Reading Time: 2 mins

క్లాప్‌ చిత్రం ట్రైల‌ర్ ఆవిష్కరణ

ప్రతీ ఒక్కరికీ క‌నెక్ట్ అయ్యే మూవీ `క్లాప్‌`- ఆది పినిశెట్టి

మా క్లాప్ సినిమా లో కామెడీ, డాన్స్‌, ఫైట్స్ వుండ‌వు. కానీ చూసే ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అయ్యే అంశాలు ఇందులో వున్నాయ‌ని హీరో ఆది పినిశెట్టి తెలియజేసారు. ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ జంట‌గా శ‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌, శ్రీ షిర్డీసాయి మూవీస్ ప‌తాకాల‌ పై రామాంజ‌నేయులు జ‌వ్వాజి, ఎం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘క్లాప్‌’. బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ అధినేత ఐ.బి. కార్తికేయ‌న్ స‌మ‌ర్పిస్తున్నారు. పృద్వి ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు..

క్లాప్‌ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఈనెల 11న సోనీలివ్‌ లో విడుదల కాబోతోంది. ఈ సంద‌ర్భం గా గురువారం నాడు హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ ల్యాబ్‌ లో చిత్ర టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆవిష్కరణ జ‌రిగింది.

అనంత‌రం హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ, క్లాప్ జ‌ర్నీ మొద‌ల‌యి రెండున్న‌ర సంవ‌త్స‌రాలైంది. కోవిడ్ వ‌ల్ల ఆల‌స్య‌మైంది. నిర్మాత‌ల స‌పోర్ట్‌ తో విడుద‌ల‌కు వ‌చ్చాం. సోనీలివ్‌ లో ప్ర‌ద‌ర్శ‌న కాబోతుంది. నేను ఈ క‌థ‌ను విన్న‌ప్పుడు ప్రేక్ష‌కుడి గా ఫీల‌యి విన్నాను.`రంగ‌స్థ‌లం` త‌ర్వాత ఈ క‌థ విన్న వెంట‌నే చేసేద్దామ‌ని నిర్మాత‌ల‌కు చెప్పా. ఇందులో క‌మ‌ర్షియ‌ల్ అంశాలు లేక‌పోయినా ఆడియ‌న్‌కు బాగా న‌చ్చుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. చాలా కోణాలు ఇందులో ద‌ర్శ‌కుడు చూపించాడు. నేను,ఆకాంక్ష ఇద్ద‌ర‌మూ స్పోర్ట్స్‌ పర్సన్స్ గా న‌టించాం. మా ఇద్ద‌రి జ‌ర్నీ మ‌రొక‌రి భ‌విష్య‌త్‌ ను ఎలా తీర్చిదిద్దింద‌నేది ప్ర‌ధాన అంశం. ద‌ర్శ‌కుడు నిజాయితీగా తీశాడు. అంతే నిజాయితీ గా మేమంతా న‌టించాం. టెక్నీషియ‌న్స్ అలానే ప‌నిచేశారు. ఇళ‌య‌రాజా గారి రీరికార్డింగ్ సినిమాకు బ‌లం. ఒక సీన్‌ ను ఎలా వెలివేట్ చేయాలో ఆయ‌న ఆర్‌.ఆర్‌.లో బాగా చూపించారు. మంచి సినిమా తీయాల‌నే ప‌ట్టుద‌ల నిర్మాత‌ల్లో క‌నిపించింది. వారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నా. స‌క్సెస్ మీట్‌లో మ‌ర‌లా క‌లుద్దాం అని అన్నారు.

హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ, క్లాప్ మూవీలో న‌టించ‌డం గౌర‌వంగా భావిస్తున్నా. ఆది గారు చాలా ఓపిక‌తో చేశారు. ఇది అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే మూవీ. చాలా ఎమోష‌న్స్ ఇందులో వున్నాయి. న‌వ్వులు, బాధ‌లు వంటి అంశాలున్నాయి. ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల‌వుతుంది. చూసి ఎంజాయ్ చేయండి అని తెలిపారు.

నిర్మాత ఎం. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, నేను ఆది పినిశెట్టిగారి అభిమానిని. క‌థ విన‌గానే నిజాయితీ క‌నిపించింది. స్పోర్ట్స్‌ బేక్‌డ్రాప్‌లో ఈ త‌ర‌హా సినిమా రాలేద‌నిపించింది. ప్ర‌కాష్‌రాజ్‌, ఇళ‌యరాజా గారు ప‌నిచేస్తున్నార‌న‌గానే ఆనందమేసింది. ఇళ‌య‌రాజాగారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. ఏదైతే అనుకున్నామో దానిని ద‌ర్శ‌కుడు తీశాడు. ఇందులో ఆకాంక్ష, నాజ‌ర్ బాగా న‌టించార‌ని అన్నారు.

మ‌రో నిర్మాత రామాంజనేయులు జవ్వాజి మాట్లాడుతూ, క్లాప్ అనేది చాలా ఎమోష‌న‌ల్ మూవీ. ఆదితో సినిమా అన‌గానే ఆయ‌న ఎంపిక‌చేసుకునే క‌థ‌పై మాకు న‌మ్మ‌క‌ముంది. దానికితోడు ఇళ‌య‌రాజా సంగీతం ఎసెట్‌. మిగిలిన సీనియ‌ర్ న‌టులు బాగా న‌టించారు. అస‌లు ఈ సినిమాను థియేట‌ర్‌లోనే విడుద‌ల చేయాల‌నుకున్నాం. ఒమిక్రాన్ మూడో వేవ్ రావ‌డంతో సోనీలివ్‌తో క‌మిట్ అయ్యాం. ఈ సంద‌ర్భంగా మ‌ధుర శ్రీ‌ధ‌ర్‌కు ద‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాం. రేపు ఓటీటీలో రాబోతుంది. చూసి ఆనందించండి. ఆదిగారితో ముందుముందు సినిమాలు చేయాల‌నుకుంటున్నామ‌ని అన్నారు.

తారాగ‌ణం:

ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్‌, కృష్ణ కురుప్‌, నాజ‌ర్‌, ప్ర‌కాష్ రాజ్‌, రాందాస్‌, బ్ర‌హ్మాజీ

సాంకేతిక బృందం:

ద‌ర్శ‌క‌త్వం: పృథివి ఆదిత్య‌

నిర్మాత‌లు: రామాంజ‌నేయులు జ‌వ్వాజి, ఎం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి

స‌మ‌ర్ప‌ణ‌: బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ ఐ.బి. కార్తికేయ‌న్‌

బ్యాన‌ర్స్‌: శ‌‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌, శ్రీ షిర్డీసాయి మూవీస్‌

సంగీతం: మేస్ట్రో ఇళ‌య‌రాజా

సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌వీణ్ కుమార్‌

ఎడిటింగ్‌: రాగుల్‌

ఆర్ట్‌: వైర‌బాల‌న్‌, ఎస్‌. హ‌రిబాబు

ఫైట్స్‌: ఆర్‌. శ‌క్తి శ‌ర‌వ‌ణ‌న్

కొరియోగ్ర‌ఫీ: దినేష్ మాస్ట‌ర్‌