క్యాసెటు గోవిందు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీస్

Published On: September 13, 2021   |   Posted By:
 
క్యాసెటు గోవిందు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీస్
 
ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీస్ చేసిన “క్యాసెటు గోవిందు” టీం                  
 
పాత చెప్పులు,నలిగిన షర్ట్ ,ఫ్యాన్టు,సైకిలు దాని క్యారేజ్కి టీవీ ఇలా సరికొత్త లుక్ తో తొలిపరిచయంతో దాసరిరాజు విమల్ హీరోగా, క్యాసెటు గోవిందు అనే టైటిల్తో ముందుకు వచ్చారు.
 
వినాయక చవితి సందర్భంగా విడుదల అయిన ఈ పోస్టర్కి మంచి స్పందన లభించింది.
 
ఒక పల్లెటూరు కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విరాజ్ వర్ధన్ దర్శకత్వం వహించగా,అనంత లక్ష్మీ కె సమర్పణలో మెక్బుల్ పిక్చర్స్ పై మణిధర్ కె నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
 
ఈ చిత్రం త్వరలో మొదటి షెడ్యూల్ పశ్చిమగోదావరి జిల్లాలో మొదలవబోతుంది.
 
ఈ చిత్రానికి మాటలు అశ్వత్థామ చిత్రానికి మాటలు అందించిన పరశురాం శ్రీనివాస్ అందించగా,కేమెరా త్రిలోక్ సిద్దు,సంగీతం ఎలీషా ప్రవీణ్ అందిస్తున్నారు.
 
 
నిర్మాత మణిధర్ మాట్లాడుతూ”ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన లభించింది,కొత్తవాళ్ళకి ఇండస్ట్రీ వెల్కమ్ చెప్పినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, ఇదే ఉత్సహంతో సినిమాని కూడా తెరకెక్కిస్తాం.త్వరలో మీ ముందుకు వస్తాం” అని తెలిపారు.
 
స్టోరీ- స్క్రీన్ ప్లే – దర్శకత్వం : విరాజ్ వర్ధన్
నిర్మాత:మణిధర్ కె
సహాయ రచన : మౌనిక వూరిటీ
మాటలు : పరశురాం శ్రీనివాస్ 
డి. ఓ.పి : త్రిలోక్ సిద్దు
సంగీతం : ఎలీషా ప్రవీణ్