Reading Time: 2 mins

క్రాక్ చిత్రం ట్రైల‌ర్ రిలీజ్

మాస్ కా బాప్ `క్రాక్` ట్రైల‌ర్ రిలీజ్

డాన్‌శీను, బ‌లుపు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ  ‘క్రాక్`. స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత బి. మ‌ధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ల‌లో క‌నిపించ‌నున్నారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

జ‌న‌వ‌రి 9న ఈ మూవీ విడుద‌ల‌చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 1న ఏఎంబి సినిమాస్‌లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో యంగ్ అండ్ టాలెండెట్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి `క్రాక్` మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల ‌చేశారు.

ఈ సంద‌ర్భంగా..

ప్రముఖ నిర్మాత నారాయ‌ణ‌దాస్ నారంగ్ మాట్లాడుతూ – “ త్వ‌ర‌లో విడుద‌ల‌వుతున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాల‌ని మ‌న‌స్పూర్త‌గా కోరుకుంటున్నాను. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ – “ముందుగా థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమా చూస్తున్న‌ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడికి నా హృద‌య‌పూర్వ‌క ద‌న్య‌వాదాలు. ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే ఈ సినిమాలో అంద‌రూ నాకు బాగా కావ‌ల్సిన వారే..మాస్ మహారాజా ర‌వితేజ గారు నాకు బాగా ఇష్ట‌మైన వ్య‌క్తి. ప‌ర్స‌న‌ల్‌గా కూడా నేను బాగా చ‌నువుగా ఉండే వ్య‌క్తి. అలాగే గోపి అన్న‌ది నాది ఒకే జిల్లా. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ప్ప‌టినుండి ఒక బ్ర‌ద‌ర్స్ లా ఎప్పుడూ క‌లిసే ఉంటాం. మా ఇద్ద‌రి మ‌ద్య  మంచి బాండింగ్ ఉంది.  అలాగే  నేను అసోసియేట్‌గా ఉన్న‌ప్పుడు నిర్మాత మ‌ధు గారితో కొన్ని సినిమాల‌కు వ‌ర్క్ చేయ‌డం జ‌రిగింది. వీళ్లంద‌రికి ఈ సినిమా ఒక గుర్తుండిపోయేంత పెద్ద హిట్ కావాలి. ట్రైల‌ర్‌లో ప్ర‌తి షాట్‌లో, ప్ర‌తి ఫ్రేమ్‌లో గోపి అన్న క‌సి క‌న‌బ‌డుతుంది. ముందే హ్యాట్రిక్ ఫిక్స్ అయ్యి ఈ సినిమా తీశాడు. అలాగే గోపి అన్న క‌సికి జీకే విష్ణుగారి ప‌నిత‌నం యాడ్ అయ్యింది. ఎక్ట్రార్డిన‌రీ విజువ‌ల్స్‌. అలాగే రైటింగ్ టీమ్ వివేక్, సాయి మాధ‌వ్ మ‌రియు వారి  టీమ్ అంద‌రికి నా బెస్ట్ విషెస్. త‌మ‌న్ గారు సూప‌ర్‌ఫామ్‌లో ఉన్నారు. ఈ సంక్రాంతికి ఆయ‌న‌కి మ‌రో మంచి హిట్ రావాల‌ని కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతికి మీ అరుపుల‌తో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవాలి. ట్రైల‌ర్‌లో ర‌వితేజ గారు చెప్పిన‌ట్టు ఈ సినిమా షూర్ షాట్‌ నో డౌట్“ అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ జీకే విష్ణు మాట్లాడుతూ – “సినిమాకి మంచి పాజిటీవ్ వైబ్స్ ఉన్నాయి. చాలా ఎగ్జ‌యిటెడ్‌గా ఎద‌రుచూస్తున్నాను. ర‌వితేజగారు, గోపి చంద్ గారితో వ‌ర్క్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఈ అవ‌కాశం ఇచ్చిన మ‌ధు స‌ర్ కి నా కృత‌జ్ఞ‌త‌లు. అలాగే థ‌మ‌న్ వ‌ల్లే నేను ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట‌ర‌య్యాను. ఆయ‌న‌కి నా స్పెష‌ల్ థ్యాంక్స్‌“ అన్నారు.

రైట‌ర్ వివేక్ మాట్లాడుతూ – “ ఇక్క‌డున్న మా వాళ్లంద‌రూ టీమ్ ఆఫ్ క్రాక్స్‌. ఈ సినిమాకోసం చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశాం. మూవీ చాలా బాగా వ‌చ్చింది. ఈ సినిమాతో చాలా ఎమోష‌న్స్ క‌నెక్ట్ అయ్యి ఉన్నాయి. సినిమా బాగా ఆడుతుంద‌ని ఆశిస్తున్నాను“ అన్నారు.

బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపిచంద్ మ‌లినేని మాట్లాడుతూ – “ అంద‌రికీ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. మేం అడ‌గ‌గానే వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన విక్ట‌రి వెంక‌టేష్ గారికి స‌భాముఖంగా ద‌న్య‌వాదాలు తెలుపుతున్నాను. డాన్‌శీను, బ‌లుపు త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌గారితో నా మూడ‌వ చిత్రం క్రాక్‌. ఒక మంచి క‌థ‌కి, మంచి ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్, మంచి ప్రొడ్యూస‌ర్ అన్నీ కుదిరితే  ఆ సినిమా క్రాక్. ఈ సారి సిని ప్రేమికుల‌కు, మాస్ మ‌హారాజా అభిమానుల‌కు సంక్రాంతి కొంచెం ముందుగానే రాబోతుంది. సంక్రాంతి శుభాకాంక్ష‌ల‌తో జ‌న‌వ‌రి 9న మా క్రాక్ సినిమా థియేట‌ర్‌ల‌లో విడుద‌లవుతుంది. ఈ మూవీకి ప్ర‌తి టెక్నీషియ‌న్ ఎంతో క‌ష్ట‌ప‌డి వ‌ర్క్ చేశారు. త‌మ‌న్ అద్భుత‌మైన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. మంచి సినిమాల్ని ఎప్పుడూ ప్రేక్ష‌కులు ఆదిరిస్తార‌ని ప్రేక్ష‌కులు నిరూపించారు. ఈ సినిమాని కూడా పెద్ద ఎత్తున ఆద‌రిస్తార‌ని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నాను“ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర నిర్మాత బి.మ‌ధు, సునీల్ నారంగ్‌, ఎడిట‌ర్ న‌వీన్ నూలి, లిరిసిస్ట్ కాస‌ర్లశ్యామ్‌, న‌టులు కాశి, ర‌చ్చ‌ర‌వి, వంశిచాగంటి, క‌త్తి మ‌హేష్ పాల్గొన్నారు.

తారాగ‌ణం:
ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌, స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీప్ర‌సాద్‌, చిర‌గ్ జాని, మౌర్య‌ని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి

సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని
నిర్మాత‌: బి. మ‌ధు
బ్యాన‌ర్‌: స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్‌
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: జి.కె. విష్ణు
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
స‌హ నిర్మాత‌: అమ్మిరాజు కానుమిల్లి
కూర్పు: న‌వీన్ నూలి
ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్ర‌కాష్‌
ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి