గాంధీ గారి జీవితంతో మేటనోయా చిత్రం
న్యూయార్క్ చిత్ర దర్శకుడు, రామ్ అల్లాడి గాంధీజీ జీవితం మీద నూతన కాంతులు ప్రసరిస్తూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసే ఉదాత్తాశయంతో,చారిత్రాత్మక మోహనదాస్ కరంచంద్ గాంధీ జీవిత చరిత్ర ‘మేటనోయా&39 అనే చిత్రం ద్వారా సమ్మోహనకరంగా నిర్మించి, విడుదల చేయనున్నారు.
గాంధీ గారి జీవితం లో యదార్థ సంఘటనల ఆధారంగా కొన్ని కాల్పనిక అంశాలతో మేటనోయా&39 చిత్రం పూర్తి స్థాయిలో అమెరికా లో నిర్మితమైంది.
హాలీవుడ్ పరిజ్ఞానం తో నిర్మించబడిన సెట్స్ పై గాంధీజీ బాల్యంనుండి , 1948 లో న్యూఢిల్లీ లో వారి హఠాన్మరణం వరకు ముఖ్య ఘట్టాలను, చరిత్ర కు చెందిన కాలపట్టికకు అనుగుణంగా పునర్నిర్మించారు.
ఇతివృత్తం:
మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ న్యాయవాది, వలసరాజ్య వ్యతిరేకి, జాతీయ
వాది, ఆస్తిక్య బుద్ధి గల రాజకీయ వేత్త. వారు తమ అహింసా శక్తితో, పౌర
హక్కుల ఉద్యమం తో, భారత్ ను బ్రిటీషు బానిసత్వం నుండి విముక్తి చేయడమే
కాకుండా ప్రపంచానికి శాంతియుత మార్గదర్శకుడైనారు.

‘మేటనోయా’: కాల్పనిక యాథార్ధ్యముల సమ్మేళనంతో, క్వాంటమ్ మెకానిజం, ఐన్స్టియన్
రోసన్బెర్గ్ బ్రిడ్జి, అంతరిక్షాంశాల వంటి శాస్త్రీయ విషయాలను మేళవించుతూ
గాంధీజీ జీవితాంశాలు వివరిస్తూ, వారి సిద్ధాంతాలతో కూడిన సుసంపన్న జీవిత గాథ ను
హృద్యంగా ఆవిష్కరిస్తుంది.

మతము, ప్రాంత రాజకీయం, ఏ ఒక్క దేశపు జెండా, ఆయుధం మరియు రక్తసిక్తమైన అంశాలు లేకుండా దర్శకుడు, జాతిపిత జీవితంలోని ఆధ్యాత్మిక, తాత్త్వికాంశాలను స్పష్ట
సంకేతాలతో అందంగా, ఈ చిత్ర కథ ను రూపొందించారు

అద్భుతమైన అంతర్జాతీయ చిత్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొనటంలో
తమకున్న సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించి రామ్ అల్లాడి తమ
లక్ష్యం సాధింపగలిగారు.

దర్శకునికి ఆబాల్యమూ గాంధీజీ పైనున్న మక్కువ ‘మేటనోయా’ లో ఆవిష్కృతమైంది.
గాంధీజీ తత్త్వము కేంద్ర బిందువుగా ఎక్కువ భాగం గాంధీజీ సొంత మాటలలోనే,
చిత్ర సంభాషణలు ఉంటాయి. గాంధీ గారి ఆత్మకథ సత్య శోధనమేజిక్ స్పెల్
అఫ్ ఆ బుక్&39; అనే అధ్యాయం ఆధారంగా కొన్ని కల్పానాంశాలతో రామ్ అల్లాడి
స్క్రీన్ప్లే రూపొందించారు.
సంగీతం:
గాంధీజీ కి సంగీతం చాలా ఇష్టం. ఈ చిత్రం సౌండ్ ట్రాక్ లో ఆ విషయం ప్రతిధ్వనించే విధంగా రామ్ అల్లాడి తగు జాగ్రత్తలు తీసికొన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ ఠాగూర్ గారి రచన ' ఏక్లా చలో ' గాంధీజీ కి ప్రీతి పాత్రమైన గీతం. ఆ గీతాన్ని తిరిగి భావించి, కూర్చి ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్ గా అమర్చటం గమనింప దగినది. గాంధీజీ కి ఇష్టమైన భారతీయ వాద్యములతో, ధ్వని
సామగ్రితో ఈ చిత్రం లోని సంగీతం నిర్వహింప బడింది. పేరుపొందిన భరద్వాజ్. వి.కొమరగిరి ఈ చిత్రాని కి నేపథ్య సంగీతం సమకూర్చారు.

అంతర్జాతీయ పరిజ్ఞానంతో కూడుకున్న దృశ్యమాన ప్రభావాలు 'Visual Effects', 19 వ శతాబ్దపు దృశ్యాలను ప్రతిబింబిచే ఛాయా గ్రహణం, ఐన్స్టియన్ రోసన్బెర్గ్
బ్రిడ్జి, అంతరిక్షాంశాల వంటి శాస్త్రీయ విషయాల కథనం, ప్రామాణికమైన
సంగీతం, అద్భుతమైన శబ్దగ్రహణం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు

‘Ar lt Works, LLC’ నిర్మాణ సారధ్యం లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీ, 2020 నాడు విడుదల కానుంది.