కథనం చిత్రం టాకీ పూర్తి
అనసూయ కథనం టాకీ పూర్తి సమ్మర్‌లో విడుదల
ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కథనం. బి.నరేంద్రరెడ్డి, శర్మచుక్కా ఈ చిత్రానికి నిర్మాతలు. రాజేష్‌నాదెండ్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు సాంగ్స్ మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేసుకుని సమ్మర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో…
అనసూయ మాట్లాడుతూ… కథనం సినిమా పేరు. కథనం అంటే కథని నడిపే విధానం మా ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను క్షణంలో కనిపించిన పాత్రలో ఉన్నట్లు ఉందని అందరూ అనుకుంటున్నారు. కాని కాదు నాది ఈ చిత్రంలో ఎడి క్యారెక్టర్ ఒక అసోసియేట్ డైరెక్టర్ పాత్ర. ఈ సినిమా శ్రీ మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్, గాయత్రిఫిల్మ్స్, నరేంద్రగారు, శర్మగారు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శర్మగారు మంగళ చిత్రం చేశారు. అలాగే నరేంద్రగారు చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్. నన్ను మెయిన్ లీడ్‌గా చూపిస్తున్నారు. చాలా మంచి కాస్ట్ అండ్ క్రూతో ఈ చిత్రం వస్తోంది. పెళ్లి పృధ్వీగారు కూడా చాలా బాగా చేశారు. ఈ రోజు టాకీ పూర్తవుతుంది. 4షెడ్యూల్స్‌లో పూర్తయింది. సమ్మర్‌లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. మా యూనిట్ అందరికీ కృతజ్ఞతలు అన్నారు.
ధన్‌రాజ్ మాట్లాడుతూ…చాలా రోజుల తర్వాత అందరినీ కలిశాను. భాగమతి తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది నాకు. ఓ మంచి సినిమాతో అందరితో కలవాలనుకున్నా. పిల్లజమిందార్, భీమిలీకబాడీ జట్టు, రాజేష్‌గారు వచ్చి కథ చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు నేను హీరోకి ఫ్రెండ్‌గా చేశాను ఫస్ట్ టైం హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. జబర్దస్థ నుంచి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. అనుతో వచ్చే సీన్స్, వెన్నెలకిషోర్‌తో వచ్చేసీన్స్, రణధీతో వచ్చే సీన్స్ త్రూ అవుట్ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ మూవీ. చాలా మంచి క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుంది. శర్మగారికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు నా కృత్ఞతలు, ఇంకా రెండు సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అనసూయకి ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. రణధీర్ విలన్ అంటే చాలా సూపర్బ్‌గా చేశారు. క్రైమ్‌థ్రిల్లర్‌లో కొత్తదనం వస్తుంది. డైరెక్టర్ చాలా బాగా చూపించారు.
రణధీర్ మాట్లాడుతూ… నేను ధృద చేసిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నా. తర్వాత సైరా నర్సింహారెడ్డి. రాజేష్ నాకు చాలా కాలం నుంచి పరిచయం డైరెక్టర్‌గా కాదు. ఫ్రెండ్‌షిప్ యాంగిల్‌లో స్క్రిప్ట్ విన్నాను. బ్యూటిఫుల్ స్టోరీ. శర్మగారు యువత మూవీనుంచి నాకు పరిచయం. ధన నాకు అన్న లాంటి వాడు. మంచి ఒక ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పారు. షీ ఈజ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. శర్మగారికి అన్ని క్రాప్ట్‌తో పరిచయం ఉంది. ఈ సినిమా క్రెడిట్ మొత్తం శర్మగారికే చాలా కష్టపడ్డారు.
నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ… చిరంజీవిగారి అభిమానిని నేను. డిస్టిబ్యూటర్‌గా అన్నగారి సినిమాతో స్టార్ట్ అయ్యాను. పార్ట్ టైం ప్రొడ్యూసర్‌గా మంగళ చిత్రం చేశాను. ఈ రోజు ఫుల్ టైం ప్రొడ్యూసర్‌గా ఈ చిత్రంతో వచ్చాను. ఒక సినిమాని జడ్జ్ చెయ్యడం ఒక డిస్టిబ్యూటర్‌గా సినిమాని ఆడియన్‌లాగా జడ్జ్ చెయ్యగలం. కథ నచ్చి ఈ సినిమాని ప్రొడ్యూస్ చెయ్యాలనే ఆలోచనతో రావడం జరిగింది. అనసూయగారు ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. అనసూయగారు చేసిన రంగస్థలం కూడా నెల్లూరు డిస్టిబ్యూషన్ కూడా నేనే చేశాను. ఆయన ఏ సినిమా చేస్తే అది సూపర్ హిట్. ఇందులో ఫుల్ లెంగ్త్ కనపడుతున్నారు. ఇది డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ సినిమాలో ధనరాజ్‌గారు ఒక ఆర్టిస్ట్‌గా కాకుండా తన సినిమాలాగా ఫీలయి చాలా హెల్పింగ్‌గా ఉన్నారు. డైరెక్టర్‌గారి గురించి ప్రత్యకంగా చెప్పక్కర్లేదు. నాది ఆయనది ఒకే ఊరు నెల్లూరు ఆయన రాబోయే రోజుల్లో నెం.1 డైరెక్టర్ అవుతారని నమ్మకం ఉంది నాకు. మీ అందరి ఆశీస్సులు మాకు ఉంటాయని ఆశిస్తున్నాను అన్నారు.
రాజేష్ నదెండ్ల మాట్లాడుతూ… ఇది నా మొదటి చిత్రం. క్షణం, రంగస్థలం, కథనం మూడిటికి కూడా జీరో జీరో జీరో హేట్రిక్ కొట్టబోతుంది అనసూయగారు. ఈ సినిమా ఆమె ఒప్పుకోవడం నా అదృష్టం. ఎందుకంటే ఈ కథకి అనసూయగారే కరెక్టర్. నేను చాలా మంది అమ్మాయిలను అనుకున్నా ట్రై చేశాను కాని ఫైనల్‌గా అనసూయ మాత్రమే కరెక్ట్ అనిపించింది. ధనరాజ్‌గారు ఈ సినిమాకి చాలా చాలా హెల్ప్ చెయ్యడం ఈ రోజు ఈ సినిమా ఇంత వరకు వచ్చిందంటే ధనరాజ్‌గారి దయవల్లే ఇది నేను చాలా హార్ట్‌ఫుల్‌గా చెపుతున్నాను. టాకీ పూర్తయింది. నరేంద్రరెడ్డిగారు ఏ సినిమా చేసిన హిట్ ఆయనది లక్కీ హ్యాండ్. ఏ సినిమా చేసినా హిట్ అయ్యాయి. అందరికీ కృతజ్ఞతలు అన్నారు.
ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, వెన్నెలకిషోర్, పెళ్లి పృధ్వీ, సమీర్, ముఖ్తార్‌ఖాన్, రామరాజు, జ్యోతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్ః బాలాజీ శ్రీను, ఎడిటర్ఃఎస్.బి. ఉద్దవ్, మ్యూజిక్ః సునీల్ కశ్యప్, ఆర్ట్ డైరెక్టర్ః కె.వి.రమణ, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీః సతీష్ ముత్యాల, సమరి్పంచుఃఎమ్.విజయ చౌదరి, నిర్మాతలుః బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వంఃరాజేష్ నాదెండ్ల, పి.ఆర్.ఓఃవినయకరావు.