రారంభమైన కొద్ది సేపట్లోనే అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథను డీల్ చేసిన విధానం ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉందనిపిస్తుంది. అయితే చివరి 30 నిమిషాల్లో వచ్చే ట్విస్టులు అంతలా పేలలేదు. అలా వెళ్లిపోయాయి. థ్రిల్లర్ మోడ్ లో నడిచే కథ కాబట్టి ఇంట్రస్ట్ గా ముందుకు వెళ్లిపోతుంది. కొత్త ఆర్టిస్ట్ లు కావటంతో ఎక్కువ ఎక్సెపెక్ట్ చేయకపోవటం కూడా కలిసొచ్చింది.
ఎవరెలా చేసారు
నటుడుగా ఆనంద రవి మరో సారి ప్రూవ్ చేసుకున్నాడా అంటే ఎక్సప్రెషన్స్ మొహంలో ఎక్సప్రెసివ్ గా కనపడవు. వేరే ఆర్టిస్ట్ చేసి ఉంటే బాగుండేది. ఈ కథకు అతను ఫెరఫెక్ట్ అనలేం. తను రాసుకున్న డైలాగులు తనే చెప్పుకుంటూ వెళ్లాడు. హీరోయిన్ కిశోరి ధాత్రిక్ పాత్ర ఓకే అనిపించింది. సీనియర్ నటుడు రాజా రవీంద్ర పాత్ర చిన్నదే అయినా చాలా రోజుల తర్వాత చాలా పేరు వచ్చే పాత్రలో నటించారు. జబర్దస్త్ ఇమ్యాన్యుయేల్ కామెడీ కాకుండా ఓ కీలకమైన పాత్రలో కనిపించి అలరించారు. శత్రు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా.. డాన్ పాత్రలో హరీష్ ఉత్తమన్ బాగా చేశారు.
టెక్నికల్ గా చూస్తే రైటింగ్ విషయంలో ఆనంద్ రవి సక్సెస్ అయ్యారు. సినిమా ఎక్కడా బోరింగ్‌గా అనిపించదు. రవి స్క్రిప్టుని డైరెక్టర్ శ్రీపతి కర్రి సినిమాను స్క్రీన్‌పై బాగా చూపించారు. అనంత్ నారాయణ్ ఏజీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. యుద్ధమే అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో ఇబ్బంది కరమైన అంశం.. సినిమా స్లోగా ఉన్నట్లు అనిపించటమే.
ప్లస్ లు :
స్క్రీన్ ప్లే , దర్శకత్వం
ట్విస్ట్ లు
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
మైనస్ లు :
ఎక్కువ కొత్త మొహాలు
లీడ్ రోల్ రవికి ఎక్సప్రెషన్స్ పలక్కపోవటం
స్లో పేస్ నేరేషన్
ఎడిటింగ్
లాజిక్స్ మిస్ అవటం
చూడచ్చా?
కొత్త తరహాలో చెప్పబడ్డ ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ఓ వర్గానికి బాగా నచ్చుతుంది
బ్యానర్: ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్
నటీనటులు:ఆనంద్ రవి, హరీష్ ఉత్తమన్, శత్రు, కిషోరీ దత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, ఇందు కుసుమ, ప్రసన్న కుమార్, ఆర్కే నాయుడు తదితరులు
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ కొప్పెర
సౌండ్ డిజైన్: సాయి వర్మ ముదునూరి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సిద్ధార్థ్ సదాశివుని
ఎడిటర్: విజయ్ వర్ధన్ కె
పాటలు: అనంత నారాయణన్ ఏజీ
ప్రొడక్షన్స్ డిజైనర్: ముసి ఫణి తేజ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్ కుమార్ జన స్వామి
స్టోరీ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్: ఆనంద్ రవి
డైరెక్టర్: శ్రీపతి కర్రి
నిర్మాత : పెళ్లకూరు సమన్య రెడ్డి.
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి బియాండ్ మీడియా
స్టైలిష్: పూజ శేఖర్
Runtime:2 hrs 4 mins.
రిలీజ్ డేట్: 2022-12-31