క్షీర సాగర మథనం చిత్రం ట్రైలర్ విడుదల

Published On: July 31, 2021   |   Posted By:
 
క్షీర సాగర మథనం చిత్రం ట్రైలర్ విడుదల
 
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన ‘క్షీర సాగర మథనం’ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అన్నారు ప్రముఖ నిర్మాత శరత్ మరార్. ఈ చిత్రాన్ని తాను చూశానని, దర్శకుడిగా అనిల్ పంగులూరికి ఉజ్వల భవిష్యత్ ఉందని మరార్ అభిప్రాయపడ్డారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 6 థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న “క్షీర సాగర మథనం” చిత్రం ట్రైలర్ శరత్ మరార్ విడుదల చేశారు.
     
 
మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందిన ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర  ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 
   
 
చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. మా చిత్రానికి మోరల్ గా ఎంతో సపోర్ట్ చేస్తున్న శరత్ మరార్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన చేతుల మీదుగా మా “క్షీర సాగర మథనం” ట్రైలర్ రిలీజ్  కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 6న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
     
 
చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి  పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ,  నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి.